हैदराबाद: शहर के गच्चीबावली में एक टिप्पर वाहन ने तबाही मचाई। गच्चीबावली के विप्रो चौराह के पास एक तेज रफ्तार टिपर ने सिग्नल पर खड़ी चार कारों और दो बाइकों को टक्कर मार दी।
इस हादसे में एक व्यक्ति की मौके पर ही मौत हो गई, जबकि पांच अन्य घायल हो गए। हादसे के कारण सभी वाहन पूरी तरह से कुचल गए।
सूचना मिलने पर पुलिस मौके पर पहुंच गई और राहत व बचाव कार्य में जुट गई। घायलों को अस्पताल में भर्ती कि किया। मृतक की पहचान स्विगी के डिलीवरी बॉय नसीर के रूप में की गई है। घायलों में अब्दुल नामक छात्र का पैर टूट गया।
पुलिस ने मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है। टिप्पर चालक को गिरफ्तार कर लिया गया है। पुलिस का मानना है कि ब्रेक फेल होने के कारण हादसा हुआ है। इस संबंध में अधिक जानकारी की प्रतीक्षा है।
Crime News: టిప్పర్ బీభత్సం, ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
హైదరాబాద్: గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు బైక్‌లపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుడిని స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్‌గా గుర్తించారు. గాయపడిన వారిలో అబ్దుల్ అనే విద్యార్థికి కాలు విరిగిందని చెప్పారు. ప్రమాదం ధాటికి వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి.
ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
గచ్చిబౌలి విప్రో సర్కిల్లో ప్రమాదానికి కారణం అయిన టిప్పర్ డ్రైవర్ బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించామని గచ్చిబౌలి సీఐ సురేష్ తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. అయితే.. బ్రేకులు ఫెయిల్ అయ్యాయా లేదా అన్నది తెలియాల్సి ఉందన్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన డెలివరీ బాయ్ నసిర్ హుస్సేన్‌కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని సీఐ సురేష్ వెల్లడించారు. ఇక ప్రమాదంలో గాయపడ్డ అబ్దుల్ రజాక్ ఎమ్ జీఐటీలో థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు ఆయన తెలిపారు. సినిమా చూసి హాస్టల్‌కు వెళ్తున్న సమయంలో అబ్దుల్ రజాక్ ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. ఇక అబ్దుల్ రజాక్‌తో పాటు బైక్ పై ఉన్న మరో యువకుడు సేఫ్‌గా ఉన్నట్లు తెలిపారు. (Agencies)