“విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో నాణ్యత పెరగాలి”

• ఐ.సి.ఎస్.ఎస్.ఆర్. దక్షణ విభాగ గౌరవ సంచాలకులు ప్రొ. బి. సుధాకర్ రెడ్డి
• నిధుల వినియోగంలో దక్షినాది రాష్ట్రాల్లో తమిళనాడు అగ్ర స్థానం
• అంబేద్కర్ వర్సిటీలో పరిశోధనా పద్ధతులు, ఆర్ధిక సహకారంపై మూడు రోజుల సదస్సు

హైదరాబాద్: దేశంలో విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే పరిశోధనల్లో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని, ఆ పరిశోధన సామాన్య మానవులకు లబ్ది చేకూర్చేలా ఉండాలని ఉస్మానియా యూనివర్సిటీ ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ – ఎస్‌ఆర్‌సీ గౌరవ సంచాలకులు ప్రొ. బి. సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రొ. జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో “అకాడెమిక్ పరిశోధన మరియు పరిశోధనకు మద్దతు” అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న సదస్సును ప్రొ. బి. సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రొ. సుధాకర్‌ మాట్లాడుతూ సంస్థలపై జవాబుదారీతనం, పరిపాలనా భారం పెరగడంతో పరిశోధన మరింత ముఖ్యమైనదిగా, క్లిష్టమైనదిగా మారుతోందన్నారు. పరిశోధకులకు ఆర్ధిక పరంగా సహకారాన్ని అందించడానికి ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ – ఎస్‌ఆర్‌సీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మంచి పరిశోధనలకు బాసటగా నిలవడానికి తమ సంస్థ సిద్దంగా ఉందని, దానికి సరిపడా నిధులు తమ వద్ద ఉన్నప్పటికీ పరిశోధకులు వినియోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశోధక విద్యార్ధిగా ఉన్నప్పుడే ఆర్ధిక సహకారం పొందోచ్చని సూచించారు. పిఎచ్.డి. పూర్తి అయి పీడీఎఫ్ చేసే వారికి కూడా తమ వద్ద మంచి అవకాశాలు ఉన్నాయి అని, అయినప్పటికీ దక్షణాది రాష్ట్రాల్లో ఒక్క తమిళ నాడు తప్ప ఈ అవకాశాలను మరే ఇతర రాష్ట్రం ఉపయోగించుకోవడం లేదన్నారు.

రెండూ తెలుగు రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నిధుల సహకారం కోసం వచ్చే వారి సంఖ్య చాల తక్కువగా ఉందని ఆవేధన వ్యక్తం చేశారు. విశ్వవిధ్యాలయాల్లో పనిచేసి అధ్యాపకులకు కూడా పరిశోధన ప్రాజెక్టులకు నిధులు అందించనున్నట్లుగా వెల్లడించారు. తమ దగ్గర మైనర్ , మేజర్ , ఇతర సంస్థలతో అవగాహనా పద్ధతిలో పరిశోధనలకుగాను ఎక్కువ మొత్తం లో నిధులు అందిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంధ్ర ప్రాంత పరిశోధక విద్యార్ధులు , విశ్వవిద్యాలయాలు అందిపుచ్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య.కె. సీతారామారావు మాట్లాడుతూ విశ్వ విద్యాలయాల్లో జరిగే పరిశోధనలు సమాజానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలా, భారత దేశ చరిత్ర, సంస్కృతిని కాపాడేలా ఉండాలన్నారు. సామాజిక రుగ్మతలను పారద్రోలేలా ప్రజలను చైతన్య పరచేలా ఉండాలన్నారు. తమ విశ్వవిద్యాలయంలో స్కాలర్స్ కి ఈ అంశాలను నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథితులుగా పాల్గొన్న విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ గతంతో పోలిస్తే విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనల్లో నాణ్యత పడిపోతుందని ఇది సమాజానికి మంచిది కాదని ఆవేదన వ్యక్త పరిచారు. ప్రొ. జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డైరెక్టర్ ప్రో. సుధారాణి మాట్లాడుతూ ఈ సదస్సు నిర్వహణ అవసరం, ఆవశ్యకతను వివరించారు.

మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో అనేక మంది సామాజిక శాస్త్రాల అధ్యాపకులు పాల్గొని పరిశోధక విద్యార్ధులకు మార్గ నిర్దేశనం చేయనున్నట్లుగా వెల్లడించారు . కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు, డీన్లు, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

QUALITY OF RESEARCH IN UNIVERSITIES SHOULD INCREASE

• Prof. B. Sudhakar Reddy, Honorary Director, ICSSR-SRC
•Tamil Nadu tops the southern states in utilization of funds
• BRAOU organised 3 day workshop on “Research methods and Financial support”

Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU), Prof.G.Ram Reddy Centre for Research and Development organized a three day workshop on “Academic Research and Research Support” on May 16 to 18, 2023 at the University Campus. Prof. B. Sudhakar Reddy, Honorary Director, ICSSR-SRC, Osmania University, Hyderabad was the chief guest and stated that there is a need to increase the quality of research conducted in universities in the country and that research should benefit the common man.

Prof. Sudhakar Reddy said that with increasing accountability and administrative burden on organizations, research is becoming more important and critical. He expressed his concern that ICSSR-SRC is always available to provide financial support to researchers and that their organization is ready to stand as a base for good research, and researchers are not using it even though they have enough funds. It is suggested that financial support can be obtained while being a Research student. He said that there are good opportunities for those who complete their Ph.D and do PDF, but in the southern states, except Tamil Nadu, no other state utilizes these opportunities.

He expressed the plea that the number of people coming for funding support for research and project management in the universities of Telugu states is very less. It has been revealed that funds for research projects will also be provided to teachers working in the Universities. It is suggested that research students and universities of Telangana and Andhra Pradesh should take advantage of this opportunity as they are providing a large amount of funds for research in an understanding manner with their minor, major and Collaboration with other institutions.

Prof K. Seetharama Rao, Vice-Chancellor, BRAOU presided over the program. Prof. Rao mentioned that the research conducted in the universities should be useful to the society, especially the rural people, to preserve the history and culture of India. They want to sensitize people to eradicate social ills. He also said that this workshop has been organized with the intention of teaching these topics to the scholars in their university.

Prof. Ghanta Chakrapani, Director (Academic) attended as Guests of Honour for the program and said that compared to the past, the quality of research conducted in universities is going down and this is not good for the society. Prof.E.Sudha Rani, Director GRCR&D, explain the aims, objectives of the program and introduced the chief guest. She explained the need and necessity of organizing this workshop.

It has been revealed that many social science teachers will participate in this three-day workshop and guide the research students. All Directors, Deans, Heads of the Branches, Teaching and Non-Teaching staff, Representatives of services associations, Research Scholars & Students are participated in the program.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X