తిరుమల గరుడాద్రి పర్వత శ్రేణులు వద్ద విద్యుత్ దీపాలతో ఆధ్యాత్మిక పులకింత కనువిందు చేస్తుంది..
ఆ దీపాల కాంతుల్లో సప్తగురులు స్వర్ణ శోభితమై భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
తిరుమల: తిరుపతికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల శ్రీవారి భక్తులకు.. తిరుపతి ప్రజలకు ఆధ్యాత్మిక పులకింతను, మానసిక ఉల్లాసాన్ని అందించాలనే సదుద్దేశంతో.. టీటీడీ సివిల్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులకు సుందరీకరణలో భాగంగా ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవల పలు అదేశాల జారీ చేశారు. అందులో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే మొదటి ఘాట్ రోడ్ లోని చివర్లో ఉన్న గరుడాద్రి పర్వత శ్రేణులు వద్ద విద్యుత్ దీపాలను టీటీడీ విద్యుత్ విభాగం ఏర్పాటు చేసింది. కొన్ని అనివార్య కారణాల వలన గత ఐదేళ్లు విద్యుత్ వెలుగులు లేని ఆ కొండ భాగం.. నేడు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చొరవతో కాంతులీనుతూ చూపరులకు కనువిందు చేస్తుంది. ట్రయిల్ రన్ క్రింద 6 ఫోకస్ లైట్లను వినాయక స్వామి ఆలయం దగ్గర సిబ్బంది ఏర్పాటు చేశారు. ఆ దీపాల కాంతుల్లో సప్తగురులు స్వర్ణ శోభితమై భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది అంటున్నారు.
తిరుమల శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 450 పై చిలుకు ఉత్సవాలలో 25 రోజుల అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబరు 30 నుంచి 2025 జనవరి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా జరగనుంది. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.
Also Read-
టీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం ఇవాళ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జే శ్యామలరావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు నంబరు 0877-2263261 ను సంప్రపదించాలి అన్నారు.
వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు
- అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు
- అలహాబాద్ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం
- డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్రీ జె.శ్యామల రావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇవి.
- వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తాం.
ఆన్‌లైన్ దర్శన టికెట్ల వివరాలు
- 1.40 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను డిసెంబరు 24న ఆన్‌లైన్‌లో విడుదల చేశాం.
- శ్రీవాణి దర్శన టికెట్లు జనవరి 10న 1500, మిగిలిన 9 రోజులకు 2000 టికెట్లు మరియు గదుల కోటాను డిసెంబరు 23న ఆన్‌లైన్‌లో విడుదల చేశాం.
- ఈ టికెట్లను పొందిన భక్తులకు మహాలఘు దర్శనం ఉంటుంది.
దాతలకు దర్శనం, బస
- ఆన్‌లైన్‌లో దర్శనం బుక్ చేసుకున్న దాతలను రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తాము.
- సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుండి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగతారోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల వివరాలు
- తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తాం.
- జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తాం.
- తదుపరి రోజులకు (13 నుండి 19వ తేదీ వరకు) ఏ రోజుకారోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు జారీ చేస్తాం.
తిరుపతి, తిరుమలలో కౌంటర్లు
- భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం.
- కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నాం.
- సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి.
- గోవిందమాల భక్తులు కూడా దర్శన టోకెన్లు పొంది దర్శనానికి రావాల్సి ఉంటుంది.
భక్తులకు విజ్ఞప్తి
- దర్శనటోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరడమైనది.
- చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు రద్దు చేయడమైనది.
- భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులలో విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు, అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది.
శ్రీవారి ఆలయం
- అదేవిధంగా జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.
- జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
- జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తాం.
అధ్యయనోత్సవాలు
- తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 30వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.\
భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు
- 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢల్లీి, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా కూడా క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాం.
జనవరి 13వ తేదీ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం
- హిందు ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తాం.
- ప్రయాగ్‌రాజ్‌లోని భజరంగ దాస్ రోడ్డు, వాసుకీ ఆలయం ప్రక్కనే గల సెక్టారు 6 నందు శ్రీవారి ఆలయంను ఏర్పాటు చేస్తున్నాం.
- ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తాం.
- ప్రతిరోజు ఈ నమూనా ఆలయంలో తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తాం.
- ఈ సందర్భంగా జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో శ్రీవారి కల్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
నవంబరు నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
- శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.35 లక్షలు.
హుండీ :
- హుండీ కానుకలు రూ.111.30 కోట్లు.
లడ్డూలు :
- విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 97.01 లక్షలు.
అన్నప్రసాదం :
- అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 19.74 లక్షలు.
కల్యాణకట్ట :
తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.31 లక్షలు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీమతి గౌతమి, సివిఎస్వో శ్రీ శ్రీధర్, సిఈ శ్రీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వైకుంఠ ఏకాదశికి ఆఫ్‌లైన్‌లో టోకెన్ల జారీ- డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ జె.శ్యామలరావు
వైకుంఠ ఏకాదశికి ఆఫ్‌లైన్‌లో టోకెన్ల జారీ
– 10 రోజుల పాటు సిఫార్సు లేఖలు అనుమతించం
– టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం
– వైకుంఠ ఏకాదశి రద్ధీ నేపథ్యంలో భక్తులకు విజ్ఞప్తి
– టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను అభినందించిన భక్తులు
– డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ జె.శ్యామలరావు
తిరుమల: సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుఠ ఏకాదశికి తిరుపతి, తిరుమలలోని 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. భక్తుల రద్ధీ నేపథ్యంలో టిటిడికి సహాకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, చేపట్టిన సంస్కరణలను పలువురు భక్తులు అభినందించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో 31 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
- శ్రీమతి ముని లక్ష్మి – తిరుపతి, బాలరాజు – కొత్తపేట, వెంకటరమణ – చిత్తూరు
ప్రశ్న : వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు 10 రోజుల పాటు వసతి పొందేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, శ్రీవారి మెట్టు నడక మార్గంలో దర్శనం టోకెన్లు ఇవ్వాలని, రైల్వే రిజర్వేషన్ ను 90 రోజుల నుండి 60 రోజులకు తగ్గించినందున ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలు బుకింగ్‌ను మూడు నెలల నుండి రెండు నెలలకు తగ్గించాలని కోరారు.
ఈవో : తిరుమలలో వసతికి కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు, ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవల బుకింగ్ కాల వ్యవధి మూడు నెలల నుండి రెండు నెలలకు తగ్గించే విషయం పరిశీలిస్తాం. వైకుంఠ ద్వారా దర్శనానికి తిరుపతిలో 1.20 లక్షల ఎస్ఎస్‌డి టోకెన్లు జారీ చేస్తాం.
- సత్యానంద రెడ్డి – విశాఖపట్నం, లక్ష్మీ – శ్రీకాళహస్త్రీ
ప్రశ్న : తిరుమలలో వయోవృద్ధులకు పాత పద్ధతిలో ఆధార్ కార్డుతో శ్రీవారి దర్శనం కల్పించండి.
ఈవో : ఆన్ లైన్లోనే వయోవృద్ధులు, దివ్యాంగులు శ్రీవారి దర్శనం టికెట్లు పొందాలని, ఆఫ్ లైన్ లో దర్శనానికి అనుమతించడం వీలు కాదు.
- నరసింహారావు – హైదరాబాద్, సాయికుమార్ – వనస్థలిపురం, క్రిష్ణ మూర్తి – కాకినాడ, రఘు – బల్లారి
ప్రశ్న : కరోనా సమయం నుండి ఎస్వీబీసీ లో భారతం, భాగవతం, రామాయణం వంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఇటీవల కాలంలో నిలిపివేశారు. వీటిని తిరిగి ప్రసారం చేయండి.
ఈవో : పరిశీలిస్తాం.
- ప్రకాష్ రావు – హైదరాబాద్, రాజశేఖర్ – చిత్తూరు
ప్రశ్న : శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సన్నిధిలో శ్రీవారి సేవకులు, మహిళా ఉద్యోగులను నియమించండి.
ఈవో : భక్తులతో దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. మహిళా ఉద్యోగులను నియమిస్తాం.
- సత్యనారాయణ – విజయవాడ
ప్రశ్న : తిరుమలలో వృద్ధులు వసతికి సిఆర్ఓ వెళ్లి ఎక్కువ సమయం నిలబడుక్కోవాల్సి వస్తుంది. రాంభగీచ బస్టాండ్ దగ్గర కౌంటరు పునః ప్రారంభించండి.
ఈవో : ఆఫ్ లైన్‌లో వసతి పొందే వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు పరిశీలిస్తాం.
- సుమన్ – వరంగల్ , ప్రశాంత్ రెడ్డి – రాజంపేట
ప్రశ్న : అంగప్రదక్షణం టోకెన్లు ఆఫ్‌లైన్లో జారీ చేయండి.
ఈవో : ఆఫ్ లైన్‌లో అంగ ప్రదక్షిణ టోకెన్లు జారీ చేయడం కుదరదు
- విష్ణు – రేణిగుంట
ప్రశ్న : అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రత సిబ్బంది లగేజీని సరిగా చెకింగ్ చేయడం లేదు. ఆన్‌లైన్ లక్కీ డిప్ వేయడానికి కుటుంబంలో ఇద్దరికి కాకుండా ముగ్గురికి అవకాశం కల్పించండి.
ఈవో : అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది క్షుణంగా తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటాం. కుటుంబంలో ఇద్దరికి మించి అవకాశం కల్పించడం కష్టం.
- రాజేశ్వరి – బెల్గాం
ప్రశ్న : వైకుంఠ ఏకాదశికి శ్రీవారి సేవ అదనపు కోటా విడుదల చేయలేదు.
ఈవో : వైకుంఠ ఏకాదశికి అవసర సేవకులు ఆన్‌లైన్‌లో రిజిష్టర్ చేసుకున్నారు. కావున అదనపు కోటా అవసరం లేకుండా పోయింది.
- దేవకి – శ్రీరంగం
ప్రశ్న : మూడు నెలల ముందు శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని రాలేనప్పుడు, ఆ టికెట్లను అదే నెలలో మరో రోజు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించండి.
ఈవో : శ్రీవారి దర్శనానికి అన్ని స్లాట్లు అన్ని రోజులు బుక్ అయి ఉంటాయి, వీలు కాదు.
- నారాయణరెడ్డి – గుంటూరు
ప్రశ్న : వయోవృద్ధుల దర్శనానికి 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించండి.
ఈవో : పరిశీలిస్తాం
- హర్ష – బెంగళూరు
ప్రశ్న : రెండు సంవత్సరాల క్రితం సప్తగిరి మాసపత్రికకు చందా కట్టాను, ఇంతవరకు పత్రిక అందలేదు.
ఈవో : సప్తగిరి మాసపత్రిక అందెలా చర్యలు తీసుకుంటాం.
- శేఖర్ – మచిలీపట్నం
ప్రశ్న : శ్రీవారి దర్శనానికి ప్రవేశించే మార్గం చాలా దూరంగా ఉంటుంది, రద్దీ లేని సమయంలో దూరం తగ్గించండి. తిరుమలలో టాక్సీలు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. టీటీడీ ఉచిత రవాణా బస్సుల సంఖ్యను పెంచండి.
ఈవో : తిరుమలలో భక్తుల రద్దీ లేని రోజులలో దగ్గరగా భక్తులను అనుమతిస్తున్నారు. ప్రైవేట్ వాహనాలు ఎక్కువ మొత్తంలో భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. భక్తుల సౌకర్యార్థం టిటిడి ఇప్పటికే 12 ధర్మరథాలను నడుపుతొంది. త్వరలో మరిన్ని వాహనాలు రానున్నాయి.
- నారాయణ – తుని
ప్రశ్న : వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో టిటిడి సిబ్బంది, ఫోను ఏర్పాటు చేయండి.
ఈవో : కంపార్ట్మెంట్లలో ఫోన్ సౌకర్యం ఉంది. సిబ్బంది ఉన్నారు.
- కిరణ్ – శ్రీకాకుళం
ప్రశ్న : వైకుంఠ ఏకాదశి టికెట్ల బుకింగ్‌లో పేమెంట్ సమస్య వస్తోంది. వర్చువల్ టైం తక్కువగా ఉంది.
ఈవో : ఏకాదశి టికెట్ల బుకింగ్ పేమెంట్ సమస్య ఉంటే మా అధికారులు మాట్లాడి పరిశీలిస్తారు.
- మురళి – హైదరాబాద్
ప్రశ్న : ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు లభిస్తున్నాయి, కానీ వసతి లభించడం లేదు. త్వరగా అయిపోతున్నాయి. లడ్డు ముద్దగా ఉంటుంది.
ఈవో : ఆన్‌లైన్‌లో నాలుగు నుండి ఐదు లక్షల మంది బుకింగ్‌కు ప్రయత్నించడం వలన ఎస్ఈడి టికెట్లు 15 నిమిషాల్లోనే అయిపోతాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను దిట్టం ప్రకారం తయారు చేస్తున్నారు.