ఆత్మ విశ్వాసమే వజ్రాయుధం
రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నూతన విద్యా విధానం అమలు చేయాలి
ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాతీయ మండలి సమావేశం
పాల్గొన్న 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉపాధ్యాయ సంఘాల నాయకుల హాజరు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మనోధైర్యాన్ని నింపారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సమాజంలో ఎవరికైనా ఆత్మవిశ్వాసమే వజ్రాయుధమని, అలాంటి ఆత్మ విశ్వాసాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
Note : Please Subscribe ‘Telangana Samachar’ Youtube Channel
మంగళవారం నారాయణగూడ తాజ్ మహల్ హోటల్ లో జరిగిన 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాతీయ మండలి సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ జాతీయ నూతన విద్య నూతన విద్యా విధానం లో అనేక లోటుపాట్లు ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
విద్య ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని, విద్యా హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ ద్వారా అమలులోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు నిరంతరంగా తమ సబ్జెక్టులలో పునఃశ్చరణ జరుపుకోవాలని, అప్పుడే ఆయా సబ్జెక్టులలో మరింత పట్టు సాధిస్తారని పడ్డారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాదాయ సంఘాల జాతీయ మండలి సభ్యులకు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఉద్యమ నేపథ్యాన్ని… సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ, ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలను, జాతీయ స్థాయిలో అవార్డులు – రివార్డులు, సాధించిన ఘనతను వినోద్ కుమార్ వివరించారు.
బీ.ఆర్.ఎస్. పార్టీ ఆవిర్భావం గురించి కూడా వినోద్ కుమార్ ఈ సందర్భంగా వారికి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు అశ్వని కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ జాతీయ మండలి సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.