हैदराबाद: कुछ महिलाओं ने थाने में शिकायत दर्ज कराई है कि उनके पति को ढूंढकर ले आये। हां यह सच है। एक नहीं, दो नहीं, एक व्यक्ति ने पांच महिलाओं के साथ शादी की और उनके पैसे और जेवर लेकर फरार गया। ठग जाने का पता चलने पर एक व्यक्ति की पांच बीबियों ने अलग-अलग थानों में शिकायत दर्ज की है।
शहर के बंजारा हिल्स और सनतनगर एरिया में एक व्यक्ति ने महिलाओं को अपने जाल में फंसाया और एक-दूसरे को पता चले बिना उनसे शादी कर ली और मौका मिलते ही नकदी और कीमती सामान लेकर फरार हो गया। कई थानों में पांच महिलाओं द्वारा उनके पति को ढूंढकर ले आने की गई शिकायत के बाद बहुविवाह करने वाले पति का मामला सामने आया है।
इन पत्नियों की गैंग कंप्लेंट की जांच करने वाली पुलिस ने पाया कि इन पांचों पत्नियों का प्यारा पति एक ही है। पत्नियों को पता चला कि एक ही आदमी ने पांच शादियां की हैं। इन थाने में एक व्यक्ति के गुमशुदगी होने के एक जैसे मामले दर्ज किये गये। इसके चलते पांच पत्नियां अब एकजुट हो गए और एक स्वयंसेवी संगठन की मदद से अपने प्यारे धोखेबाज पति की तलाशी करने में जुट गई है। पुलिस को विश्वास है कि किसी सीसीटीवी फुटेज में उसकी एक झलक दिख जाये तो ढूंढ निकालने में आसानी होगी।
ఒక వ్యక్తి ఐదుగురు మహిళలతో వివాహం చేసుకున్నాడు, డబ్బు, నగలు తీసుకొని ఉడాయించాడు
హైదరాబాద్ : మా భర్తను వెతికి పెట్టండి సారూ అంటూ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు కొందరు మహిళలు. అవును.. ఒకటికాదు, రెండుకాదు ఓ ఘటనుడు ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని సదరు భార్యల వద్దనుంచి డబ్బు, నగలు తీసుకొని ఉడాయించాడు. మోసపోయామని తెలుసుకున్న భార్యలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
నగరంలోని బంజారాహిల్స్ సనత్ నగర్ పరిసర ప్రాంతాలలో మహిళలకు ఆశ చూపించి ట్రాప్ లో పడేసి ఒకరికి తెలియకుండా మరొకరిని అలా ఐదుగురుని వివాహాలు చేసుకుని నగదు తో పాటు విలువైన సామాగ్రి తీసుకొని మాయమైపోయాడు. తనమ భర్త ఎక్కడ ఉన్నాడో ఎతికి పెట్టమంటూ పలు పోలీస్‌స్టేషన్లలో మహిళలు చేసిన ఫిర్యాదులతో ఈ బహుభార్యల భర్త విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ భార్యల గ్యాంగ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు ఈ ఐదుగురు భార్యల ముద్దుల మొగుడు ఒకడేనని తేలింది. ఒకే వ్యక్తి పైన పలు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసులు రావడంతో ఇతను ఐదు వివాహాలు చేసుకున్నాడని భార్యలకు తెలిసింది. దాంతో ఈ భార్యామణులంతా ఏకమై తమ చీటింగ్ మొగుడికోసం ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో వెతకడం మొదలు పెట్టారు. (ఏజెన్సీలు)