अंकूर अस्पताल में भीषण आग, बिल्डिंग मालिक ने मौके पर मौजूद मीडिया कर्मी पर किया हमला

हैदराबाद: शहर के गुड़ी मलकापुर में अंकुरा अस्पताल में भीषण आग लग गई। शनिवार को शाम करीब पांच बजे पांच मंजिला अस्पताल भवन की छत पर आग लग गयी। छत तपस की तरह आग लग गई। काबू पाने में देरी के कारण आग पूरे अस्पताल में फैल गई।

अस्पताल के कर्मचारियों ने स्थानीय लोगों की मदद से मरीजों को बाहर निकाला। भीषण आग के कारण आसपास की इमारतों में मौजूद लोगों को भी बाहर निकाला गया। सूचना मिलने पर दमकल कर्मी और डीआरएफ की टीम मौके पर पहुंची और आग पर काबू पाया।

అంకురా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం, ఘటనస్థలంలో మీడియాపై బిల్డింగ్ ఓనర్ దాడి

హైదరాబాద్: సిటీలోని గుడి మల్కాపూర్ లో ఉన్న అంకురా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఐదు అంతస్తుల ఆస్పత్రి భవనంలోని టెర్రస్ పై మంటలు చెలరేగాయి. టపాసులు పేలినట్లు టెర్రస్ పై మంటలు ఎగిసిపడ్డాయి. అదుపు చేసేందుకు ఆలస్యం కావటంతో ఆస్పత్రి మొత్తం మంటలు వ్యాపించాయి.

స్థానికుల సాయంతో ఆస్పత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో చుట్టు పక్కల భవనాల్లోని వారు సైతం ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది డీఆర్ ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు.

ఈ క్రమంలో ఘటనపై కవరేజ్ కు వెళ్లిన మీడియా సిబ్బందిపై ఆస్పత్రి ని నిర్వహిస్తున్న బిల్డింగ్ ఓనర్ కింగ్ కోహినూర్ బిల్డర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బిల్డంగ్ కు ఎటువంటి పర్మిషన్ లేకుండా నిర్మించారని పలువురు ఆరోపిస్తున్నారు. కింగ్ కోహినూర్ ఓనర్ ఇంటిపై ఇప్పటికే పలుమార్లు ఐటీ సోదాలు జరిగాయి. ఇండియాలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేసిన కింగ్స్ కోహినూర్ డైరెక్టర్ కొడుకు నసీర్ ఖాన్ మీడియాపై దాడి చేశాడు. సెల్ ఫోన్లు లాక్కున్నారు.

అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది. ఎందుకు జరిగింది అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎవరైనా గాయపడ్డారా. చనిపోయారా అనే విషయాలు అధికారికంగా ప్రకటించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X