हैदराबाद : कर्नाटक में भीषण बस हादसा हुआ। एक प्राइवेट ट्रैवल स्लीपर बस को तेज रफ्तार लॉरी ने टक्कर मार दी। इसके बाद बस और लॉरी में आग लग गई। इस हादसे में 17 लोग ज़िंदा जल गए। बेंगलुरु से गोकर्ण जा रही निजी ट्रैवल बस चित्रदुर्ग ज़िले के गोर्लतु गांव के पास दुर्घटनाग्रस्त हो गई। हादसे में लॉरी और बस पूरी तरह जल गए। चश्मदीदों ने बताया कि हिरियुर से बेंगलुरु जा रही लॉरी ने कंट्रोल खो दिया और सड़क के दूसरी तरफ जा रही ट्रैवल बस को टक्कर मार दी।

सूचना मिलने के बाद पुलिस और फायर डिपार्टमेंट के कर्मी मौके पर पहुंचे। फायर डिपार्टमेंट कर्मी ने आग पर काबू पाया। हादसे की वजह से इलाके में भारी ट्रैफिक जाम लग गया। हादसा तब हुआ जब यात्री गहरी नींद में सो रहे थे। इससे पहले कि कोई कुछ समझ पाता, बस पूरी तरह आग की लपटों में घिर गई। 17 लोग ज़िंदा जल गए। यात्रियों को बस से बाहर नहीं निकल पाए। यह हादसा सुबह 2 बजे हुआ। पुलिस ने बताया कि हादसे के समय बस में 32 यात्री थे और मरने वालों की संख्या बढ़ने की संभावना है।
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం,17 మంది సజీవదహనం
హైదరాబాద్ : కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ప్రమాదంలో 17 మంది సజీవదహనమయ్యారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుకు అటుపక్క వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటలు బస్సును పూర్తిగా కమ్మేశాయి. బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 17 మంది సజీవదహనం అయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. (ఏజెన్సీలు)
