యాదవ ముద్దు బిడ్డ కు అవకాశం ఇచ్చినందుకు శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి కి ధన్యవాదాలు
యాదవ విద్యావంతుల వేదిక
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా ముడా ఛైర్మన్ గా ఎన్నికయిన యాదవ జాతి ముద్దు బిడ్డ మన లక్ష్మణ్ యాదవ్ అన్నకి యాదవ విద్యావంతుల వేదిక తరుపున ఘనంగా సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకని బాలు యాదవ్, అఖిల భారత యాదవ మహా సభ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ యాదవ్, గొర్రె కాపారుల సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ జుర్రు నారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ యాదవ్, యాదవ సంఘం నాయకులు పెద్ద గొల్ల నర్సింలు యాదవ్ నారాయణ యాదవ్ పర్వతాలు యాదవ్ పెద్ద గొల్ల శ్రీనివాస్ యాదవ్ వెంకట్ రాములు యాదవ్ దేవరకద్ర ప్రధాన కార్యదర్శి బత్తుల మల్లేష్ యాదవ్, బూత్పూర్ మండల అధ్యక్షలు రాము యాదవ్, వెంకట్ రాములు యాదవ్, మనోహర్ యాదవ్, వెంకట్ యాదవ్ నరసింహ యాదవ్, మద్దిలేటి యాదవ్, రవి ప్రకాష్ యాదవ్, జగన్ మోహన్ యాదవ్, శివకుమార్ యాదవ్, నాగరాజు యాదవ్, శ్రీను యాదవ్ లు పాల్గొన్నారు.
ఇది కూడ చదవండి-
ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ లక్ష్మణ్ యాదవ్ ఎంతో అంకితభావంతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు సుదీర్ఘకాలం పాటు పనిచేసినందుకు ఆయన అంకితభావానికి నిదర్శనంగా ఆయన సమర్థతను గుర్తించి ఈ యొక్క చైర్మన్ పదవి ను ఇవ్వడం జరిగిందని అభినందించారు. ఆయన అంకితభావంతో చిత్తశుద్ధితో పనిచేసే చేపట్టిన పదవికి వన్నెతెచ్చే విధంగా పనిచేయాలని ఆకాంక్షించినారు అదే విధంగా తన పదవీకాలంలో యాదవ సోదరులకు అవసరమైన సందర్భంలో చేయూతనిచ్చి యాదవ సంఘ పటిష్టతకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. యాదవ ముద్దు బిడ్డ లక్ష్మణ్ యాదవ్ కు అవకాశం ఇచ్చినందుకు శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డికి మహబూబ్నగర్ జిల్లా శాసనసభ్యులు అందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
రేపు జరుగనున్న యాదవ సంఘం సమావేశానికి పెద్ద ఎత్తున యాదవులు హాజరు కావాలి
యాదవ సంఘం భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి రేపు స్థానిక జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘ భవనంలో నిర్వహించనున్న భవిష్యత్తు కార్యాచరణ సమావేశానికి జిల్లాలోని యాదవ మిత్రులు యాదవ ఉద్యోగులు యాదవ మేధావులు యాదవ నాయకులు హాజరై తగు సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా పిలుపు ఇచ్చారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి యాదవ సోదరులు పెద్ద ఎత్తున హాజరు కావాలి
ఈనెల 23వ తేదీన స్థానిక జేజేఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న లక్ష్మణ్ యాదవ్ ముడా చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార ఉత్సవానికి జిల్లాలోని యాదవ సంఘం నాయకులు ఉద్యోగులు మేధావులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరినారు.