హైదరాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మూడవ సారి నియమితులైన శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ సోమవారం ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు అంబర్‌పేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రోహిణ్ రెడ్డిను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో వరుసగా మూడవసారి బాధ్యతలు అప్పగించిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలంబ మరియు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్కకి, పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర, జిల్లా నాయకులకు హృద యపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినందునే మళ్లీ అవకాశం లభించిందని, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తానని, ప్రతి డివిజన్‌లో మహిళా కార్య కర్తలను క్రియాశీలం చేస్తానని తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ పథకాలు ప్రతి మహిళకు అందేలా కృషి చేస్తానని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరితో కలిసి పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఇది కూడ చదవండి-
ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఆలిండియా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, పిసిసి కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.
