హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మహాత్మా గాంధీ సమాధికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో నడిచి భారత స్వాతంత్య్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ అందించిన సేవలను ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Also Read-
సామాజిక సమానత్వం, శాంతి, సౌభ్రాతృత్వం, అహింసా మార్గాలను ప్రజలు ఆచరించాలని నాయకులు పిలుపునిచ్చారు. గాంధీజీ చూపిన మార్గంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బాపూఘాట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

One thought on “బాపూఘాట్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళులు : పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్”