హైదరాబాద్ : భారతీయ సమాజ మూలాలు సమగ్రంగా తెలుసుకోవాలంటే సంస్కృత, ఆంగ్ల, తెలుగు భాషలతోపాటుగా హిందీ భాషను కూడా నేర్చుకోవాలని తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. దేశం సమగ్ర స్వరూపం తెలుసుకోవడానికి, భారతీయ సామాజిక జీవన విశ్వరూపం అవగతం చేసుకోవడానికి హిందీ భాషను నేర్చుకోవాలని చెప్పారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని తెలంగాణ బుక్‌ట్రస్ట్ కార్యాలయంలో మిధున్ కుమార్ రాసిన “మిధున్ స్పోకెన్ హిందీ” పుస్తకాన్ని భారత ప్రభుత్వ హిందీ సలహాదారు సమితీ సభ్యులు శ్రుతికాంత్ భారతి, రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ ఛైర్మన్ నారా కిషోర్‌రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు, జూలూరు గౌరీశంకర్‌లు సంయుక్తంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషల కూడలి అని, దేశానికి బలమైన అనుసంధాన భాషగా హిందీ పనిచేస్తుందన్నారు. హిందీ, తెలుగు, ఆంగ్లం మూడు భాషల మాధ్యమాల ద్వారా ఈ పుస్తకం తయారు చేయబడిందన్నారు. సరళమైన పదాలు, జీవనగమనంలో పదాలను ఉపయోగించినప్ప్పుడే భాషను నేర్చుకోవడం సులభతరమవుతుందని పేర్కొన్నారు. కార్పోరేట్ సమాజంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి హిందీ భాష దోహదం చేస్తుందని గౌరీశంకర్ వివరించారు.
यह भी पढ़ें-
భారత ప్రభుత్వ సలహా సమితి సభ్యులు శ్రుతికాంత్ భారతి మాట్లాడుతూ భాషను సరళంగా వ్యవహారిక భాషలో సులభతరం చేయగలిగినప్పుడే అది అందరికీ చేరువ అవుతందన్నారు. హిందీ భాషాభ్యాసాన్ని సరళతరం చేసి ఆసక్తికరంగా మార్చి పుస్తకాన్ని తయారు చేసిన మిధున్ కృషిని రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ చైర్మన్ నారా కిషోర్‌రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు అభినందించారు.
కేంద్రప్రభుత్వంలో ఉద్యగం పొంది ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్నప్ప్పుడు భాష సమస్యను ఎదుర్కోవడం జరిగిందని, ఆ నేపథ్యంలోనే హిందీ భాషను సాధనచేసి నేర్చుకున్నానని పుస్తక రచయిత మిధున్ కుమార్ తెలిపారు. హిందీ భాష రాకపోవడంతో భయంతో చాలామంది కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఉత్తరభారతంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి హిందీ భాష వారధిలా పనిచేస్తుందని చెప్పారు. పుస్తక రచయిత మిధున్‌ను ఈ సందర్భంగా పలువురు సన్మానించారు.
यह भी पढ़ें-
“मिधुन स्पोकन हिंदी” पुस्तक लोकार्पित, पढ़िए प्रमुख लोगों के संदेश
हैदराबाद: तेलंगाना साहित्य अकादमी के पूर्व चेयरमैन जूलूरु गौरीशंकर ने कहा कि भारतीय समाज की जड़ों को समग्र रूप से जानना है तो संस्कृत, अंग्रेजी, तेलुगु भाषाओं के साथ-साथ सभी को हिंदी भाषा भी सीखनी चाहिए। देश के समग्र स्वरूप को जानने के लिए, भारतीय सामाजिक जीवन के विराट रूप को समझने के लिए हिंदी भाषा सीखनी चाहिए।
आरटीसी क्रॉस रोड्स स्थित तेलंगाना बुक ट्रस्ट कार्यालय में मिधुन कुमार द्वारा लिखी गई “मिधुन स्पोकन हिंदी” पुस्तक का विमोचन भारत सरकार की हिंदी सलाहकार समिति के सदस्य श्रुतिकांत भारती, रामानंद तीर्थ ग्रामीण विद्या संस्था के चेयरमैन नारा किशोर रेड्डी व डॉ बीआर अंबेडकर ओपन यूनिवर्सिटी स्टूडेंट सर्विसेज डायरेक्टर वाई. वेंकटेश्वरलू और जूलूरु गौरीशंकर ने संयुक्त रूप से किया।
इस अवसर पर जूलूरु ने कहा कि भारत विविध भाषाओं का संगम है और देश के लिए मजबूत जोड़ने वाली भाषा के रूप में हिंदी काम करती है। उन्होंने आगे कहा कि हिंदी, तेलुगु, अंग्रेजी तीन भाषाओं के माध्यम से यह पुस्तक तैयार की गई है। सरल शब्द, जीवन में शब्दों का उपयोग करने पर ही भाषा सीखना आसान होता है। कॉर्पोरेट समाज में कम्युनिकेशन स्किल्स विकसित करने के लिए हिंदी भाषा मदद करती है।
भारत सरकार की सलाहकार समिति के सदस्य श्रुतिकांत भारती ने कहा कि भाषा को सरलता से बोलचाल की भाषा में आसान बना पाने पर ही वह सभी तक पहुंचती है। हिंदी भाषा के अभ्यास को सरल बना कर रोचक बना कर पुस्तक तैयार करने वाले मिधुन के प्रयास की रामानंद तीर्थ ग्रामीण विद्या संस्था के चेयरमैन नारा किशोर रेड्डी और अंबेडकर ओपन यूनिवर्सिटी स्टूडेंट सर्विसेज डायरेक्टर वाई. वेंकटेश्वरलू ने सराहना की।
पुस्तक के लेखक मिधुन कुमार ने बताया कि केंद्र सरकार में नौकरी पाकर अन्य राज्यों में काम करते समय भाषा की समस्या का सामना करना पड़ा, उस पृष्ठभूमि में ही हिंदी भाषा का अभ्यास कर सीखा। हिंदी भाषा न आने से डर के कारण बहुत से लोग केंद्र सरकार की नौकरियों से दूर हो रहे हैं। उत्तर भारत के साथ संबंध बनाने के लिए हिंदी भाषा पुल की तरह काम करती है। पुस्तक के लेखक मिधुन को इस अवसर पर कई लोगों ने सम्मानित किया।

2 thoughts on ““మిధున్ స్పోకెన్ హిందీ” పుస్తకావిష్కరణ, చదవండి ప్రముఖుల సందేశాలు “मिधुन स्पोकन हिंदी” पुस्तक लोकार्पित”