గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి: మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మన శరీరంలో గుండె అత్యంత కీలకమైన అవయవమని, పుట్టిన క్షణం నుంచి చివరి శ్వాస వరకు నిరంతరం పనిచేస్తూ మన జీవనాన్ని కొనసాగిస్తుందని ఆయన అన్నారు. “మన గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది” అని పేర్కొన్నారు.

ప్రతిరోజూ శారీరక చురుకుదనాన్ని అలవాటు చేసుకోవడంతో పాటు ఉప్పు, చక్కెర, అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని పరిమితం చేయాలని సూచించారు. పొగాకు, ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలని, అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. అధిక బరువును నియంత్రించుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

Also Read-

ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. “గుండె ఆరోగ్యం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు… కుటుంబ బాధ్యత కూడా. ఆరోగ్యకరమైన గుండె — ఆనందమైన జీవితం” అని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar