हैदराबाद: आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री नादेंडला भास्कर राव (90) का निधन हो गया हैं। वे कुछ समय से सेहत से जुड़ी दिक्कतों से जूझ रहे थे और हैदराबाद के एक प्राइवेट हॉस्पिटल में उनका इलाज चल रहा था। 22 अप्रैल को उनकी हालत बिगड़ने के बाद उन्होंने आखिरी सांस ली। एकीकृत आंध्र प्रदेश की पॉलिटिक्स में एक्टिव रोल निभाने वाले नादेंडला के निधन पर कई हस्तियांअपनी संवेदनाएं जता रहे हैं। परिवार वालों ने बताया कि उनका अंतिम संस्कार 23 अप्रैल को किया जाएगा।
23 जून, 1935 को गुंटूर में जन्मे नादेंडला भास्कर ने उस्मानिया यूनिवर्सिटी से ग्रेजुएशन किया था। नादेंडला ने अपने पॉलिटिकल कॅरियर की शुरुआत कांग्रेस पार्टी से की थी। 1978 में, उन्होंने कांग्रेस की तरफ से विजयवाड़ा वेस्ट सीट से विधायक के तौर पर जीत हासिल की और पहली बार असेंबली में पहुंचे। उन्होंने चेन्ना रेड्डी कैबिनेट में मंत्री के तौर पर काम किया। उसके बाद राज्य की राजनीति में हुए बदलावों के कारण, उन्होंने 1982 में कांग्रेस पार्टी से इस्तीफा दे दिया और दिवंगत नेता एनटी रामाराव द्वारा बनाई गई तेलुगु देशम पार्टी में शामिल हो गए।
भास्कर राव ने तेलुगु देशम पार्टी बनाने में भी अहम भूमिका निभाई थी। 1983 के चुनावों में टीडीपी की बड़ी जीत के बाद, उन्होंने एनटीआर कैबिनेट में फाइनेंस मिनिस्टर का पद संभाला और सरकार की बागडोर संभाली। इसी सिलसिले में, अगस्त 1984 में, जब एनटीआर हार्ट सर्जरी के लिए अमेरिका गए, तो नादेंडला ने राजनीतिक तख्तापलट किया। उन्होंने उस समय के गवर्नर राम लाल और अपने गुट के विधायकों की मदद से मुख्यमंत्री का पद संभाला।
नांदेडला भास्कर राव 16 अगस्त से 16 सितंबर, 1984 तक सिर्फ़ 31 दिनों के लिए मुख्यमंत्री रहे। एनटीआर अमेरिका से लौटने के बाद डेमोक्रेसी बचाने के लिए धर्मयुद्ध के नाम से पूरे राज्य में यात्रा की। उसके बाद हुए घटनाक्रम के कारण नादेंडला ने सिर्फ़ एक महीने के अंदर मुख्यमंत्री पद से इस्तीफ़ा दे दिया। साथ ही टीडीपी से सस्पेंड कर दिया गया। इसके साथ ही वे फिर से कांग्रेस पार्टी में शामिल हो गए।
नांदेडला 1989 में तेनाली से विधायक के तौर पर जीते। वे 1998 में खम्मम से संसद भी चुने गए। वे 6 जुलाई, 2019 को शमशाबाद में हुई एक पब्लिक मीटिंग में केंद्रीय गृह मंत्री अमित शाह की मौजूदगी में बीजेपी में शामिल हुए। नादेंडला सेहत की दिक्कतों और बढ़ती उम्र की वजह से कुछ समय से राजनीति से दूर हैं। उनके बेटे नादेंडला मनोहर आंध्र प्रदेश में मंत्री के तौर पर काम कर रहे हैं। मालूम हो कि नादेंडला मनोहर जन सेना पार्टी में नंबर दो के रूप में जाने जाते हैं।
यह भी पढ़ें-
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్ను మూత, చదవండి రాజకీయ ప్రస్థానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నాదెండ్ల మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
1935, జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కర్ ఉస్మానియా యూనివర్శిటీ నుంచి లా పట్టా పొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాదెండ్ల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1978లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో1982లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు.
టీడీపీ ఏర్పాటులో కూడా నాదెండ్ల కీ రోల్ ప్లే చేశారు. 1983 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే 1984 ఆగస్టులో ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదెండ్ల రాజకీయ తిరుగుబాటు చేశారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అప్పటి గవర్నర్ రామ్ లాల్ సహాయంతో సీఎం పదవి చేపట్టారు.
1984, ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 అంటే కేవలం 31 రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక, ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ధర్మయుద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో నాదెండ్ల కేవలం నెలరోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో ఆయన తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
1989లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1998లో ఖమ్మం నుంచి గెలిచి 12వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019, జూలై 6న హైదరాబాద్లోని శంషాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అనారోగ్య సమస్యలు, వయోభారం కారణంగా గత కొంత కాలంగా నాదెండ్ల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేస్తున్నారు. జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ నెంబర్.2గా ఉన్న సంగతి తెలిసిందే. (ఏజెన్సీలు)
