हैदराबाद: आंध्र प्रदेश के मछलीपट्टनम के एक युवा जोड़ी ने यह साबित कर दिया है कि प्यार में रूप, हाइट, खूबसूरती, उम्र, प्रॉपर्टी, जाति या धर्म जैसा कोई फर्क नहीं होता। मछलीपट्टनम के राजुपेटा की युवती ने एक बौने लड़के से शादी करके प्यार की एक नई परिभाषा दी है। यह शादी साबित करती है कि बिना स्वार्थ के लगाव के रास्ते में शारीरिक कमियां कोई रुकावट नहीं आती हैं।
राजपेट निवासी वेमुला शशि और मुस्लिम लड़की शेख गौसिया की दोस्ती तब हुई जब वे नौवीं क्लास में पढ़ते थे। वह दोस्ती कुछ समय बाद प्यार में बदल गई। शशि इस समय जिला कोर्ट में कॉन्ट्रैक्ट एम्प्लॉई के तौर पर काम कर रहा है, जबकि गौसिया एक मेडिकल शॉप में काम करती है। एक-दूसरे के लिए उनके भरोसे और समझ ने उन्हें शादी तक पहुंचाया।
इनकी शादी को बड़ों की मंज़ूरी नहीं मिली। युवती के घरवालों और रिश्तेदारों ने शशि और गौसिया की शादी का कड़ा विरोध किया। उन्होंने युवक की कम हाइट और अलग धर्म का हवाला देकर उन्हें अलग करने की कोशिश की। घरवालों का दबाव बढ़ने पर दोनों ने अपने प्यार को बचाने का फैसला किया और चर्च में शादी कर ली।
इसके बाद दोनों ने अपनी जान बचाने के लिए इनुकुदुरुपेटा पुलिस से संपर्क किया। पुलिस दोनों परिवार को थाने ले आई और उनकी काउंसलिंग की। इस दौरान दोनों ने कहा कि वे बालिग हैं और साथ रहेंगे। घरवालों की शेख गौसिया को समझाने की बहुत कोशिशों के बावजूद, उसने कहा कि वह अपने पति के साथ चली जाएगी।
इस युगल ने समाज को स्पष्ट संदेश दिया कि दिलों का मिलन बाहरी सुंदरता, धर्म और प्रॉपर्टी से ज़्यादा ज़रूरी है। कई लोग उस लड़की की हिम्मत की तारीफ़ कर रहे हैं जो अपनी शारीरिक हालत की परवाह किए बिना, जिससे प्यार करती थी, उसके लिए खड़ी हुई। यह शादी न सिर्फ़ आजकल स्थानीय लोगों में चर्चा का विषय है, बल्कि सोशल मीडिया पर नेटिज़न्स से भी तारीफ़ पा रही है। कह रहे हैं “सच्चे प्यार की कोई सीमा नहीं होती है।”
यह भी पढ़ें-
ఆదర్శ వివాహం : ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
హైదరాబాద్ : ప్రేమకు రూపం, ఎత్తు, అందం, వయసు, ఆస్తులు లాంటి భేదాలు లేవని, అలాగే కులమతాలు కూడా అడ్డుకావని మచిలీపట్నానికి చెందిన ఒక యువజంట నిరూపించింది. మచిలీపట్నం రాజుపేటకు చెందిన ఒక యువతి, మరుగుజ్జు యువకుడిని ప్రేమించి పెళ్లాడి సరికొత్త ప్రేమ నిర్వచనాన్ని అందించింది. నిస్వార్థమైన అనుబంధం ముందు శారీరక లోపాలు అడ్డురావని ఈ ఘటన నిరూపిస్తోంది.
రాజాపేటకు చెందిన వేముల శశి, షేక్ గౌసియా అనే ముస్లిం యువతి మధ్య తొమ్మిదో తరగతి చదువుకుంటున్న సమయంలో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కొంతకాలం తరువాత ప్రేమగా మారింది. ప్రస్తుతం శశి జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, ఆ యువతి ఒక మెడికల్ షాపులో పనిచేస్తోంది. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకున్న తీరు వారిని పెళ్లి పీటల వరకు నడిపించింది.
వీరి వివాహానికి పెద్దల అంగీకారం లభించలేదు. యువతి కుటుంబ సభ్యులు, బంధువులు శశితోతో గౌసియా పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. యువకుడి ఎత్తు తక్కువతో పాటు వేరే మతం అంశాలను సాకుగా చూపి వారిని విడదీసే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరగడంతో, తమ ప్రేమను కాపాడుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట ఓ చర్చిలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
తరువాత తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు ఇనుకుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలను పీఎస్ కు రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తాము మేజర్లం అని, కలిసే బతుకుతామని కొత్త జంట తేల్చి చెప్పింది. షేక్ గౌసియాకు నచ్చజెప్పేందుకు కుటుంసభ్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఆమె తన భర్తతోనే వెళ్లిపోతానని చెప్పింది.
బాహ్య సౌందర్యం, మతం, ఆస్తుల కంటే మనసుల కలయికే ముఖ్యమని ఈ జంట చాటిచెప్పింది. శారీరక స్థితిగతులతో సంబంధం లేకుండా, ఇష్టపడిన వ్యక్తి కోసం నిలబడిన ఆ యువతి ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ “నిజమైన ప్రేమకు హద్దులు లేవు” అంటూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. (ఏజెన్సీలు)
