इंतज़ार की घड़ी खत्म, मेहदीपट्टनम स्काईवॉक पर आया है बड़ा अपडेट, पढ़कर नहीं अब रुकेंगे आपके कदम మెహదీపట్నం స్కైవాక్

हैदराबाद : महानगर के लोग जिस मेहदीपट्टनम स्काईवॉक का बेसब्री से इंतज़ार कर रहे हैं, वह जल्द ही खुलने के लिए तैयार है। एचएमडीए के अधिकारी इस स्काईवॉक को इस साल फरवरी के आखिर या मार्च में आम लोगों के लिए उपलब्ध कराने की तैयारी कर रहे हैं। अभी, स्काईवॉक पर केबल बिछाने और फिनिशिंग का काम यानी आखिरी फेज़ का कार्य तेज गति चल रहा है। अधिकारियों ने बताया कि इस प्रोजेक्ट पर 32.47 करोड़ रुपये खर्च हो चुके हैं, जो लगभग दो साल से बन रहा है। इसका कंस्ट्रक्शन पूरा होने के स्टेज पर पहुँच गया है। सभी बड़े काम पूरे हो चुके हैं और बस छोटे-मोटे काम बाकी हैं।

मेहदीपट्टनम जंक्शन हैदराबाद के सबसे बिज़ी ट्रैफिक रूट में से एक है। इस जंक्शन से रोज़ाना लाखों वाहन गुज़रते हैं। यहाँ रोज़ाना लगभग 1,600 आरटीसी बसें चलती हैं। यह जंक्शन मोइनाबाद, नरसिंगी, परिगी, शमशाबाद, तांडूर, विकाराबाद जैसे इलाकों को जोड़ता है। साथ ही यह शहर के एलबी नगर, उप्पल, चरलापल्ली, दिलसुखनगर, हयातनगर जैसे इलाकों को भी जोड़ता है। यह इलाका हाईटेक सिटी, रायदुर्गम, मणिकोंडा, नरसिंगी, कोकापेट, नानकरामगुडा जैसे बड़े आईटी और फाइनेंशियल जिलों के लिए एक मुख्य गेटवे के तौर पर भी काम करता है। इसके कारण इस जंक्शन पर बहुत ज़्यादा ट्रैफिक जाम रहता है। इसके अलावा इस रास्ते पर पैदल चलने वालों की ज़्यादा संख्या के कारण ट्रैफिक जाम और बड़ी संख्या में एक्सीडेंट हो रहे हैं। अधिकारियों ने लोगों की सुरक्षा को देखते हुए स्काईवॉक बनाने का फैसला किया है।

स्काईवॉक का स्ट्रक्चर 340 मीटर लंबा है। यह मेहदीपट्टनम बस स्टॉप से ​​जंक्शन के सामने डिफेंस लैंड तक फैला हुआ है। इसमें से 160 मीटर आसिफ नगर पुलिस स्टेशन की तरफ और 180 मीटर मल्लेपल्ली की तरफ हैं। अधिकारियों ने इस स्काईवॉक को आर्च-स्टाइल एलिवेशन और मॉडर्न सुविधाओं के साथ डिज़ाइन किया है। इसे उप्पल स्काईवॉक से प्रेरणा लेकर बनाया गया। उप्पल स्काईवॉक ने न सिर्फ ट्रैफिक जाम को कम करने में मदद की, बल्कि लोगों के आराम करने के लिए भी एक आसान जगह बन गई। अब मेहदीपट्टनम स्काईवॉक भी इसी तरह बनाया जा रहा है। इस स्काईवॉक में अंदर आने और बाहर निकलने के लिए 5 गेट हैं। वॉकवे 4-5 मीटर चौड़े हैं। इससे पैदल चलने वाले आराम से चल सकते हैं। स्काईवॉक में 12 लिफ्ट भी लगाई गई हैं। हर लिफ्ट एक बार में 20 लोगों को ले जा सकती है। यह बुजुर्गों और दिव्यांगों के लिए बहुत आसान है।

पैदल चलने वालों के लिए एक सुरक्षित क्रॉसिंग पॉइंट होने के अलावा, स्काईवॉक को एक मल्टीपर्पस जगह के तौर पर भी डेवलप किया गया है। अधिकारियों ने कमर्शियल कामों के लिए 21,061.42 स्क्वेयर फीट जगह भी दी है। इसमें कॉफी शॉप, स्नैक स्टॉल और फूड कोर्ट बनाए जा सकते हैं। पूरे स्काईवॉक पर बैठने की व्यवस्था भी की जा रही है। इससे माना जा रहा है कि यह परिवारों और युवाओं के लिए बिज़ी ट्रैफिक से दूर, ऊपर सुरक्षित रूप से आराम करने के लिए एक अच्छी जगह बन जाएगी।

यह भी पढ़ें-

మెహదీపట్నం మెహదీపట్నం స్కైవాక్ పై అదిరిపోయే అప్డేట్

హైదరాబాద్ : నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెహదీపట్నం స్కైవాక్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరిలో లేదా మార్చిలో ఈ స్కైవాక్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం స్కైవాక్ వద్ద చివరి దశ పనులు, అంటే కేబుల్స్ బిగించడం, ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 32.47 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీని నిర్మాణం పూర్తయ్యే దశకు చేరుకుంది. ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయని, చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

మెహదీపట్నం జంక్షన్ హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ మార్గాలలో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది వాహనాలు ఈ జంక్షన్ గుండా వెళ్తాయి. ఇక్కడ రోజుకు సుమారు 1,600 ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. ఈ జంక్షన్ మొయినాబాద్, నార్సింగి, పరిగి, షంషాబాద్, తాండూర్, వికారాబాద్ వంటి ప్రాంతాలను కలుపుతుంది. అలాగే, నగరంలోని ఎల్‌బీ నగర్, ఉప్పల్, చార్లపల్లి, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ వంటి ప్రాంతాలను కూడా కలుపుతుంది. ఈ ప్రాంతం హైటెక్ సిటీ, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, కొకపేట్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రధాన ఐటీ, ఆర్థిక జిల్లాలకు కీలకమైన ప్రవేశ ద్వారంగా కూడా పనిచేస్తుంది. దీంతో ఈ జంక్షన్‌లో విపరీతమైన రద్దీ ఉంటుంది. దీనికి తోడు పాదచారులు ఎక్కువగా తిరుగుతుండటంతో ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్, పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా స్కైవాక్ నిర్మించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ స్కైవాక్ నిర్మాణం 340 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది మెహదీపట్నం బస్ స్టాప్ నుండి జంక్షన్ ఎదురుగా ఉన్న డిఫెన్స్ ల్యాండ్ వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో 160 మీటర్లు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ వైపు, 180 మీటర్లు మల్లేపల్లి వైపు ఉంటాయి. అధికారులు ఈ స్కైవాక్‌ను ఆర్చ్-స్టైల్ ఎలివేషన్‌తో, ఆధునిక సౌకర్యాలతో రూపొందించారు. ఉప్పల్ స్కైవాక్ నుంచి ప్రేరణ పొంది దీన్ని నిర్మించారు. ఉప్పల్ స్కైవాక్ ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, ప్రజలు సేదతీరేందుకు అనుకూల ప్రదేశంగా మారింది. ఇప్పుడు మెహదీపట్నం స్కైవాక్‌ను కూడా అలానే నిర్మిస్తున్నారు. ఈ స్కైవాక్‌లో లోపలికి, బయటకు వెళ్లడానికి 5 ద్వారాలు ఉన్నాయి. నడవడానికి వీలుగా ఉండే మార్గాలు 4-5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఇది పాదచారులు సౌకర్యవంతంగా నడవడానికి వీలు కల్పిస్తుంది. స్కైవాక్‌లో 12 లిఫ్టులు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి లిఫ్ట్ ఒకేసారి 20 మంది వరకు తీసుకెళ్లగలదు. ఇది వృద్ధులకు, దివ్యాంగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటడానికి ఉపయోగపడటంతో పాటు, ఈ స్కైవాక్‌ను బహుళ ప్రయోజనకరమైన ప్రదేశంగా కూడా తీర్చిదిద్దారు. ఇక్కడ 21,061.42 చదరపు అడుగుల స్థలాన్ని అధికారులు వాణిజ్య అవసరాల కోసం కేటాయించారు. ఇందులో కాఫీ షాపులు, స్నాక్ స్టాల్స్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయవచ్చు. స్కైవాక్ అంతటా కూర్చునేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనితో, కుటుంబాలు, యువత రద్దీగా ఉండే ట్రాఫిక్‌కు దూరంగా, పైన సురక్షితంగా విశ్రాంతి తీసుకునేందుకు ఇది ఒక మంచి ప్రదేశంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X