Dr B R Ambedkar Open University Organised Narla Memorial Lecture నార్ల గొప్ప హేతువాది…

Narla’s style is to defend human values and criticize social ills

Hyderabad : Prof. C. Mrunalini, Head department of Telugu, Arya University, Silicandhra (America) Retired professor, Potti Sreeramulu Telugu University, Hyderabad delivered the 30th Narla Memorial Endowment lecture on “Narla Sahitya Rachanalu-Vishleshaana” at Dr. B. R. Ambedkar Open University Hyderabad on monday.

Prof. Mrunalini said Narla is a prominent Telugu writer, journalist, and playwright known for his realistic one-act plays, societal critique, and significant contributions to Telugu journalism. His works focused on human values, rationalism, and critiquing social injustices. He was particularly known for his one-act plays that brought a sense of realism to the Telugu stage like Sita Josyam, Narakam lo Harischandra, Jabali, Paatha Kotha.

Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, BRAOU, Vice-Chancellor, BRAOU who presided over the function, said that the society needs journalists like Narla in the current situation whose values stood as ideal for journalists. Narla’s family members donated valuable books to University Library.

Dr. L. Vijaya Krishna Reddy, Registrar of the University also spoke on the occasion. Prof. N. Rajani, incharge Library explain about needs of the program and introduced the chief guest. Earlier the Chief Guest, Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff Members, representatives of service associations offered floral tributes the Portrait of Narla.

Also Read-

నార్ల గొప్ప హేతువాది : ప్రొ మృణాళిని

మానవ విలువలను కాపాడుతూ, సామాజిక రుగ్మతలను విమర్శించడం నార్ల నైజం

డా. బీ. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటిలో నార్ల 30వ స్మారకోపన్యాసం

హైదరాబాద్ : డా. బీ. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటిలో ప్రముఖపాత్రికేయులు, సంపాదకులు స్వర్గీయ నార్ల వెంకటేశ్వర రావు జయంతి సందర్భంగా నార్ల స్మారకోపాన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయ మాజీ విభాగాధిపతి, ఆర్య విశ్వవిద్యాలయం, సిలికాంధ్ర (అమెరికా) ఆచార్యులు, ప్రొ.సి.మృణాళిని హాజరై “నార్ల సాహిత్య రచనలు-విశ్లేషణ” అనే అంశంపై ఉపన్యాసం చేశారు.

ప్రొ. మృణాళిని మాట్లాడుతూ నార్ల ఒక పాత్రికేయులే కాకుండా ప్రముఖ తెలుగు రచయిత అని, గొప్ప నాటక రచయిత అని అన్నింటికీ మించి అసమానతల పట్ల సమాజాన్ని జాగృత పరిచే గొప్ప ఆలోచనా పరులు అని ఆమె వివరించారు . నార్ల వాస్తవిక నాటకాలు, నిశితమైన సామాజిక విమర్శ, తెలుగు సాహిత్యానికి గొప్ప వరంగా ఆమె పేర్కొన్నారు. మానవ విలువలు, హేతువాదం, సామాజిక అన్యాయాలను విమర్శించడంపై ఆయన రచనలు ప్రజలను ఆలోచింపజేశాయని వివరించారు. నార్ల సాహిత్య రచనల్లో సీతా జోస్యం, నరకం లో హరిశ్చంద్ర, జాబాలి, పాత కోత వంటి తెలుగు వేదికకు వాస్తవిక భావాన్ని తీసుకువచ్చిన ఏక పాత్ర నాటకాల రచనలకు ఆయన ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటాచక్రపాణి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో నార్ల లాంటి పాత్రికేయులు సమాజానికి చాలా అవసరం అన్నారు. విలువలతో కూడిన పాత్రికేయం ఆదర్శంగానిలుస్తుందని పేర్కొన్నారు. నార్ల గొప్ప తాత్వికవేత్త అని తెలిపారు. తన రచనలతో సమాజంలో జరిగే అన్యాయాల పట్ల, సామాజిక సమస్యల పట్ల నిత్యం ప్రజలను అప్రమత్తం చేసేవారని వివరించారు. నార్ల కుటుంబ సభ్యులు జ్ఞానసంపదను ఆయనరాసిన, సేకరించిన పుస్తకాలను అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటిలో లైబ్రరీకి అందించడం గర్వకారణంగా వీసీ ఆచార్య ఘంటాచక్రపాణి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్. విజయాకృష్ణా రెడ్డి ప్రసంగించారు. నార్ల పట్టుదల, విలువలతో కూడిన పాత్రికేయులుగా జాతీయస్థాయిలో ప్రఖ్యాతిగాంచారు అనిపేర్కొన్నారు. విశ్వవిద్యాలయ లైబ్రరీ ఇన్‌చార్జ్ ప్రొ. ఎన్. రజని, కార్యక్రమ ఆవశ్యకత, ఇప్పటి వరకు నిర్వహించిన నార్ల స్మారకోపన్యాసాల వివరాలను సభకు వివరించారు. కార్యక్రమంలో, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. అంతకుముందు నార్ల వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X