विशेष लेख : खामोश हुआ कवि, गायक और लेखक अन्देश्री का स्वर !

तेलंगाना के आकाश में कल तक गूंजने वाला वह स्वर, “जय जय हे तेलंगाना जननी जयकेतनम.. ” अमृतस्वर राग आज सुबह खामोश हो गया। जनकवि डॉ. अन्देश्री (अन्दे ऐलय्या) का असमय निधन हुआ। 10 नवम्बर को गांधी अस्पताल में उनका निधन हो गया। उनका निधन तेलंगाना साहित्य जगत और जनता के लिए अपूरणीय क्षति है।

एक साधारण परिवार में जन्मे अंधेश्री के जीवन की शुरुआत पशु पालन से हुआ। अन्देश्री के दिल में मातृभूमि प्रेम, भक्ति और मातृभाषा का आत्मगौरव समा हुआ था। इसी प्रेम ने उन्हें तेलंगाना जनता के हृदय में अमर बना दिया। प्राथमिक शिक्षाएं भी उन्हें नहीं मिलीं, पर जीवन के अनुभव और देशभक्ति उनकी कविता बन गई।

अंदेश्री का जन्म वरंगल जिले के जनगांव के समीप रेबर्ती गांव में हुआ। यह मिट्टी उनका मनमोहक आधार थी। तेलंगाना जनआंदोलन के दौरान उनका स्वर दहाड़ता। यह दहाड़ आंदोलन की ऊर्जा बन जाती थी। “जय जय हे तेलंगाना” गीत केवल शब्द नहीं, बल्कि तेलंगाना के लोगों की आत्मा की अभिव्यक्ति है। उनके गीतों में गाँवों की सादगी, जनता का जीवन चमकता है। हर आंदोलन में उनका स्वर जनता के हृदय में आंदोलन की ज्वाला बनकर भड़क उठता था।

फिल्मी क्षेत्र में भी उनका बहुत बड़ा और अद्भुत योगदान रहा है। जैसे- ‘गंगा’, ‘आवारागाडु’, ‘बतुकम्मा’ जैसी फिल्मों में उनके गीतों ने तेलंगाना की संस्कृति को जीवंत किया। इतना ही नहीं, “मायमै पोतुन्नाडम्मो मनिशन्नवाडु” जैसी रचनाओं ने सामाजिक चेतना को नई दिशा दी।

साल 2006 में ‘गंगा’ फिल्म के लिए उन्हें मिला नंदी पुरस्कार उनकी प्रतिभा का प्रतीक था। लेकिन वे कभी भी पुरस्कारों के पीछे नहीं भागे। पुरस्कार उनके पास ढूँढते हुए आते थे। लोक नायक पुरस्कार, दाशरथि साहित्य पुरस्कार, सुद्दाला हनुमंतु-जानकम्मा अवार्ड, वंशी अंतरराष्ट्रीय फाउंडेशन सम्मान, काकतीय विश्वविद्यालय की मानद डॉक्टरेट सहित अनेक सम्मान प्राप्त हुए। हालांकि, सबसे बड़ा सम्मान वह था, वे जनता के दिलों में जाकर बस गये। उनके शब्द और गीत आंदोलन के शस्त्र (हथियार) बन गए। उनका साहित्य और व्यक्तित्व तेलंगाना की आत्मकथा का अविभाज्य हिस्सा रहा हैं।

आज जब वे इस संसार में नहीं हैं, तब भी उनका स्वर, उनके गीत और उनकी प्रेरणा तेलंगाना की मिट्टी से सदा के लिए जुड़ी रहेगी। जब तक हर विद्यालय, हर मंच से “जय जय हे तेलंगाना” गीत गाया जाएगा, तब तक अन्देश्री अमर रहेंगे। उनका सारा जीवन ही एक कविता है, जो हमेशा तेलंगाना माता के दिल में गूंजती रहेगी। ऐसे महान कवि, लेखक, गायक अंदेश्री को श्रद्धांजलि अर्पित करते हैं। साथ ही अमर स्मृति को नमन करते हैं।

कमलेकर नागेश्वर राव ‘कमल’
कवि, लेखक, अनुवादक
9848493223

Also Read-

నిశ్శబ్దమైన నినాదం, ఆగిపోయిన కలం, అవనినిడిచిన అందెశ్రీ గళం

తెలంగాణ గగనాన నిన్నటివరకు నినదించిన ఆ గళం – “జయ జయహే తెలంగాణా జననీ జయకేతనం” అంటూ ఉద్ధరించిన ఆ స్వరామృతం – ఈ ఉదయం నిశ్శబ్దమైపోయింది. ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ (అందె ఎల్లయ్య) ఇక లేరు. నిన్న (2025 నవంబర్ 10న) గాంధీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన జీవనయాత్రకు స్వస్తి పలికారు. తెలంగాణ సాహిత్య ప్రపంచానికీ, ప్రజా హృదయాలకీ ఇది తీరని నష్టం.

సాదాసీదా గొడ్ల కాపరిగా జీవన ప్రారంభం చేసిన ఓ వ్యక్తి, తన లోపల నిండిన భక్తి, భూమి పట్ల ప్రేమ, మాతృభాష పట్ల ఆత్మగౌరవంతో తెలంగాణ ప్రజల గుండెలలో నిలిచిన తపస్వి. చదువులేమీ లేకపోయినా, జీవితానుభవమే ఆయనకు శాస్త్రమై, కవిత్వమే ఆయనకు బతుకుదారిచూపింది.

వరంగల్ జిల్లా జనగాం సమీపంలోని రేబర్తి గ్రామం ఆయన జన్మస్థలం. అదే మట్టి ఆయన మనసుగా మారింది.తెలంగాణ ప్రజోద్యమపు తుఫానులో అందెశ్రీ స్వరం పిడుగులా గర్జించింది. జయజయహే తెలంగాణ గీతం ప్రతి ఒక్కరి అభిమానం, ప్రతి ఉచ్ఛ్వాసం కదిలించే ధ్వనిగా మారింది. ఆ గీతం కేవలం పదాల సంకలనం కాదు, అది తెలంగాణ ఆత్మస్పూర్తి స్వరూపం. పల్లెల సోయగం ఆయన పదాలలో కొట్టుకొచ్చినట్లు కనపడుతుంది., ప్రజాజీవితం ఆయన కవితల్లో మెరిసి మురుస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉధృతమయ్యే ప్రతి వేళ ఆయన గళం ప్రజల్లో ఉద్యమ జ్వాలలంటించింది.

సినిమా ప్రపంచంలోనూ ఆయన స్వరం ప్రత్యేక స్థానం నిలుపుకుంది. ‘గంగ’, ‘ఆవారాగాడు’, ‘బతుకమ్మ’లాంటి చిత్రాలలో ఆయన గేయాలు తెలంగాణ భావాన్ని తెరమీదకు తీసుకొచ్చాయి. ఆయన రాసిన “మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు” వంటి పాటలు సామాజిక ఆవగాహనకు కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. 2006లో వచ్చిన ‘గంగ’ సినిమాకి ఆయన అందుకున్న నంది పురస్కారం ఆయన ప్రతిభకు ప్రతీకగా నిలిచింది.పురస్కారాలు ఆయన వెతుక్కోలేదు – అవే ఆయనను వెతికాయి.

లోక్ నాయక్ పురస్కారం, దాశరథి సాహితీ పురస్కారం, సుద్దాల హనుమంతు-జానకమ్మ అవార్డు, వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గౌరవం, కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ – ఈ జాబితా అంతం కానిది. కానీ అందెశ్రీకి అందిన అత్యున్నత బహుమతి ఆయనను ప్రేమించిన ప్రజల గుండెల్లో నిలిచిన అభిమానమే.“తెలంగాణా ధూంధాం” ఉద్యమ స్ఫూర్తిలో ఆయన వాక్యాలు బళ్ళెం నినాదాల్లా మారాయి. ఆయన సాహిత్యం, ఆయన గేయాలు, ఆయన వ్యక్తిత్వం ఇవన్నీ కలిపి తెలంగాణ ఆత్మగాథగా నిలిచాయి.

అతను లేని శూన్యంలో తెలంగాణ తల్లి హృదయం శోకవిలాపం చేస్తోంది – కానీ ఆయన గళం, ఆయన గీతం, ఆయన స్ఫూర్తి ఈ నేలతో ఎప్పటికీ దూరమవదు. ప్రతి ఉదయం పాఠశాలల్లో, ప్రతి సభా వేదికపై ‘జయ జయహే తెలంగాణా’ నినాదం వినిపించేంతవరకు అందెశ్రీ చిరంజీవే.ఆయన జీవితం ఒక పాటయై, అది తెలంగాణ తల్లి గుండెలో నిత్యం మ్రోగుతూనే ఉంటుంది. చిరునవ్వుతో అక్కున చేర్చుకొనే అందె శ్రీ నేడు అందరినీ విడిచి వెళుతున్న క్షణాన శోకతప్త హృదయంతో అక్షరనివాళులర్పిస్తూన్నాను.

కమలేకర్ నాగేశ్వర్ రావు ‘కమల్’
కవి, రచయిత, అనువాదకుడు
9848493223

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X