हैदराबाद: ब्राज़ील में तेलंगाना (भारत) के माओवादी पार्टी के महासचिव नम्बाला केशव राव उर्फ बसव राजू को श्रद्धांजलि देने के लिए एक शोक सभा आयोजित की गई। केशव राव की इस वर्ष मई में एक मुठभेड़ में मृत्यु हो गई थी। 7 अगस्त को एबीसी पॉलिस्ता संघीय विश्वविद्यालय (यूएफएबीसी) के सैंटो आंद्रे परिसर में नम्बाला केशव राव के सम्मान में एक शोक सभा समारोह आयोजित किया गया।
इस सभा का आयोजन साम्राज्यवाद विरोधी लीग (एआईएल) द्वारा किया गया था, जिसमें भारतीय कम्युनिस्ट पार्टी (माओवादी) के नेतृत्व वाली भारतीय क्रांति के प्रति समर्थन व्यक्त किया गया। इस बैठक में सभी लोकतांत्रिक और प्रगतिशील नेताओं ने भाग लिया। इस अवसर पर मध्य-पूर्वी भारत में लाल गलियारे के रूप में जाने जाने वाले क्षेत्र में गुरिल्लाओं और भाकपा (माओवादी) के नेतृत्व में लोगों के दैनिक जीवन को दर्शाती एक रिपोर्ट प्रदर्शित की गई।
इस बैठक के दौरान, एआईएल और छात्र आंदोलन ‘डॉन ऑफ द पीपल’ के प्रतिनिधियों ने दुनिया भर में हो रहे क्रांतिकारी संघर्षों की रक्षा करने के अंतर्राष्ट्रीय कर्तव्य पर बल दिया। उन्होंने ब्राज़ील और भारत जैसे देशों में, जो साम्राज्यवादी और अर्ध-सामंती शोषण से पीड़ित हैं, एक नई लोकतांत्रिक क्रांति की आवश्यकता पर ज़ोर दिया।
इन नेताओं ने दुनिया के उत्पीड़ित लोगों के विरुद्ध किए जा रहे साम्राज्यवादी आक्रमणों की निंदा की और उदाहरण के तौर पर ब्राज़ील पर संयुक्त राज्य अमेरिका द्वारा लगाए गए प्रतिबंधों का हवाला दिया, जिनका उद्देश्य देश की विशाल राष्ट्रीय संपदा, विशेष रूप से दुर्लभ-पृथ्वी संसाधनों को लूटना शामिल है। एएनडी के ऐतिहासिक महानिदेशक, कॉमरेड फॉस्टो अरुडा के सम्मान में प्रकाशित एक विशेष संस्करण और अन्य प्रकाशन यहाँ प्रदर्शित किए गए।
Also Read-
నంబాళ్ల కేశవరావుకు బ్రెజిల్ లో నివాళి
హైదరాబాద్ : ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుకు నివాళిగా బ్రెజిల్లో సంతాప సమావేశం నిర్వహించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) నేతృత్వంలోని భారత విప్లవానికి మద్దతుని ప్రకటిస్తూ నంబళ్ల కేశవరావు గౌరవార్థం ఆగస్ట్ 7న యాంటీ-ఇంపీరియలిస్ట్ లీగ్ (ఎఐఎల్- సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్) నిర్వహించిన ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ ఏబీసీ పాలిస్టా (యూఎఫ్‌ఏబీసీ)కి చెందిన శాంటో ఆండ్రే క్యాంపస్‌లో కార్యక్రమం జరిగింది.
ఈ సమావేశానికి ప్రజాస్వామిక, అభ్యుదయవాదులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధ్య-తూర్పు భారతదేశంలోని రెడ్ కారిడార్ అని పిలిచే ప్రాంతంలో గెరిల్లాలు, సీపీఐ (మావోయిస్ట్) నేతృత్వంలోని ప్రజల దైనందిన జీవితాలను వర్ణించే ఒక రిపోర్టును ఈ సందర్భంగా ప్రదర్శించారు.
ఈ సమావేశంలో ఎఐఎల్, విద్యార్థి ఉద్యమం ‘డాన్ ఆఫ్ ది పీపుల్’ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విప్లవ పోరాటాలను రక్షించే అంతర్జాతీయ విధిని గురించి నొక్కి చెప్పారు. బ్రెజిల్, భారతదేశం వంటి సామ్రాజ్యవాద, అర్ధ-భూస్వామ్య దోపిడీ ద్వారా అణచివేతకు గురవుతున్న దేశాలలో నూతన ప్రజాస్వామిక విప్లవ అవసరాన్ని గురించి వివరించారు.
దేశంలోని విస్తారమైన జాతీయ సంపదను, ముఖ్యంగా అరుదైన-భూమి వనరులను దోచుకొనే లక్ష్యంతో అమెరికా బ్రెజిల్‌పై విధించిన ఆంక్షలను ఉదాహరణగా చూపిస్తూ ప్రపంచంలోని పీడిత ప్రజలపైన అమలవుతున్న సామ్రాజ్యవాద దురాక్రమణలను ఖండించారు. ఏఎన్‌డీ చారిత్రాత్మక జనరల్ డైరెక్టర్ కామ్రేడ్ ఫౌస్టో అర్రుడా గౌరవార్థం తీసుకువచ్చిన ఒక ప్రత్యేక సంచికను, ఇతర ప్రచురణలను ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. (ఏజెన్సీలు)
