హైదరాబాద్: డా బి ఆర్ యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక సమ్మెను బుధవారం విరమించారు. ముందుగా కాంట్రాక్టు అధ్యాపకులకు యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, టైం స్కేల్ ఉద్యోగుల సంఘం, SC, స్టేటస్ ఉద్యోగుల సంఘం సభ్యులు సంఘీభావం తెలిపారు.
యూనివర్సిటీ వీసీ ప్రో ఘంటా చక్రపాణి సూచన మేరకు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో అకాడమిక్ డైరెక్టర్ ప్రో. జి పుష్ప చక్రపాణి, యూజీసీ డీఈబీ డైరెక్టర్ ప్రో. పల్లవి కాబ్డే, పీఆర్వో డా. వేణుగోపాల్ రెడ్డి చర్చలు జరిపారు. యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపిందని తెలిపారు. స్పష్టమైన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.
Also Read-
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు డా. కె. అవినాష్, ఉపాధ్యక్షురాలు కె ఉమాదేవి, సలహాదారులు డా. యాదగిరి కంభంపాటి, డా. కాసం విజయ్, ఈసీ సభ్యులు డా. మఖ్డుం మొయియుద్దీన్, కాంట్రాక్టు అధ్యాపకులు డా. ఎం. నాగరాజు, డి. కోటేశ్వర రావు, డా. విజయ ఉషశ్రీ, డా. సిద్ధాంతి అరుణ, డా. పడాల లక్ష్మణ్, డా. సునీల్ కుమార్, డా. కురుమేటి దయాకర్, డా. పీ. రాధాకృష్ణ, నర్సయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.
