పూర్వ విద్యార్థులే అటు విశ్వవిద్యాలయానికి ఇటు సమాజానికి అనుసంధానకర్తలు: ఆచార్య ఘంటా చక్రపాణి

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జీవితాన్ని ఇచ్చింది : సింగరేణి సీఎండీ బలరాం

అంబేద్కర్ యూనివర్సిటీ నాకు అమ్మ లాంటిది : వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వీసీ ప్రొ. సూర్య ధనుంజయ

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం (ఏఏఏఓయూ) ఆధ్వర్యంలో “సామాజిక సాధికారత ఉత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయ గ్లోబల్ అలుమ్ని మీట్ (ప్రపంచ పూర్వ విద్యార్థుల సదస్సు) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారని, పూర్వ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభతో సమాజాభివృద్ధికి పాటు పడుతున్నారని వివరించారు. అటు విశ్వవిద్యాలయానికి ఇటు సమాజానికి అనుసంధానకర్తలు అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పది వేల మంది పూర్వ విద్యార్థులతో పెద్ద స్థాయిలో సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్ధులు పాల్గొని తమతమ జీవిత అనుభవాలను నెమరు వేసుకున్నారు. వారిలో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకుపతి ప్రొ. సూర్య ధనంజయ్ మాట్లాడుతూ ఓ మారు మూల తండా నుంచి వచ్చిన నన్ను అంబేద్కర్ యూనివర్సిటీ అమ్మలా ఆదరించిందని పేర్కొంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ. ఎన్. బలరామ్, ఐ.ఆర్.ఎస్. మాట్లాడుతూ ఆటో నడుపుకునే తనకు ఈ యూనివర్సిటీ కోత్త జీవితాన్ని ఇచ్చిందని వెల్లడించారు.

తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ కట్టా హైమవతి, ఐ.ఏ.ఎస్., గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఆంధ్రప్రదేశ్) సెంట్రల్ కమీషనర్ సాధు నరసింహ రెడ్డి, ఐ.ఆర్.ఎస్. సైబరాబాద్ (శంషాబాద్ ట్రాఫిక్ డివిజన్) అసిస్టెంట్ కమీషనర్ పరికే నాగభూషణం; 2018లో ప్రపంచ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ బంగారు పతక విజేత మస్కు ప్రవీణ్ కుమార్; ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ నాయబ్ సుబేదార్ శబ్బీర్ ఖాన్; సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహిత, రచయిత, జర్నలిస్ట్, యాంకర్ నునావత్ కార్తీక్; నంది అవార్డు గ్రహీత సినీ నటి వడ్లమూడి కల్పన; పారిశ్రామిక వేత్త వరకాల విజయ లక్ష్మి; ధాత్రి కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ పమిడికల్వ మధుసూదన్ పాల్గొని తమ మర్చిపోలేమని వివరించారు.

Also Read-

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు జ్యోతి రెడ్డి (అమెరికా), స్పూర్తి జితేందర్ (అమెరికా), చెన్న రాగిణి (కెనడా), డేవిడ్ రాజ్ తోకల (లండన్), భరణి శేషపు (జర్మనీ), దుర్దానా తలత్ షైస్తా (రియాద్), డి. స్రవంతి (దుబాయ్), వేల్పుల సౌమ్య (ఆస్ట్రేలియా), సుప్రియా శర్మ (యుఎస్ఎ), నసీన్మా అలీ దుబాయ్), జి. లలిత స్మిత (కెనడా), సావిత్రి సి (దుబాయ్), పగడాల సుని కుమార్ (కెనడా),శివ కుమార్ (యుఎస్ఎ), మమత ఎమ్ ధంతాల్ (కెనడా), జి. ఉషశ్రీ లక్ష్మి (దుబాయ్), వల్లేటి పూజిత (కెనడా), రజినీ కుమారి ముళ్లపూడి (యుఎస్ఎ), తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో గౌరవ గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్, డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ యూ.జి.సి డెబ్ డైరెక్టర్ ప్రొ.పల్లవీ కాబ్డే, పూర్వ విద్యార్థుల సంఘం నోడల్ అధికారి డా. బానోత్ ధర్మా, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు సాజిదా ఖాన్; డా. డి. ఉదయని; ఎన్. యాదగిరి; కార్యనిర్వాహక సభ్యులు ప్రొ. కె. చంద్రకళ, ఎండి హబీబుద్దీన్, ఎం. రుషేంద్రమణి, కె. మంజుల, వి. చంద్ర కుమార్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X