हैदराबाद : आकाश दीप-जसप्रीत बुमराह ने ब्रिस्बेन गाबा के मैदान पर फॉलोऑन बचाया। इसके साथ ही भारतीय टीम शर्मसार होने से बाल-बाल बच गई। पहले केएल राहुल और फिर रविंद्र जडेजा ने ऑस्ट्रेलियाई गेंदबाजों का डटकर सामना किया। जसप्रीत बुमराह ने 27 गेंदों में एक छक्का के दम पर नाबाद 10 रन और आकाश दीप 31 गेंदों में 2 चौके और एक छक्का के दम पर नाबाद 27 रन भारत को फॉलोऑन से बचा लिया। जब आकाश दीप ने कमिंस को चौका मारते हुए कट ऑफ स्कोर को पार किया तो टीम इंडिया के ड्रेसिंग रूम में सेलिब्रेशन देखते बन गया था। एक प्रकार से यह मैच जीत से कम नहीं रहा है। हर तरफ खुशी ही खुशी दिख रही थी।
हेड कोच गौतम गंभीर, विराट कोहली, कप्तान रोहित शर्मा खूशी से झूम रहे थे, जबकि इसके बाद ही आकाश ने कमिंस को एक छक्का भी मारा। उनके बीच 39 रनों की साझेदारी हो चुकी है। भारत ने चौथे दिन 74.5 ओवरों में 9 विकेट खोकर 252 रन बनाए, जबकि ऑस्ट्रेलियाई टीम ने पहली पारी में 445 रनों का पहाड़ सरीखा स्कोर खड़ा किया था। आपको बता दें कि आखिरी बार 2011 में भारतीय टीम इंग्लैंड के खिलाफ ओवल टेस्ट में फॉलोऑन नहीं बचा पाई थी।
भारत के लिए दो सबसे बड़ी साझेदारी हुई। केएल राहुल और रविंद्र जडेजा ने छठे विकेट के लिए 67 रन जोड़े, जबकि 7वें विकेट के लिए जडेजा और नीतीश कुमार रेड्डी ने 53 रन जोड़े। इससे पहले अपने तीसरे दिन के स्कोर चार विकेट पर 51 रन से आगे खेलते हुए भारतीय बल्लेबाजों ने जुझारूपन दिखाया और राहुल संकटमोचक साबित हो गये। राहुल भाग्यशाली रहे जिन्हें दिन की पहली गेंद पर दूसरी स्लिप में स्मिथ से जीवनदान मिला जबकि पैट कमिंस गेंदबाज थे। उस समय राहुल 33 रन पर थे।
ऑस्ट्रेलिया ने उनके लिए तीन स्लिप और एक गली फील्डर लगाया था ताकि राहुल को गलती करने पर मजबूर कर सके। लेकिन राहुल ने ढीली गेंदों का इंतजार किया और कोई जोखिम नहीं उठाया। कमिंस ने उन्हें ऑफ स्टंप के बाहर भी गेंदें डाली जिन्हें या तो उन्होंने छोड़ दिया या रक्षात्मक खेला। वहीं कप्तान रोहित शर्मा (10) एक बार फिर नाकाम रहे। उन्होंने ऑफ स्टंप पर पड़ती कमिंस की गेंद पर बल्ला अड़ाया और विकेट के पीछे एलेक्स कैरी ने उन्हें चपलता से चलता कर दिया।
यह भी पढ़ें-
तेज गेंदबाज जोश हेजलवुड पिंडली में चोट के कारण मैदान से चले गए जिससे मेजबान टीम को एक गेंदबाज की कमी खली। हेजलवुड संभव है कि सीरीज से बाहर हो जाएं। इससे पहले केएल राहुल शतक से वंचित रह गए और 84 के स्कोर पर नाथन लायन की गेंद पर पहली स्लिप में स्टीव स्मिथ को कैच दे बैठे। आर अश्विन और वॉशिंगटन सुंदर पर जडेजा को तरजीह दिए जाने पर कइयों ने सवाल उठाए थे, लेकिन इस हरफनमौला ने अपनी उपयोगिता एक बार फिर साबित कर दी। (एजेंसियां)
గబ్బా టెస్టులో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది
హైదరాబాద్ : గబ్బా టెస్టులో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. టెయిలెండర్లు ఆకాశ్ దీప్ (27), జస్‌ప్రీత్ బుమ్రా (10) భారత్‌ను ఆదుకున్నారు. అబేధ్యమైన పదో వికెట్‌కు ఈ జోడీ 39 పరుగులు జోడించింది. దీంతో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. నాలుగో రోజు ఆటకు కూడా వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. ఇక చివరకు వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను త్వరగానే ముగించారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.
ఓవర్ నైట్ స్కోరు 51/4తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్.. కాసేపటికే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. 74 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పదా అనిపించింది. కానీ కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) పోరాడటంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ 141 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. నితీశ్ కుమార్ రెడ్డి (16) కూడా త్వరగానే ఔట్ కావడంతో 194 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఫాలో ఆన్ గండం దాటాలంటే ఇంకా 52 పరుగులు అవసరం.
ప్రధాన బ్యాటర్లంతా ఔట్ కావడంతో ఇక ఫాలో ఆన్ తప్పదని అంతా భావించారు. కానీ ఆకాశ్ దీప్, బుమ్రా అద్భుతం చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. అబేధ్యమైన పదో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. దీంతో ఫాలో ఆన్ గండం దాటాలంటే అవసరమైన 246 పరుగుల మార్కును భారత్ దాటింది. దీంతో భారత శిబిరంలో నవ్వులు పూశాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు గండం గట్టెక్కింది అన్నట్లుగా లుక్ ఇచ్చారు.
ప్రస్తుతం భారత్ స్కోరు.. 252/9గా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా ఇంకా 193 పరుగులు వెనకబడి ఉంది. ఇప్పటికే నాలుగు రోజుల ఆట పూర్తికాగా.. చివరి రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆలౌట్ చేసి.. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. అప్పుడు భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేసిస్తుంది. కానీ సుమారు 95 ఓవర్ల ఆటలో ఇవన్నీ సాధ్యమవుతాయా అనేది అనుమానమే. దీంతో ఈ టెస్టు డ్రా అవుతుందని అంచనాలు ఉన్నాయి. (ఏజెన్సీలు)