… తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేసిన బిజెపి ఎస్టి మోర్చా అధ్యక్షులు డా కళ్యాణ్ నాయక్

హైదరాబాద్ : అసిఫాబాద్ జిల్లా జైనూరు ఆదివాసి గిరిజనులపై, అత్యాచారాలు, దాడులు, అక్రమ కేసులు మరియు అక్రమంగా తిష్ట వేసిన ముస్లింలను వెంటనే మైదాన ప్రాంతాలకు తరలించాలని, రాజ్యాంగం ఐదవ షెడ్యూల్లోని గిరిజనుల హక్కులు, పీసా చట్టం, 1/70 యాక్ట్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కి ఫిర్యాదు చేసిన బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ మరియు అధికార బృందం.

కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో మహిళలపై అత్యాచారాలు, దాడులు, అక్కడ నివసిస్తున్న గిరిజనులపై పోలీసుల అక్రమ కేసులు అదేవిధంగా ట్రైబల్ యాక్ట్ 1/70 ప్రకారం ట్రైబల్స్ మాత్రమే ఏజెన్సీ ఏరియాలలో నివాసం ఉండాలి, కానీ ఆ జిల్లాలో 500 కి పైగా ముస్లిం కుటుంబాలు నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకొని వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారన్ని, అదేవిధంగా అసిఫాబాద్ జిల్లాలో నివసిస్తున్న 64 కి పైగా ముస్లిం కుటుంబాలు గిరిజన ఆదివాసి మహిళలను లవ్ జిహాద్ పేరుతో వివాహం చేసుకుంటున్నారు.

అదేవిధంగా అక్కడ నివసిస్తున్న గిరిజన ఆదివాసులపై ముస్లిం కుటుంబాలు ఆధిపథ్య పోరు చెలాయిస్తూ భూ కబ్జాలకు, ఇండ్లు, ప్రభుత్వ పథకాలను అక్రమంగా వినియోగించుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులపై దాడులు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఓట్ల కోసం పాకులాడడం సిగ్గుచేటు. గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలను ఇక్కడ నుంచి తరిమి వేయాలి, గిరిజన సాంప్రదాయాలను ధ్వంసం చేస్తూ గిరిజన హక్కులను కాలరాస్తున్న వారిని తరిమి వేయాలన్నారు. అదేవిధంగా చట్టం అమలు చేసేటట్టు ప్రభుత్వానికి ఆదేశించగలరని గవర్నర్ కి కోరడం జరిగింది.

డాక్టర్ కళ్యాణ్ నాయక్ అందించిన ఫిర్యాదును స్వీకరించిన అనంతరం గవర్నర్ సానుకూలంగా స్పందించి త్వరలో ఆసిఫాబాద్ జిల్లా జైనురు కి వచ్చి గిరిజనులకు వెంటనే న్యాయం చేస్తానని, పీసా చట్టం అమలు అయ్యేటట్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కళ్యాణ్ నాయక్ తోపాటు బిజెపి ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్కు నాథ్ నాయక్, ఎస్టీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ నేనావత్ రవి నాయక్, ఎస్టి మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ కొట్నాక విజయ్, ఎస్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాజు రాథోడ్, బిజెపి రాష్ట్ర నాయకులు రితేష్ రాథోడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బానోత్ అనూష మరియు ఎస్టి మోర్చా వుమెన్ వింగ్ కన్వీనర్ బానోత్ జ్యోతి మరియు రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar