హైదరాబాద్ : జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర చైర్మన్ శ్రీ మామిడి రిషికేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విద్యా మిషన్ మీద సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కు ముఖ్య అతిథులు గా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, యం. వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఒబిసి సెల్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్,జెబియం రాష్ట్ర ఇంచార్జీ అశోక్ మరిదాస్ తదితరులు విచ్చేసి కొన్ని సిఫారసులను విద్యా మిషన్ కు తెలియజేశారు.
ఈ సిఫారసులు ముఖ్యమైనవి నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం కావాలి. విద్యా సంక్షోభాన్ని సర్కార్ గుర్తించాలి. విద్యాసంస్కరణలు తీసుకురావాలి విద్యపై నిర్లక్ష్యం ఒక తరానికే అన్యాయం చేయకూడదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని ప్రకటించడం హర్షించేదగ్గ విషయం అయితే తెలంగాణ విద్య వ్యవస్థ ఎంత పెద్ద సంక్షోభంలో ఉందో లోతులకు పోతేనే ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు తెలంగాణ విద్య సామర్ధ్యాలు అందించడం విషయంలో 35 స్థానంలో ఉంది.
ఇది కూడ చదవండి-
కేవలం మేఘాలయ మాత్రమే మనకన్నా వెనుకబడి ఉంది అలాగే గత విద్యా సంవత్సరం ఎస్సీఈఆర్టీ నిర్వహించిన ఎఫ్ ఎల్ ఎన్ అసెస్మెంట్ పాటు కొన్ని జాతి నివేదిక లు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ముందుగా ఈ నివేదికలు అన్నిటిపై పూర్తి సమీక్షలు నిర్వహించాలి. గత పది సంవత్సరాలు విద్యా వ్యవస్థ పై పెట్టాల్సినంత దృష్టి పెట్టకపోవడం అవసరమైన విధులను కేటాయించుకోవడం చట్టబద్ధమైన కేంద్ర విద్యా హక్కు చట్టం అమలు చేయాలని, అలాగే పైన పేర్కొన్న సిఫారసులను సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర జవహర్ బాల్ మంచ్ విభాగం ప్రభుత్వంకు విన్నవిస్తుంది.