చెస్ విశ్వ విజేతలను భారత్ కు అందించడమే ఇండియన్ చెస్ మాస్టర్స్ లక్ష్యం: అరుణ్ జూపల్లి
హైదరాబాద్ : చెస్ క్రీడలో విశ్వవిజేతలను భారత్ కు అందించడమే ఇండియన్ చెస్ మాస్టర్స్, ఏకగ్రా చెస్ అకాడమీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని సోషల్ యాక్టివిస్ట్, కొల్లాపూర్ రత్నగిరి ఫౌండేషన్ వైస్ చైర్మన్ అరుణ్ జూపల్లి అన్నారు. బేగంపేట్ లోని ఇండియన్ చెస్ మాస్టర్స్ సెంటర్లో గ్రాండ్ మాస్టర్స్ కోచింగ్ క్యాంపును ప్రారంభంచారు. హైదరాబాద్ లో ఇలాంటి శిక్షణాశిబిరాలనునిర్వహిస్తూ పిల్లలకు, విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చి గ్రాండ్ మాస్టర్లుగా రూపుదిద్దుతున్నారని అభినందించారు.
భారతీయులు కనిపెట్టిన చదరంగం క్రీడ ప్రపంచంలో తెలివైన ఆటగా ప్రసిద్ధికేక్కిందన్నారు. చెస్ తో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, జ్ఞాపకశక్తిపెరుగుతుందన్నారు పిల్లలకుశిక్షణ ఇచ్చేందుకు గాన ప్రత్యేకించి చెన్నయ్ నుంచి వచ్చిన 13వ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ దీపన్ చక్రవర్తిమాట్లాడుతూ… చెస్ అన్ని వయసుల వారు ఆడే క్రీడా అని ఈ ఆట లో వారికి తగిన మెళ కువలు సూచనలు ఇస్తే వారు రానున్న రోజుల్లో మేటి క్రీడా కారులుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధించే లా తీర్చి దిద్దడం తన ధ్యేయమని చెప్పారు.
ఇండియన్ చెస్ మాస్టార్స్ కోచ్ చైతన్య సురేష్ మాట్లాడుతు… తమ దగ్గర శిక్షణ పొందిన పిల్లలు వివిధ కాటగిరిలలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా జాతీయ స్థాయి చదరంగం పోటీలకు ఎంపికవుతున్నారని చెప్పారు. ఏకగ్రా చెస్ అకాడమీ సీఈఓ సందీప్ నాయుడుమాట్లాడుతూ… గ్రాండ్ మాస్టర్ శిక్షణా శిబిరం 12వ తేదీ వరకు తమ కొనసాగుతాయన్నారు. ఇంతవరకూ తెలంగాణ మొత్తంలో ఎక్కడా గ్రాండ్ మాస్టర్ శిక్షణా శిబిరం నిర్వహించలేద మొదటిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొవా లన్నారు. (ఏజెన్సీలు)
ग्रैंड मास्टर्स कोचिंग कैंप बेगमपेट में भारतीय शतरंज मास्टर्स सेंटर में शुरू
हैदराबाद : सामाजिक कार्यकर्ता, कोल्लापुर रत्नागिरी फाउंडेशन के उपाध्यक्ष अरुण जुपल्ली ने कहा कि भारतीय शतरंज मास्टर्स और एकाग्र शतरंज अकादमियों का लक्ष्य भारत को शतरंज के खेल में विश्व चैंपियन प्रदान करना है। ग्रैंड मास्टर्स कोचिंग कैंप बेगमपेट में भारतीय शतरंज मास्टर्स सेंटर में शुरू हुआ। उन्होंने इस बात की सराहना की कि हैदराबाद में इस तरह के प्रशिक्षण शिविर आयोजित करके बच्चों और छात्रों को सर्वोत्तम प्रशिक्षण दिया जा रहा है और उन्हें ग्रैंड मास्टर्स के रूप में आकार दिया जा रहा है।