हैदराबाद : तेलंगाना इंटर बोर्ड ने अहम फैसला लिया है। घोषणा की गई है कि परीक्षा देने वाले छात्रों को सुबह 9 बजे के बाद पांच मिनट देरी से आने की अनुमति दी जाएगी। परीक्षा केंद्र पर सुबह 8. 45 बजे पहुंचने की सलाह दी गई है। यह निर्णय एक मिनट नियम आलोचना की पृष्ठभूमि में लिया गया है।
मालूम हो कि 29 फरवरी को एक स्टूडेंट ने आत्महत्या कर ली थी क्योंकि अधिकारियों ने देर होने के कारण उसे परीक्षा देने की इजाजत नहीं दी थी। इंटरमीडिएट शिक्षा बोर्ड के अधिकारियों ने संबंधित जिला अधिकारियों और केंद्रों के मुख्य अधीक्षकों को सलाह दी है कि यदि छात्र विशिष्ट कारणों से परीक्षा केंद्र पर देर से पहुंचते हैं तो उन्हें पांच मिनट की छूट दी जाए।
गौरतलब है कि इंटर प्रथम वर्ष की परीक्षा 28 फरवरी से और माध्यमिक परीक्षा 29 फरवरी से शुरू हुई है। परीक्षा हर दिन सुबह 9 से दोपहर 12 बजे तक आयोजित की जाएगी। ये परीक्षाएं 18 मार्च तक जारी रहेगी। (एजेंसियां)
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, నిమిషం నిబంధన ఎత్తివేత
హైదరాబాద్ : ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని ప్రకటించింది. ఎగ్జామ్ సెంటర్ కు 8.45 గంటలకే చేరుకోవాలని సూచించింది. నిమిషం నిబంధనపై విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పరీక్షకు ఆలస్యమయ్యాడనే కారణంతో అధికారులు అనుమతించకపోవడంతో ఫిబ్రవరి 29న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫిబ్రవరి 28న ప్రారంభమవ్వగా సెకండియర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 29 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. మార్చి 18 వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. (ఏజెన్సీలు)