हैदराबाद: ग्रेटर शहर में मिलावटी खाद्य पदार्थों की बिक्री बढ़ती जा रही है। अवैध वसूली के आदी कई होटल व दुकान प्रबंधक लोगों की जान से खिलवाड़ कर रहे हैं। हर सामग्री मिलावटी है। यह सब देखकर ऐसी स्थिति हो जाती है कि चार बार सोचना पड़ता है कि अदरक लहसुन का पेस्ट, आइसक्रीम, चिकन, मटन, बिरयानी या अंडे खरीदें या नहीं।
शहर में जो घटनाएं सामने आ रही हैं उससे डर और बढ़ रहा है। जीएचएमसी और औषधि नियंत्रण अधिकारियों के निरीक्षण में परेशान करने वाली सच्चाइयां सामने आ रही हैं। शुक्रवार को अलग-अलग जगहों पर अधिकारियों द्वारा की गई तलाशी में सड़ा हुआ तंदूरी चिकन, केमिकल आइसक्रीम और खतरनाक एंटीबायोटिक दवाएं जब्त की गईं।
शहर में शुक्रवार को बेगमबाजार में मिलावटी अदरक-लहसुन पेस्ट और अत्तापुर में डुप्लीकेट रेड लेबल चाय पाउडर की दो और घटनाएं सामने आईं। राजेंद्रनगर के हैदरगुड़ा इलाके में एसवीएम ग्रैंड वेंगाम्बा रेस्तरां में सड़े हुए तंदूरी चिकन और अंडे के भंडारण से हंगामा मच गया। दो-तीन दिन पहले पकाए गए तंदूरी चिकन को होटल प्रबंधन ने फ्रिज में रख दिया। इन्हें गर्म किया जाता है और होटल में आने वाले ग्राहकों को ताज़ा कहकर परोसा जाता है।
इसकी पहचान कर चुके ग्राहकों ने जीएचएमसी अधिकारियों से शिकायत की। मिली शिकायत के आधार पर राजेंद्रनगर सर्कल के उपायुक्त रविकुमार के निर्देशन में शुक्रवार को रेस्तरां में तलाशी ली गई। तलाशी के दौरान फ्रिज में सड़े मुर्गे और अंडे रखे हुए मिले। इन्हें जब्त कर लिया गया और होटल मालिकों पर 50 हजार रुपये का जुर्माना लगाया।
गोना श्रीनिवास राव नामक कारोबारी उप्पल में गोना क्रीम्स नाम से आइसक्रीम यूनिट चलाता है। इसमें वह बच्चों को पसंद आने वाली बेरी और चॉकोस समेत अन्य फ्लेवर वाली आइसक्रीम बना रहे हैं। लेकिन वह इनमें प्रतिबंधित सिंथेटिक फूड कलर और एक्सपायर्ड केमिकल मिला रहा है। साथ ही वह उसे अस्वच्छ वातावरण में भंडारण कर रहा है।
इतना ही नहीं शहर के छोटी बेकरियों और आइसक्रीम पार्लरों में विभिन्न नामों से ब्रांडेड स्टिकर की आपूर्ति करता रहा है। वह एक साल से इस प्रकार कारोबार कर रहा है। इस बारे में सूचना मिलने पर मल्काजीगिरी एसओटी पुलिस ने आइसक्रीम यूनिट की तलाशी ली। मालिक गोना श्रीनिवास राव को गिरफ्तार कर लिया गया और मिलावटी आइसक्रीम के डिब्बे जब्त कर लिए गए। इन्हें परीक्षण के लिए लैब में भेजा दिया गया।
दूसरी ओर पिछले मंगलवार को ड्रग कंट्रोल अधिकारियों ने सिटी टास्क फोर्स पुलिस के साथ मलकपेट के अंतर्गत मुसारामबाग में तलाशी ली। ड्रग्स विक्रेता अरवपल्ली सत्यनारायण और वंगरी नवीन के पास नकली एमपीओडी-200 एंटीबायोटिक्स टैबलेट मिलीं। 7.34 लाख रुपये कीमत 27,200 गोलियां जब्त की। उनके साथ मीरपेट के एक ड्रग डीलर गंड्ला रामू को हिरासत में लिया गया और पूछताछ की गई।
पता चला कि इन तीनों को नकली दवाएं उत्तराखंड के कोध्वार से सप्लाई की जा रही थीं. ‘ऑपरेशन जॉय’ के नाम से टास्क फोर्स की टीमों के साथ उत्तराखंड में तलाशी अभियान चलाया। वहां नेक्टर हर्ब्स कंपनी पर छापा मारा और 44.33 लाख रुपये कीमत की 38,350 एंटीबायोटिक गोलियां जब्त की गईं। कंपनी के मैनेजर विशत कुमार के साथ यूपी के सचिन कुमार को गिरफ्तार किया गया।
రెస్టారెంట్‌లో కుళ్లిన చికెన్, గుడ్లు
హైదరాబాద్ : గ్రేటర్ సిటీలో కల్తీ ఫుడ్ విక్రయం పెరిగిపోతోంది. అక్రమార్జనకు అలవాటుపడిన చాలా మంది హోటల్స్, షాపుల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రతి పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఐస్‌క్రీమ్, చికెన్, మటన్, బిర్యానీ, గుడ్లు ఇలా ఏది కొందామన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
సిటీలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ, డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. శుక్రవారం వేర్వేరు చోట్ల అధికారులు నిర్వహించిన సోదాల్లో కుళ్లిన తందూరీ చికెన్, కెమికల్స్ఐస్క్రీమ్, డేంజరస్ యాంటీ బయోటిక్స్ మెడిసిన్పట్టుబడ్డాయి.
బేగంబజార్‌లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, అత్తాపూర్‌లో డూప్లికేట్ రెడ్‌లేబుల్ టీ పొడి తయారీ ఘటనలు మరువక ముందే శుక్రవారం సిటీలో మరో రెండు వెలుగు చూశాయి. రాజేంద్రనగర్ పరిధి హైదర్‌గూడలోని ఎస్‌వీఎం గ్రాండ్ వెంగమాంబ రెస్టారెంట్‌లో కుళ్లిన తందూరీ చికెన్, కోడిగుడ్ల స్టోర్‌చేసి ఉండడం కలకలం రేపింది. రెండు, మూడు రోజుల కింద వండిన తందూరీ చికెన్‌ను హోటల్ యాజమాన్యం ఫ్రిడ్జ్‌లో స్టోర్చేస్తున్నారు.
వాటినే వేడి చేసి హోటల్‌కి వచ్చే కస్టమర్లకు ఫ్రెష్‌గా వడ్డిస్తున్నారు. గుర్తించిన పలువురు కస్టమర్లు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా, రాజేంద్రనగర్ సర్కిల్ ఉపకమిషనర్ రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం రెస్టారెంట్‌లో సోదాలు నిర్వహించారు. కుళ్లిపోయిన చికెన్, కోడిగుడ్లను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని హోటల్యాజమానులకు 50 వేలు ఫైన్విధించారు.
గోన శ్రీనివాసరావు అనే వ్యాపారి ఉప్పల్‌లో గోనా క్రీమ్స్ పేరుతో ఐస్ క్రీమ్ యూనిట్ నిర్వహిస్తున్నాడు. ఇందులో చిన్నారులు ఎంతో ఇష్టపడే బెర్రీస్, చాకోస్ సహా ఇతర ఫ్లేవర్లతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నాడు. అయితే వాటిలో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్, ఎక్స్ పైర్అయిన రసాయనాలను మిక్స్ చేస్తున్నాడు.
అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్చేస్తున్నాడు. వివిధ రకాల పేర్లతో బ్రాండెడ్స్టిక్కర్లు అంటించి, సిటీ శివారు ప్రాంతాల్లోని చిన్నచిన్న బేకరీలు, ఐస్‌క్రీమ్ పార్లర్లకు కు సప్లయ్చేస్తున్నాడు. ఏడాదిగా ఈ దందా నడిపిస్తున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం ఐస్క్రీమ్యూనిట్లో సోదాలు జరిపారు. యజమాని గోన శ్రీనివాసరావును అరెస్ట్ చేసి, కల్తీ ఐస్క్రీమ్బాక్సులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వాటిని టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపించారు.
గత మంగళవారం సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్‌లో సోదాలు నిర్వహించారు. డ్రగ్ డీలర్లు అరవపల్లి సత్యనారాయణ, వంగరి నవీన్ వద్ద నకిలీ ఎమ్‌పీఓడీ–200 యాంటీ బయోటిక్స్ ట్యాబ్లెట్లు గుర్తించారు. 7.34లక్షలు విలువ చేసే 27,200 ట్యాబ్లెట్లను సీజ్ చేశారు. వారితోపాటు మీర్‌పేటకు చెందిన డ్రగ్‌డీలర్ గండ్ల రాములును అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ ముగ్గురికి ఉత్తరాఖండ్ కొధ్వార్ నుంచి నకిలీ డ్రగ్స్సప్లయ్ అవుతున్నట్లు గుర్తించారు. టాస్క్‌ఫోర్స్ టీమ్స్‌తో ఉత్తరాఖండ్‌లో ‘ఆపరేషన్ జాయ్’ పేరుతో సోదాలు చేశారు. అక్కడి నెక్టార్ హెర్బ్స్ కంపెనీపై దాడులు నిర్వహించి, 44.33లక్షలు విలువ చేసే 38,350 యాంటీ బయోటిక్ ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ నిర్వాహకుడు విషత్కుమార్తో పాటు యూపీకి చెందిన సచిన్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. (ఏజెన్సీలు)