BRAOU: “సమాజానికి సావిత్రీబాయి ఫూలే జీవితం ఆదర్శం”

ఆచార్య చల్లపల్లి స్వరూపా రాణి
డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సావిత్రిబాయి ఫూలే స్మారకోపన్యాసం

హైదరాబాద్: శ్రీమతి క్రాంతి జ్యోతి సావిత్రీ భాయి ఫూలే, 193వ జయంతి పురస్కరించుకుని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సోమవారం స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. చల్లపల్లి స్వరూపా రాణి పాల్గొని ‘సామాజిక న్యాయం కోసం సావిత్రీబాయి ఫూలే పోరాటం’ అనే అంశంపై ఉపన్యాసం చేశారు. కార్యక్రమాన్ని అంతర్జాలంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ సావిత్రీ భాయి ఫూలే జీవితం సమాజానికి ఆదర్శమని, మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో పురుషుల ఆధిపత్యాన్ని ప్రశ్నించారని పేర్కొన్నారు. ఆధిపత్య వర్గాల నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని, బ్రామ్మన సమాజ మహిళలు ఎదుర్కొన్న సమస్యలను కూడా ప్రశ్నిస్తూ ఆ వర్గాల మహిళల హక్కుల రక్షణకు పాటు పాటు పడ్డారన్నారు. శిశు హత్యా నిరోధక గృహాలను ఏర్పాటు చేశారని, మాతా శిశు మరణాల నిరోధానికి పాటు పడ్డారన్నారు.

సమాజం ఎదిరించినా తన భర్త జ్యోతి రావు ఫూలే అంత్యక్రియలు తానే నిర్వహించి ఆదర్శ మహిళగా నిలిచిందన్నారు. సావిత్రీ భాయి ఫూలే జీవితం, ఆదర్శ భావాలూ భవిష్యత్ తరాలకు అవసరమని, విశ్వవిద్యాలయాల్లో ఆమె జీవితంపై మరింత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. కే. సీతారామ రావు మాట్లాడుతూ ఆదర్శ భావాలు కలిగిన సావిత్రీ భాయి ఫూలే సమ సమాజ స్థాపనకు కృషి చేశారని, మహిళా సాధికారత, మహిళలకు విద్యాభ్యాసం, పాటశాలల ఏర్పాటు, ఒక ఆదర్శ ఉపాధ్యాయురాలుగా ఆమె చేసిన కృషిని కొనియాడారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి కార్యక్రమం ఆవశ్యకతను వివరిస్తూ ముఖ్య అతిథిని పరిచయం చేశారు. అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రొ. చల్లపల్లి స్వరూపా రాణి చేస్తున్న కృషిని కొనియాడారు. రిజిస్ట్రార్‌ డా. ఎ.వి.ఎన్‌. రెడ్డి, విశ్వవిద్యాలయ మహిళాభివృద్ధి సంస్థ ఇంఛార్జి డా. మేరీ సునంద తదితరులు ప్రసంగించారు.

కార్యక్రమంలో సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఐ. ఆనంద్ పవర్; ఈ.ఎం.అర్.సి, డైరెక్టర్ ప్రో. వడ్డాణం శ్రీనివాస్; ఎడ్యుకేషన్ విభాగ డీన్ ప్రొ. చంద్రకళ; లైబ్రరీ ఇన్చార్జి డా. ఎన్. రజని; డా. జి. దయాకర్ అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, ఉద్యోగ సంఘాల నాయకులు, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది, పరిశోధక విద్యార్ధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X