हैदराबाद: तेलंगाना विधानसभा चुनाव का मतदान अगले 9 दिनों में होने वाला है। इसी पृष्ठभूमि में तेलंगाना में आईटी के छापों से एक बार फिर हड़कंप मच गया है। विधानसभा चुनाव में खड़े हो चुके कई उम्मीदवारों, उनके रिश्तेदारों और अनुयायियों के घरों में आईटी तलाशी ली गई है। मंगलवार को एक पूर्व सांसद के घर पर आईटी तलाशी ली जा रही है। चेन्नूर कांग्रेस उम्मीदवार के रूप में मैदान में उतरे जी विवेक के घर पर सुबह से ही आईटी की तलाशी चल रही है। आईटी तलाशी उनके चेन्नुरु, सोमाजीगुडा, हैदराबाद स्थित आवास, कंपनियों, कार्यालयों, रिश्तेदारों और अनुयायियों के घरों पर की जा रही है।
विवेक तेलंगाना के सबसे अमीर विधायक उम्मीदवार बन गए है। अपने चुनावी हलफनामे में उन्होंने 610 करोड़ से ज्यादा की संपत्ति घोषित की है। विवेक ने अपने हलफनामे में यह भी कहा है कि उन्होंने मुख्यमंत्री केसीआर को भी कर्ज दिया है। बीआरएस नेता विवेक पर आरोप लगा रहे है कि वे चेन्नूर में बाढ़ की तरह पैसा बहा रहे हैं। वहां चुनाव लड़ रहे बीआरएस के बाल्का सुमन ने गंभीर आरोप लगाया कि वे मतदाताओं को पैसे से लुभाने की कोशिश कर रहे हैं। इसकी शिकायत राज्य निर्वाचन आयोग से भी की गयी है। इसी पृष्ठभूमि में खबर सुनने को मिल रही है कि आईटी हमले हो रहे हैं। आईटी हमलों की जानकारी मिलने के बाद कांग्रेस कार्यकर्ता विवेक के चेनुरु स्थित घर पहुंचे और विरोध प्रदर्शन शुरू कर दिया। इससे वहां तनावपूर्ण माहौल हो गया।
हाल ही में, आईटी अधिकारियों ने पूर्व सांसद पोंगुलेटी श्रीनिवास रेड्डी, महेश्वरम कांग्रेस उम्मीदवार केएलआर, पार्टी नेता पारिजात नरसिम्हारेड्डी, पूर्व मंत्री जाना रेड्डी और बीआरएस महेश्वरम उम्मीदवार मंत्री सबिता इंद्रा रेड्डी के आवासों पर तलाशी ली। मंत्री सबिता के समर्थकों के घरों से भारी मात्रा में नकदी जब्त की गई। मिर्यालागुडा में चावल मिल मालिकों के आवासों पर भी आईटी की तलाशी ली गई। चुनाव में खर्च करने के लिए भारी नकदी जमा किये जाने की सूचना पर आईटी अधिकारियों ने छापेमारी की है। चुनाव के दौरान आईटी अधिकारी सिलसिलेवार छापे कर रहे हैं।
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో 9 రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు, వారి బంధువులు, అనుచరుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరగ్గా ఇవాళ ఓ మాజీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జి. వివేక్ ఇంట్లో తెల్లవారుజాము నుంచే ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నూరులోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్ సోమాజిగూడలోని నివాసం, ఆయనకు చెందిన కంపెనీలు, కార్యాలయాలు, బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో అత్యంత ధనిక ఎమ్మెల్యే అభ్యర్థిగా వివేక్ బరిలో నిలిచారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 610 కోట్లకుపైగా ఆస్తులను ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా తాను అప్పు ఇచ్చినట్లు వివేక్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక చెన్నూరులో వివేక్ ధన ప్రలోభానికి తెరలేపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అక్కడ పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బాల్క సుమన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐటీ దాడుల విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు చెన్నూరులోని వివేక్ ఇంటికి చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ టెన్షన్ వాతవారణం నెలకొంది.
ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్‌ఆర్, ఆ పార్టీ నేత పారిజాత నర్సింహ్మారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి నివాసాలతో పాటు బీఆర్ఎస్ మహేశ్వరం అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచురల నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి సబితా అనుచరుల నివాసాల్లో భారీగా నగదును సీజ్ చేశారు. మిర్యాలగూడలో రైస్ మిల్లర్ల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా నగదును నిల్వ చేశారన్న సమాచారంతో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఎన్నికల వేళ ఇలా ఐటీ అధికారులు వరుసుగా దాడులు చేయటం కలకలం రేపుతోంది. (ఏజెన్సీలు)