हैदराबाद: माओवादी नेता आरके (RK) की पत्नी शिरिषा को आंध्र प्रदेश पुलिस ने हिरासत में ले लिया है। आंध्र प्रदेश के प्रकाशम जिले के टंगुटुरु मंडल के आलकुरपाडु गांव में मुफ्ती में तीन कारों में आए पुलिस और विशेष बल ने शिरिषा के घर में प्रवेश किया और उसे जबरन अपने साथ ले गए। यह देख परिजनों ने शिरिषा को रोकने की कोशिश की, मगर पुलिस ने उसे वाहन में बिठाया कर ले गये।
इससे पहले एनआईए और अन्य एजेंसियों ने शक के चलते सिरिशा के मकान में कई बार तलाशी ले चुकी हैं। सीपीआई (माओवादी) सेंट्रल कमेटी, पोलित ब्यूरो सदस्य आरके उर्फ अक्कीराजू हरगोपाल की 14 अक्टूबर 2021 को दक्षिण बस्तर में मृत्यु हो गई थी। मालूम हो कि माओवादी पार्टी ने उस समय पुष्टि की थी कि उनकी मौत किडनी फेलियर और अन्य बीमारी के चलते हुई है।
పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే ( RK ) భార్య శిరీషను ఏపీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు మఫ్టీలో మూడు కార్లలో వచ్చిన పోలీసులు, ప్రత్యేక బలగాలు శిరీష ఇంట్లోకి వెళ్లి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుపడిన కుటుంబ సభ్యులను పక్కకునెట్టి ఆమెను పోలీసు వాహనంలో తీసుకెళ్లారు.
ఇప్పటికే పలుమార్లు శిరీష ఇంటిని అనుమానాల కారణంతో ఎన్‌ఐఏ, ఇతర సంస్థలు సోదా చేశాయి. సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ 2021 అక్టోబర్ 14న దక్షిణ బస్తర్‌లో మరణించారు. కిడ్నీ వైఫల్యం, ఇతర వ్యాధులతో మరణించినట్లు మావోయిస్టు పార్టీ అప్పట్లో ధృవీకరించిన విషయం తెలిసిందే.