“తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్ కు ఉంది” [4 News]

ఈసారి 14 ఎంపీ సీట్లు సాధించడం ఖాయం

మోదీ అద్బుత పాలనలో రోడ్లకు అత్యధిక ప్రాధాన్యం

గత 70 ఏళ్లలో తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేశారో….

అంతకుమించిన రోడ్ల పనులు మోదీ హయాంలోనే జరిగాయి

కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్ కు ఉందని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి 1 లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించారని చెప్పారు. గత 70 ఏళ్లలో తెలంగాణలో 2 వేల కి.మీల మేరకు రోడ్లు నిర్మిస్తే… మోదీ 9 ఏళ్ల పాలనలో అంతకుమించి రోడ్ల పనులు ఈ కొనసాగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మోదీ పాలనలో 50 వేల కి.మీల మేరకు రోడ్ల పనుల నిర్మాణం జరుగుతోందన్నారు.

మహజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, దూది శ్రీకాంత్, రావు పద్మ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి హుస్నాబాద్ నియోజకర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామానికి విచ్చేశారు. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ….

• ప్రజా సంగ్రామ యాత్రతో బండి సంజయ్ తెలంగాణలో తిరిగి పార్టీని బలోపేతం చేశారు. తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్ కు ఉందనే నమ్మకం నాకుంది. నితిన్ గడ్కరీ ఎట్లనో బండి సంజయ్ కూడా అట్లనే ఉన్నడు.. పని మొదలు పెడితే పూర్తి చేసి తీరుతారు.

• మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయినందున మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చాను. అందులో భాగంగా ఎల్కతుర్తి –సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించేందుకు సముద్రాలకు వచ్చాను. ఈ రహదారి పనులు పూర్తయితే సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూర్, ఎల్కతుర్తి సహా 14 గ్రామాల ప్రజలకు మేలు ఉపయోగపడుతోంది.

• కాంగ్రెస్ పాలనలో రోడ్లు వేస్తే ఏడాది దాటితే దెబ్బతింటాయి. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి జాతీయ రహదారుల పనులు చేపట్టారు. 5 ఏళ్ల పాటు రోడ్లు దెబ్బతిన్నా కాంట్రాక్టర్ భరించేలా నిబంధన విధించారు. మోదీ పాలనలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపడుతున్నారు.

• కేసీఆర్ పాలనలో రోడ్ తక్కువ అవినీతి ఎక్కువ. 1948లో నిజాం పాలన నుండి తెలంగాణకు విముక్తి లభించింది. 2 వేల 500 కిలోమీటర్లు మాత్రమే రోడ్ల పనులు జరిగితే మోదీ హయాంలో 9 ఏళ్లలోనే అంతకుమించి రోడ్ల పనులు జరిగాయి.

• మోదీ సర్కార్ పనులు అద్భుతంగా ఉన్నాయి. అవినీతి లేదు. మోదీ కేబినెట్ లో ఒక్క మంత్రిపై కూడా అవినీతి మచ్చ లేదు. లక్షా 9 వేల కోట్ల రూపాయలు తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఖర్చు చేసింది. 9 ఏళ్లలో 50 వేల కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల పనులు చేపట్టారు.

• నేను ఉమ్మడి ఏపీ రాష్ట్ర ఇంఛార్జీగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం మేం పోరాడినం. రాజ్యసభలో నేను కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాను. అందరం పోరాడినందునే తెలంగాణ వచ్చింది. కానీ 9 ఏళ్లలో తెలంగాణ అవినీతిమయమైంది. కుటుంబ పాలన కొనసాగుతోంది. మళ్లీ ఎన్నికల తరువాత ఇక్కడికి వస్తా. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారనే నమ్మకం నాకుంది.

• ఇక్కడికి రోడ్ల పనులు ఎట్లా జరుగుతున్నాయనే అంశాన్ని ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఇక్కడికి వచ్చాను. ముగ్గురు జిల్లా అధ్యక్షులు, స్థానిక నేతలు ఇక్కడికి వచ్చారు.

• మస్కట్ నుండి వచ్చిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల కోసం రూ.14 వేలు ఖర్చు పెట్టారని చెప్పారు. మరి మీరెంత ఖర్చు చేశారు. మీ అందరికీ మోదీ ఫ్రీగా వ్యాక్సిన్ డోసులను అందించారు. మూడేళ్లపాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్న ఘనత మోదీదే. పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లు ఇచ్చింది. మరుగుదొడ్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది కేంద్రమే.

ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరూ 8919847687 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీకి మద్దతు తెలపాలని కోరుతున్నా. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయం.

తెలంగాణలో రోడ్ల కోసం 9 ఏళ్లలో 1 లక్షా 9 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం

-గత 4 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రోడ్ల కోసం 4 వేల కోట్లకుపైగా తీసుకొచ్చా

-వివిధ అభివ్రుద్ధి పనుల కోసం రూ.7వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా

-ఎల్కతుర్తి-సిద్దిపేట వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 578 కోట్లు మంజూరు

-15 శాతం పనులు పూర్తయ్యాయి

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

ప్రకాశ్ జవదేకర్ తో కలిసి ఎల్కతుర్తి-సిద్దిపేట విస్తరణ పనుల పరిశీలన

హైదరాబాద్: గత 9 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం 1 లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గత 4 ఏళ్లలోనే 7 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. అందులో రోడ్ల నిర్మాణం కోసమే రూ.4 వేల కోట్లకుపైగా నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.

‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, శ్రీకాంత్, రావు పద్మ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లతో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామానికి వచ్చారు. ‘‘ఎల్కతుర్తి- సిద్దిపేట ‘‘ జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. ముఖ్యాంశాలు..

• నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సాధించిన విజయాలు, అభివ్రుద్ధి, సంక్షేమ పనులను ప్రజలకు వివరించేందుకు మహజన్ సంపర్క్ అభియాన్ ముఖ్య ఉద్దేశం. సమాజాన్ని ప్రభావితం చేసే ప్రముఖులను కలవడం, కేంద్ర నిధులతో జరుగుతున్న అభివ్రుద్ధి పనులను పరిశీలించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

• మీరు ఎంపీగా గెలిపించారు కాబట్టే నేను ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడినయ్యాను. మీరు నన్ను ఎంపీగా గెలిపించాక ఎల్కతుర్తి-సిద్దిపేట వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 578 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ విషయంలో గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి వారి సహకారంతో ఈ నిధులను మంజూరు చేయించాను. పనులు కొనసాగుతున్నాయి. 15 శాతం పనులు పూర్తయ్యాయి. 2024లోపు పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీనివల్ల 14 గ్రామాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది.

• ఈ 9 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారి పనుల కోసం లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసింది. నేను ఎంపీ అయినప్పటి నుండి నేటి వరకు 4 ఏళ్లలో రూ.7 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. రోడ్ల కోసమే 4 వేల కోట్లకుపైగా తీసుకొచ్చిన. కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణం కోసం రూ.వంద కోట్లు మంజూరు చేయించినా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ఆ పనుల్లో జాప్యం జరుగుతోంది.

9 ఏళ్లలో మోదీ గారు సాధించిన విజయాలు

• పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకు గ్రామాల్లో ప్రజలకు అవసరమైనవన్నీ మోదీ ప్రభుత్వం సమకూరుస్తోంది. టాయిలెట్స్, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 5 కిలోలో ఉచిత బియ్యం, కరెంట్, ఉపాధి హామీ, గ్రామీణ సడక్ యోజన రోడ్లు, రైతు వేదిక, పల్లె ప్రక్రుతి వనం, హరిత హారం, వైకుంఠధామం నిర్మాణాలకు నిధులిస్తోంది మోదీ ప్రభుత్వమే.

• ఆర్దిక సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు ఆత్మనిర్బర్ భారత్ పేరిట 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి రైతు అకౌంట్లో 6 వేల రూపాయల చొప్పున దేశమంతా లక్ష కోట్ల రూపాయల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేశారు.. ఇవిగాకుండా సబ్సిడీ ఎరువులు అందిస్తూ ఒక్కో ఎకరానికి 28 వేల రూపాయల ప్రయోజనం కలిగిస్తోంది..

• రైతులకు మద్దతు ధరను పెంచింది. ముద్ర రుణాలు, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలను అమలు చేస్తోంది. మోదీ హయాంలో 5వ స్థానానికి చేరిన భారత్ ను తిరుగులేని శక్తిగా ఎదుగుతూ 2047 నాటికి నెంబర్ వన్ గా మార్చేందుకు క్రుషి చేస్తున్నారు.

సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు

ప్రకాశ్ జవదేకర్ దైవ భక్తి ఉన్న నాయకుడు

చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదు

73 ఏళ్ల వ్యక్తిపై ఇంత దుర్మార్గపు ప్రచారమా?

సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు చేస్తున్న దుష్ప్రచారమిది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి

హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల ప్రకాశ్ జవదేకర్ దైవ భక్తుడు. చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదు…చెప్పులు విడిచి సాక్సులతో ఆలయంలోకి వెళ్లారు. నేను వారితోనే ఉన్నా.’’అని స్పష్టం చేశారు.

• సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు చేసే ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అయ్యగారిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

• ఈరోజు కరీంనగర్ లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించడానికి ని టవర్ సర్కిల్ వద్దకు వచ్చిన బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్న ప్రస్తావించగా పైవిధంగా బదులిచ్చారు. ప్రకాశ్ జవదేకర్ వయసు 73 ఏండ్ల పెద్దాయన. నడుస్తుంటే జారి కింద పడబోతే పట్టుకున్నా… దానిని కూడా ఫాల్తుగాళ్లు రాద్దాంతం చేస్తారా? అంటూ మండిపడ్డారు.

అభివ్రుద్ది పనులపై ప్రజలకు అనుమానాలున్నాయి

వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది

ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలా?

కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు

బీజేపీ కార్పొరేటర్లపై వివక్ష చూపిస్తున్నారు

ప్రజలు ఓట్లేసి గెలిపించారనే విషయాన్ని మర్చిపోతున్నారా?

ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు

బండి సంజయ్ కుమార్ ఆగ్రహం

టవర్ సర్కిల్ వద్ద స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించిన బండి సంజయ్

సమస్యలను ఏకరవు పెట్టిన ప్రజలు

పనుల నాణ్యతపైనా ఫిర్యాదులు

అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై అసంత్రుప్తి వ్యక్తం చేసిన బండి సంజయ్

తీరు మార్చుకోవాలని హితవు

హైదరాబాద్ ‘‘రాజకీయ విమర్శలు- ప్రతి విమర్శలకు తావులేకుండా కరీంనగర్ ను సమగ్రంగా అభివ్రుద్ధి చేయాలనే ఉద్దేశంతో మేం సహకరిస్తుంటే…మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలా? అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు నిస్వార్ధంగా పనిచేస్తేనే అభివ్రుద్ధి సాధ్యమవుతుందనే విషయాన్న గుర్తుంచుకుని వ్యవహరించాలి. అభివ్రుద్ది పనుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మహజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని టవర్ సర్కిల్ వద్ద వికాస్ తీర్థ స్కీం కింద జరుగుతున్నస్మార్ట్ సిటీ పనులను పరిశీలించారు.

• ఈ సందర్భంగా ప్రజలు పలు ఫిర్యాదులు చేశారు. లైట్లు వెలగడం లేదని, వర్షం వస్తే నీళ్లు నిల్వ ఉండిపోతున్నాయని, డ్రైనేజీ పొంగుతోందని వాపోయారు. పనులు సరిగా జరగడం లేదని, నాణ్యత లేదని పేర్కొన్నారు. దీంతో అక్కడే ఉన్న అధికారులను పిలిచి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం, నాణ్యత లోపించడం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలు- ప్రతి విమర్శలకు తావులేకుండా కరీంనగర్ ను అభివ్రుద్ధి చేయాలనే ఉద్దేశంతో మేం సహకరిస్తుంటే…మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా?’’అని పేర్కొన్నారు.

• అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు నిస్వార్ధంగా పనిచేస్తేనే అభివ్రుద్ధి సాధ్యమవుతుందనే విషయాన్న గుర్తుంచుకుని వ్యవహరించాలని సూచించారు. అభివ్రుద్ది పనుల విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని, వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

• ‘‘రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ కార్పొరేటర్ల విషయంలో వివక్ష చూపుతోంది. నిధులివ్వడం లేదు. చాలా మంది అధికారులు కష్టపడి చేస్తున్నారు. కానీ కొందరు అధికారుల తీరు సరిగా లేదు. బీజేపీ కార్పోరేటర్లు ప్రజా పనుల కోసం వెళ్తే పట్టించుకోరు. ఏం తప్పు చేశారు వాళ్లు? ప్రజలు గెలిపిస్తేనే కదా కార్పొరేటర్లు అయ్యింది? ఎవరికి వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? నేను ఇప్పటికే ఈ విషయంపై కలెక్టర్ సహా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లిన. మరోసారి ఇట్లా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అంటూ మండిపడ్డారు.

• అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే మేధావులను కలవడం, కేంద్ర అభివ్రుద్ది పనులను పరిశీలించడం, వివిధ మోర్చాలతో సమావేశం నిర్వహించడం, మోదీ 9 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మహజన్ సంపర్క్ అభియాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. అందులో భాగంగానే ఈరోజు టవర్ సర్కిల్ లో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న అభివ్రుద్ధి పనులను పర్యవేక్షించడానికి ఇక్కడికి వచ్చి పనులను పరిశీలించినట్లు చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల అభివ్రుద్ధికి కేంద్రం నిధులిస్తోందన్నారు. అందులో భాగంగానే కరీంనగర్, వరంగల్ నగరాలను స్మార్ట్ సిటీ పథకం కింద నిధులిస్తోందన్నారు. పనులు నాణ్యతతో చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు అనేక అనుమానాలున్నాయని, వాటిని నివ్రుత్తి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X