-పంటలకు కనీస మద్దతు ధర పెంపుపట్ల హర్షం
-వడ్లకు క్వింటాల్ కు రూ.143లు పెంపుతో రైతులకు మేలు జరుగుతుంది
-పత్తి, పల్లి, పెసర్లు, మినుములు, కందుల కనీస ధరను పెంపు సంతోషం
-యూపీఏతో పోలిస్తే పంటల కనీస ధరను రెట్టింపు చేయడమే బీజేపీ లక్ష్యం
హైదరాబాద్: పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. శ్రీ నరేంద్ర మోదీగారి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి రుజువైంది. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే పంటలకు రెట్టింపు ధర అందించడమే బీజేపీ లక్ష్యం. ఆ దిశగా ఈరోజు కేంద్ర కేబినెట్ అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.
• వరి క్వింటాల్‌కు 143 రూపాయలు పెంచడంవల్ల తెలంగాణ రైతాంగానికి ఎంతగానో మేలు జరుగుతుంది. యూపీఏ హయాంలో సాధారణ రకం వడ్ల ధర క్వింటాలుకు రూ.1,360లు ఉంటే… తాజాగా రూ.2,183లకు చేరుకుంది. అంటే గతంలో పోలిస్తే వడ్లకు కనీస మద్దతు ధర రూ.823లు పెరిగింది.
• గతంలో ఎన్నడూ లేని విధంగా పత్తి పంటకు రూ.540 నుండి రూ.640 వరకు, పల్లీలకు రూ.527, పెసర్లకు రూ.803, నువ్వులకు రూ.805, కందులకు రూ.400లు, మినములకు రూ.350లు ధర పెంచడం సంతోషం. పెసర్ల కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. క్వింటాల్ కనీస మద్దతు ధర రూ. 8,558గా నిర్ణయించడం హర్షణీయం.