Order-Order : तेलंगाना उच्च न्यायालय ने आरोपी चिरंजीवी की मौत के मामले को संज्ञान में स्वीकार कर लिया

हैदराबाद : तुकारामगेट पुलिस की हिरासत में आरोपी चिरंजीवी की मौत पर तेलंगाना हाईकोर्ट ने कड़ा कदम उठाया है। अदालत ने चिरंजीवी की संदिग्ध हिरासत में मौत को सुमोटो (संज्ञान) के रूप में स्वीकार किया। समाचार पत्रों में खबरों के आधार पर इस मामले को सुमोटो के रूप में स्वीकार कया। मुख्य सचिव, डीजीपी, सीपी, उत्तर क्षेत्र डीसीपी, गोपालपुरम एसीपी और तुकारामगेट एसएचओ को प्रतिवादियों के रूप में शामिल किया गया है।

हाल ही में शहर के सैदाबाद सिंगरेनी कॉलोनी के चिरंजीवी को मंगलवार (25 अप्रैल) शाम को पुलिस ने चोरी के एक मामले में गिरफ्तार कर लिया और तुकारामगेट पुलिस स्टेशन ले गई। मामले की जांच के दौरान आरोपी बेहोश हो गया। अस्पताल ले जाते समय उसकी मौत हो गई।

हालांकि, चिरंजीवी के परिवार के सदस्यों ने बुधवार (26 अप्रैल) को गांधी अस्पताल के सामने विरोध प्रदर्शन किया और दावा किया कि पुलिस ने उन्हें पीट-पीट कर मार डाला। आरोप है कि आरोपी को कोई चिकित्सीय समस्या नहीं थी और पुलिस की पिटाई के बाद उसकी मौत हो गई। उच्च न्यायालय ने समाचार पत्रों में प्रकाशित खबरों के आधार पर सुमोटो के रूप में मामले को स्वीकार कर लिया।

నిందితుడు చిరంజీవి మృతి కేసును సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్ : తుకారాంగేట్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు చిరంజీవి మృతిపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. చిరంజీవి అనుమానాస్పద కస్టోడియల్ మృతిని న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీపీ, నార్త్‌ జోన్ డీసీపీ, గోపాలపురం ఏసీపీ, తుకారాంగేట్ ఎస్‌హెచ్‌ఓలను చేర్చింది. 

ఇటీవల ఓ చోరీ కేసులో నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీకి చెందిన చిరంజీవిని పోలీసులు మంగళవారం (ఏప్రిల్ 25న) సాయంత్రం అరెస్ట్‌ చేసి తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈ కేసుపై విచారిస్తుండగా నిందితుడు కుప్పకూలాడు. ఆస్పత్రి తరలిస్తుండగా చనిపోయాడు.

అయితే పోలీసులే కొట్టి చంపారంటూ చిరంజీవి కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రి ఎదుట బుధవారం (ఏప్రిల్ 26న) ఆందోళనకు దిగారు. నిందితుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. దీనిపై వార్తా పత్రికల్లోనూ కథనాలు ప్రచురితమవ్వడంతో వాటి ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar