హైదరాబాద్ : భారత రత్న డా. బి. ఆర్. అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శుక్రవారం డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి; రిజిస్ట్రార్ డా.ఎ.వి.ఎన్ రెడ్డి; విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డా.బానోత్ లాల్; సికా డైరెక్టర్ ప్రో. పి. మధుసూదన్ రెడ్డి, డీన్ ప్రో. పుష్పా చక్రపాణి, ఈ.ఎం.ఆర్ & ఆర్.సీ డైరెక్టర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్; విద్యార్ధి సేవల విభాగ డైరెక్టర్ డా.ఎల్వికే రెడ్డి;
డా. బానోత్ ధర్మ, పరీక్షల నియంత్రణ అధికారి డా. పరాంకుశం వెంకట రమణ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డా. బి. శ్రీనివాస్, నాయకులు గోపాల కృష్ణ, ఉద్యోగ సంఘ నాయకులు మహేశ్వర్ గౌడ్, శర్మ, పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, ఆయా శాఖల అధిపతులు, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది హాజరయ్యారు.
BRAOU RELEASED Ph.D ADMISSIONS ENTRANCE NOTIFICATION
Hyderabad : Dr.B.R.Ambedkar Open University (BRAOU) has invites application from the eligible candidates for the Admission into Ph.D Programmes in the following departments… English, Hindi, Education, History, Political Science, Public Administration, Sociology, Mathematics, Physics, Chemistry and Environmental Science for the Academic Year 2022-23. Admissions process strictly As Per UGC Regulations -2022.
The registration for Ph.D. Entrance Test is through Online only. The candidates are advised to visit the University portal www.braouonline.in to fill the prescribed application form and register by paying a fee of Rs. 1500/- (Rs.1000/- in case of SC/ST/BC/PwD). The procedure for payment of Registration fee is available in the website. The Entrance Test will be held at Hyderabad only. For further details contact: 040-23680411, 040-23680241. Call Centre : 18005990101
The Date & Time of Ph.D., Entrance Test: 20-05-2023 (from 2:00 P.M. to 5:00 P.M.). The last date for Registration and payment of fee is May 08, 2023.
అంబేద్కర్ వర్సిటీ పి.హెచ్ డి. అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరం కోసం పిహెచ్.డి అర్హత పరీక్ష కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్, హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ విభాగాల్లో పిహెచ్.డి కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తునున్నట్లు తెలిపారు. UGC నిబంధనలు -2022 ప్రకారం అడ్మిషన్స్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రిజిస్ట్రార్ డా.ఏ.వి.ఆర్. ఎన్. రెడ్డి పేర్కొన్నారు.
Ph.D ఎంట్రన్స్ కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు విశ్వవిద్యాలయ పోర్టల్ www.braouonline.in లో సంప్రదించాలన్నారు. ఎంట్రన్స్ ఫీజు రూ. 1500/- లు (ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు రూ.1000/- లు మాత్రమే) ఆన్లైన్ లో దరఖాస్తు ఫారం, ఫీజు చెల్లింపు విధానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందన్నారు. ప్రవేశ పరీక్ష హైదరాబాద్‌లో మాత్రమే జరుగుతుంది. పూర్తి వివరాల కోసం 040-23680411, 040-23680241, కాల్ సెంటర్ : 1800 599 0101 నెంబర్లలో కార్యాలయ పని వేళల్లో
సంప్రదించొచ్చని సూచించారు.
Ph D ప్రవేశ పరీక్ష తేదీ & సమయం : 20-05-2023 (మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు). రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ మే 08, 2023 గా పేర్కొన్నారు. పూర్తి వివరాలను www:braou.ac.in లో పొందొచ్చు.