IPL 2023: ओपनिंग सेरेमनी में तमन्ना और रश्मिका होगी विशेष आकर्षण, अभिनेता बालकृष्ण की मजेदार कमेंट्री

हैदराबाद : गुजरात का अहमदाबाद नरेंद्र मोदी स्टेडियम आईपीएल 2023 (इंडियन प्रीमियर लीग 2023) के उद्घाटन समारोह का आयोजन स्थल बनने जा रहा है। 31 मार्च को शाम छह बजे से शुरू हो रहे आईपीएल के उद्घाटन समारोह में दूधिया सुंदरी तमन्ना विशेष आकर्षण होंगी। इस बात को लेकर आईपीएल आयोजकों ने ट्विटर पर सफाई दी है।

श्रीवल्ली भी आईपीएल सेलिब्रेशन में धमाकेदार परफॉर्मेंस देने वाली हैं। आईपीएल की ओपनिंग सेरेमनी में रश्मिका मंधाना भी धमाल मचाएंगी। रश्मिका, जो फिल्म पुष्पा के साथ एक पैन इंडिया हीरोइन बनीं, के आईपीएल उद्घाटन समारोह में उसी फिल्म के गाने पर डांस करने की संभावना है।

आईपीएल 2023 में नंदमुरी नटसिम्हा बालकृष्ण भी धमाल मचाने वाले हैं। नायक के रूप में पहले से ही मनोरंजन कर रहे बालकृष्ण ने एक टॉक शो में एक मेजबान के रूप में दर्शकों को प्रभावित किया। फिलहाल वह क्रिकेट प्रशंसकों का मनोरंजन करने के लिए कमेंटेटर का अवतार लेंगे। स्टार स्पोर्ट्स ने पहले ही घोषणा कर दी है कि बालकृष्ण इंडियन प्रीमियर लीग में कमेंट्री करेंगे। बालकृष्ण की कमेंट्री 31 मार्च से शुरू हो रहे आईपीएल के पहले दिन होगी।

IPL 2023 : ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో తమన్నా రష్మిక

హైదరాబాద్ : ఐపీఎల్ 2023 (Indian Premier League 2023) ప్రారంభ వేడుకులకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కాబోతుంది. మార్చి 31 సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల్లో మిల్కీ బ్యూటి తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ఈ మేరకు ఐపీఎల్‌ నిర్వాహకులు ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.

శ్రీవల్లి కూడా ఐపీఎల్ వేడుకల్లో హాట్ ఫర్ఫామెన్స్ ఇవ్వబోతుంది. అదేనండి రష్మిక మంధాన (Rashmika Mandhana) కూడా ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో సందడి చేయనుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో అదే సినిమాలోని సాంగ్స్ కు డ్యాన్స్ చేసే అవకాశం ఉంది. 

బాలయ్య కామెంటరీ

ఐపీఎల్ 2023లో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా సందడి చేయబోతున్నారు. ఇప్పటికే హీరో గా అలరిస్తున్న బాలకృష్ణ ఓ టాక్ షోలో హోస్టుగా సత్తా చాటి ప్రేక్షకులతో మెప్పి్ంచారు. ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు కామెంటేటర్ గా అవతారం ఎత్తనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాలకృష్ణ కామెంటరీతో అదరగొట్టనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే ప్రకటించింది. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఓపెనింగ్ రోజున బాలకృష్ణ కామెంటరీ ఉంటుందని పేర్కొంది. 

రెండేళ్ల తర్వాత

కరోనా కారణంగా రెండేళ్ల పాటు టీమ్స్ సొంత గ్రౌండ్స్ తో పాటు ఇతర వేదికల్లో మ్యాచ్లు నిర్వహించలేదు. అయితే ఈ సారి ఐపీఎల్ ఫ్రాంచైజీలోని సొంత మైదానంతో పాటు ప్రత్యర్థి మైదానంలోనూ మ్యాచులు జరగనున్నాయి. మార్చ్‌ 31 నుంచి ఐపీఎల్‌ 16 స్టార్ట్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీసీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ సారి ఓపెనింగ్‌ సెర్మనీ గ్రాండ్‌గా నిర్వహించున్నాయి. ఈ ఓపెనింగ్ సెర్మనీలో తమన్నా, రష్మికతో పాటు మరికొందరు బాలీవుడ్ యాక్టర్లు పాల్గొనబోతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X