हैदराबाद: जीएचएमसी में फर्जी जन्म और मृत्यु प्रमाण पत्र का मामला सामने आया है। बिना उचित दस्तावेजों के 31 हजार प्रमाण पत्र जीएचएमसी जन्म और मृत्यु प्रमाणन विभाग ने जारी कर दिए। ऐसा लगता है कि कंप्यूटर ऑपरेटरों, AMCA, MOH और प्रधान कार्यालय के प्रमुख अधिकारियों ने इस अभियान में महत्वपूर्ण भूमिका निभाई। कमिश्नर ने विजिलेंस जांच के आदेश दिए हैं। हालांकि ऐसा लग रहा है कि कुछ कर्मचारियों ने फर्जी सर्टिफिकेट जमा कर पैसे लेकर सर्टिफिकेट दे दिए हैं। कर्मचारियों का आरोप है कि इन हालातों की वजह इस विभाग के मुखिया अधिकारी की समझ की कमी है। जीएचएमसी के आला अधिकारी इस बात पर माथापच्ची कर रहे हैं कि इस स्थिति से कैसे निपटा जाए।
मार्च 2020 से दिसंबर 2022 तक 27,328 जन्म प्रमाण पत्र अनुपलब्धता के तहत जारी किए गए। 4,126 मृत्यु प्रमाण पत्र जारी किए गए। इसमें से सबसे मेहदीपट्टनम सर्कल में 5877, चारमीनार सर्कल में 3949, बेगमपेट सर्कल में 2821 और सिकंदराबाद सर्कल में 1758 जन्म प्रमाण पत्र जारी किए गए। मृत्यु प्रमाण पत्र सबसे ज्यादा 409 बेगमपेट सर्कल में, 329 गोशामहल सर्कल में, चारमीनार, फलकनुमा, राजेंद्र नगर, मेहदीपटनम और कारवान सर्कल में 220 से 240 जारी किये गये हैं।
उल्लेखनीय है कि कुछ अधिकारियों ने संबंधित दस्तावेजों की अनुपलब्धता के स्थान पर केवल सफेद पेपर दाखिल किये जाने पर भी प्रमाण पत्र जारी कर दिया है। पाया गया है कि कुल 10,276 जन्म प्रमाण पत्र और 1218 मृत्यु प्रमाण पत्र जारी किए गए हैं। जन्म प्रमाणपत्र बेगमपेट सर्कल में सबसे अधिक 2787, सिकंदराबाद सर्कल में 1702, चारमीनार सर्कल में 1465, मेहदीपट्टनम सर्कल में 1256 और फलकनुमा सर्कल में 1146 प्रमाण पत्र जारी किए गए। सफेद पेपर लेकर प्रमाणपत्र जारी करने वालों में बेगमपेट 369 के साथ पहले, सिकंदराबाद 159 के साथ दूसरे और गोशामहल 124 के साथ तीसरे स्थान पर है।
हालांकि, राजस्व मंडल अधिकारी ने बिना किसी कार्यवाही के 21,745 जन्म प्रमाण पत्र और 2824 मृत्यु प्रमाण पत्र जारी कर दिए। ऐसा लगता है कि महदीपट्टनम में 4030, चारमीनार में 3897 और बेगमपेट में 2787 जन्म प्रमाण पत्र जारी किए गए हैं। साथ ही, बेगमपेट में 369, गोशामहल में 329 और राजेंद्रनगर में 217 मृत्यु प्रमाण पत्र जारी किए गए।
इतना ही नहीं बिना किसी दस्तावेज को अटैच किए सीधे सर्टिफिकेट लेने के भी रिकॉर्ड हैं। इसमें कुल 8226 जन्म प्रमाण पत्र और 1386 मृत्यु प्रमाण पत्र लिए गए। बेगमपेट में 2787, सिकंदराबाद में 1702 और मेहदीपट्टनम में 1286 ने बिना किसी दस्तावेज के जन्म प्रमाण पत्र लिये गये हैं। बेगमपेट में सबसे ज्यादा मौतें बेगमपेट में 369 और गोशामहल में 205 प्रमाणपत्र लिये गये हैं।
साथ ही जन्म और मृत्यु आवश्यक दस्तावेजों के अलावा असंबद्ध दस्तावेजों को जोड़कर 6820 जन्म प्रमाण पत्र व 906 मृत्यु प्रमाणपत्र जारी किए गए। जन्म के संबंध में सबसे अधिक बेगमपेट में 2787, सिकंदराबाद में 1702 तथा चारमीनार में 1293 जारी किए गए। साथ ही, बेगमपेट में 369, चारमीनार में 181 और सिकंदराबाद सर्कल में 159 मृत्यु प्रमाण पत्र जारी किए गए।
జీహెచ్ఎంసీలో భారీగా నకిలీ 31 వేల బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు రద్దు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూసింది. సరైన పత్రాలు లేకుండానే 31 వేల సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ జనన, మరణ ధ్రువీకరణ విభాగం జారీ చేసినట్టు బయటపడింది. ఈ బాగోతంలో కంప్యూటర్ ఆపరేటర్లు, ఏఎంసీఏ, ఎంఓహెచ్, ప్రధాన కార్యాలయంలోని కీలక అధికారులు కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశించారు. అయితే.. తప్పుడు ధ్రుపత్రాలను సబ్మిట్ చేసి కొంత మంది ఇంటి దొంగలే.. డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇప్పించినట్టు తెలుస్తోంది. ఈ విభాగానికి చీఫ్‌గా వ్యవహరించే అధికారికి అవగాహన లోపమే ఈ పరిస్థితులకు కారణం అంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి నుండి ఎలా గట్టెక్కాలనే విషయంపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు.
2020 మార్చి నుంచి డిసెంబర్ 2022 వరకు నాన్ అవేలెబిలిటీ కింద 27,328 బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశారు. 4,126 డెత్ సర్టిఫికేట్స్ జారీ చేశారు. ఇందులో అత్యధికంగా మెహదిపట్నం సర్కిల్‌లో 5877, చార్మినార్ సర్కిల్‌లో 3949, బేగంపేట్ సర్కిల్ పరిధిలో 2821, సికింద్రాబాద్ సర్కిల్‌లో 1758 బర్త్ సర్టిఫికేట్స్ జారీ చేశారు. డెత్ సర్టిఫికేట్స్.. బేగంపేట్ సర్కిల్‌లో అత్యధికంగా 409, గోషామహల్ సర్కిల్‌లో 329, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్ర నగర్, మెహదీపట్నం, కార్వాన్ సర్కిళ్లలో 220 నుంచి 240 సర్టిఫికేట్స్ జారీ చేసినట్టు తేలింది.
నాన్ అవేలెబిలిటీలో సంబంధిత పత్రాలకు బదులు తెల్ల కాగితాలు పెట్టినా కొంతమంది అధికారులు సర్టిఫికేట్స్ జారీ చేయటం గమనార్హం. ఇందులో బర్త్‌కు సంబందించి మొత్తం 10,276.. అలాగే డెత్‌కు సంబంధించి 1218 సర్టిఫికేట్స్ జారి చేసినట్టు తేలింది. ఇలాంటివి బర్త్‌కు సంబంధించి బేగంపేట్ సర్కిల్‌లో అత్యధికంగా 2787, సికింద్రబాద్ పరిధిలో 1702, చార్మినార్ పరిధిలో 1465, మెహదిపట్నం పరిధిలో 1256, ఫలక్ నుమా సర్కిల్‌లో 1146 సర్టిఫికేట్స్ జారీ చేశారు. తెల్ల కాగితాలు పెట్టి నాన్ అవేలబులిటీ కింద డెత్ సర్టిఫికేట్స్ తీసుకున్న సర్కిల్‌లలో 369 తో బేగంపేట్ ఫస్ట్, 159 తోసికింద్రాబాద్ సెకండ్, 124తో గోషామహల్ మూడో ప్లేస్‌లో ఉన్నాయి.
అయితే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రొసీడింగ్స్ లేకుండా బర్త్‌లో 21,745, డెత్‌లో 2824 సర్టిఫికేట్స్ జారీ చేశారు. ఇందులో బర్త్‌కు సంబంధించి మెహదీపట్నంలో 4030, చార్మినార్‌లో 3897, బేగంపేట్‌లో 2787 సర్టిఫికేట్స్ జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే డెత్‌కు సంబంధించి బేగంపేట్‌లో 369, గోషషామహల్‌లో 329, రాజేంద్రనగర్‌లో 217 డెత్ సర్టిఫికేట్స్ జారీ చేశారు.
ఇవే కాకుండా ఎలాంటి పత్రాలు జత చేయకుండా డైరెక్టుగా సర్టిఫికేట్స్ తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇందులో బర్త్‌కు సంబంధించి మొత్తం 8226, డెత్‌కు సంబంధించి మొత్తం 1386 సర్టిఫికేట్స్ తీసుకున్నారు. బేగంపేట్‌లో 2787, సికింద్రాబాద్‌లో 1702, మెహదీపట్నంలో 1286 ఎలాంటి పత్రాలు లేకుండా బర్త్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. డెత్‌కు సంబంధించి బేగంపేట్‌లో 369 బేగంపేట్‌లో, 205 గోషషామహల్‌లో అత్యధికంగా తీసుకున్నారు.
అలాగే బర్త్ అండ్ డెత్‌కు సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ కాకుండా సంబంధం లేని పత్రాలను జత చేసి బర్త్‌లో 6820, డెత్‌లో 906 సర్టిఫికేట్స్ జారీ అయ్యాయి. బర్త్‌కు సంబందించి అత్యదికంగా బేగంపేట్ లో 2787, సికింద్రాబాద్ లో 1702, చార్మినార్ లో 1293 జారీ అయ్యాయి. అలాగే డెత్ కు సంబందించి బేగంపేట్ లో 369, చార్మినార్ లో 181, సికింద్రాబాద్ సర్కిల్ లో 159 సర్టిఫికేట్స్ జారీ అయినట్టు తేలింది. (ఏజెన్సీలు)