మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్
హైదరాబాద్ “ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టింది. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం. ప్రజా దర్బార్ నిర్వహించడానికే ప్రగతి భవన్ ఉండాల. గతంలో చంద్రబాబు, వైఎస్ ప్రజలను కలవలేదా? ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకు? అవసరమైతే ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత మేం తీసుకుంటాం.
నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్న కేసీఆర్ ను ఎలా సమర్దించారు? ఇప్పుడు నేను మాట్లాడితే ఎందుకు తప్పుపడుతున్నారు? తెలంగాణ ద్రోహులకు, తన బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా? తెలంగాణ ప్రజల ఆలోచననే నేను చెప్పా. నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మా యాత్ర. మేం గాంధీ వారసులం.. హింసకు వ్యతిరేకం.
శాంతి కోసమే ఈ యాత్ర. తెలంగాణ వచ్చాక ఎన్కౌంటర్ లు ఉండవని కేసీఆర్ చెప్పాడు. రాష్ట్రం వచ్చాక జరిగిన ఎంకౌంటర్లకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు? 9నెలల్లో ప్రగతి భవన్, 12 నెలల్లో సచివాలయం కట్టారు. కానీ 9 ఏళ్లలో అమరుల స్థూపం కట్టలేకపోయారు. వృథా ఖర్చులు తగ్గిస్తే రాష్ట్రం మిగులు బడ్జెట్ లోకి వెళుతుంది. ఇదుపూసలపల్లి నుంచి మహబూబాబాద్ వెళ్లే దారిలో స్కూల్ బస్ లో వెళుతున్న చిన్నారులను పలకరించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగారు.”
మరోవైపు మహాబాబాబాద్ డిపో వద్ద తమ సమస్యలపై రేవంత్ రెడ్డి గారికి వినతిపత్రం అందించిన ఆర్టీసీ కార్మికులు. 48వేల మంది కార్మికులం కాంగ్రెస్ కు అండగా ఉంటామన్న కార్మికులు. బేసిక్ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించేలా చూడాలని కోరిన కార్మికులు. మహిళా కండక్టర్లు అని చూడకుండా ఓటీలు చేయిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మహబూబాబాద్ డిపోకు చెందిన శ్రీలత అనే కండక్టర్.
టీపీసీసీ అధ్యక్షుడి సారథ్యంలో Hath Se Hath Jodo Abhiyan padayatra బుధవారం మూడో రోజు కొనసాగుతోంది.