हैदराबाद : मेदक जिले के चेगुंटा मंडल के चिन्नाशिवनूर गांव में दर्दनाक हादसा हो गया। घर में गैस सिलेंडर फट गया और दो की मौत हो गई। मरने वालों में एक छह साल की बच्ची भी शामिल है।
पुलिस के मुताबिक, गांव की रहने वाली अंजम्मा (56) अपने दो बेटों के साथ हैदराबाद में रहती है। वे शहर में रोजगार पाते हुए अपने गृहनगर आते-जाते रहती थी।
इस बीच, अंजम्मा अपनी पोती मुधु (6) के साथ पेंशन के पैसे और राशन का चावल लेने के लिए मंगलवार को गांव आई थी। इसी क्रम में रात को वह अपनी पोती मधु के साथ अपने घर में सो गई। देर रात अंजम्मा के घर में गैस सिलेंडर भयानक आवाज के साथ फट गया।
यह देख ग्रामीणों ने दमकल विभाग के अधिकारियों को सूचना दी। जब तक दमकल कर्मियों ने आग पर काबू पाया, तब तक अंजम्मा और मधु जिंदा जल चुके थे। पुलिस ने मामला दर्ज कर लिया है और घटना की जांच कर रही है।
హైదరాబాద్ : మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన అంజమ్మ (56) తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. నగరంలోనే ఉపాధి పొందుతూ అప్పుడుప్పుడూ స్వగ్రామానికి వచ్చి వెళుతుండేవారు.
ఈ క్రమంలో అంజమ్మ తన పెన్షన్ డబ్బులు, రేషన్ బియ్యం తీసుకునేందుకు గాను మనవరాలు ముధు (6)తో కలిసి మంగళవారం గ్రామానికి వచ్చింది. అనంతరం రాత్రి తన ఇంట్లో మనవరాలు మధుతో కలిసి నిద్రించింది.
అర్థరాత్రి అంజమ్మ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలి పోయింది. అప్రమత్తమైన గ్రామస్థులు అగ్ని మాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురాగా.. అప్పటికే అంజమ్మ, మధు సజీవదహనమయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. (ఏజెన్సీలు)