हैदराबाद: मलकपेट के सोहेल होटल में आग लगने से एक व्यक्ति की मौत हो गई। शुक्रवार शाम को होटल के किचन में आग लग गई और घना धुआं फैल गया। उस समय होटल स्टाफ और ग्राहक मौजूद थे, वे तुरंत सतर्क हो गए और बाहर निकल गये। पार्सल सर्विस काउंटर पर काम कर रहे शबुद्दीन (36) की धुएं के कारण दम घुटने से मौत हो गई। कुछ लोग अस्वस्थ हो गए।
सोहेल होटल के बगल में स्थित मलकपेट सरकारी अस्पताल के धुएं के घने रूप में फैल जाने के कारण मरीज परेशान हो गए। आग को फैलते देख कर्मचारियों ने मरीजों को दूसरे ब्लॉक में स्थानांतरित कर दिया। सूचना मिलते हीर दमकल की गाड़ी मौके पर पहुंची और आग पर काबू पाया।
जिला अग्निशमन अधिकारी श्रीनिवास रेड्डी ने कहा कि हादसा शार्ट सर्किट या गैस रिसाव के कारण हुआ, इसकी जांच की जा रही है। मलकपेट विधायक अहमद बाला ने दुर्घटनास्थल का निरीक्षण किया। पुलिस ने बताया कि मामला दर्ज कर लिया गया है।
హోటల్ సోహైల్‌లో అగ్ని ప్రమాదం, ఒకరి మృతి
హైదరాబాద్: మలక్‌పేటలోని సోహైల్ హోటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఒకరు మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం హోటల్లోని కిచెన్‌లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ టైంలో ఎక్కువ మంది సిబ్బంది ఉన్నప్పటికీ వెంటనే అప్రమత్తమై బయటికి పరుగులు తీశారు. పార్సిల్ సర్వీస్ కౌంటర్లో పనిచేస్తున్న షాబుద్దీన్(36) పొగ దెబ్బకు ఊపిరి ఆడక మృతి చెందాడు. కొంత మంది అస్వస్థతకు గురయ్యారు.
ఒక్కసారిగా దట్టమై పొగలు వ్యాపించడంతో సోహైల్హోటల్పక్కనే ఉన్న మలక్ పేట గవర్నమెంట్హాస్పిటల్లోని పేషెంట్లు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది అప్రమత్తమైన వేరే బ్లాక్ లోకి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్‌సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీక్ కారణంగానే ప్రమాదం జరిగిందని, విచారణ చేస్తున్నామని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలానికి మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పరిశీలించారు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. (Agencies)