हैदराबाद: दसवीं कक्षा में पढ़ने वाली छात्रा के साथ दो युवकों ने 6 माह तक डरा धमकाकर दुष्कर्म किया। पुलिस जांच में सामने आया कि दोनों आरोपी भाइयों ने लड़की को जबरन घर के अंदर ले गये और एक नहीं तो दूसरा उसके साथ दुष्कर्म किया।
यह मामला वरंगल शहर की 27वीं डिवीजन दयानंद कॉलोनी में प्रकाश में आया है। इससे दोनों समुदायों के बीच गंभीर तनाव पैदा हो गया। यह हैवानियत तब सामने आई जब लड़की के पिता को युवक के व्यवहार पर संदेह हुआ और उसने अपने घर के सामने सीसीटीवी कैमरे लगा दिए। पीड़ित लड़की के पिता की तहरीर पर मिल्स कॉलोनी पुलिस ने मामला दर्ज कर आरोपी को गिरफ्तार कर लिया है।
पता चला है कि पीड़ित लड़की (15) का परिवार किराए के मकान में रह रहा था। उसी घर के पास रहने वाले अजमद अली (26) और अबू (22) ने पिछले 6 महीने से लड़की को डरा धमकाकर उसके साथ दुष्कर्म किया। अपने साथ हो रहे दुष्कर्म के बारे में वह माता-पिता को बताने में असमर्थ रही, क्योंकि आरोपियों ने उसे किसी को बताने पर जान से मारने की धमकी दी थी। इसके चलते वह भयंकर मानसिक पीड़ा का सामना करती रही।
स्थानीय लोगों ने आरोपी के घर पर हमला किया। साथ ही उनके घर के सामने बाइकों को तोड़ दिया। बाद में छात्रा के रिश्तेदारों के साथ वरंगल-नरसमपेट मुख्य मार्ग पर रस्ता रोको किया। उन्होंने आरोपियों को सार्वजनिक फांसी देने की मांग की।
स्थानीय लोगों ने यह भी बताया कि आरोपियों ने इससे पहले भी उसी कॉलोनी में रहने वाली दो अन्य लड़कियों के साथ अभद्र व्यवहार किया। उन्होंने बताया कि दोनों आरोपी उनके मोबाइल पर अश्लील संदेश भेजकर परेशान किया था। एक स्थानीय महिला ने गुस्से का इजहार करते हुए कहा, “दोनों को पेट्रोल डालकर जला देना चाहिए।”
वरंगल एसीपी गिरिकुमार ने कहा कि आरोपियों के खिलाफ कानून के मुताबिक सख्त कार्रवाई की जाएगी। तनाव के मद्देनजर मिल्स कॉलोनी सीआई श्रीनिवास के साथ गिरिकुमार ने कॉलोनी का दौरा किया। दोनों आरोपी छह भाइयों में आखिरी संतान हैं।
పదో తరగతి విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారం
హైదరాబాద్ : పదో తరగతి చదువుతున్న బాలికను బెదిరింపులకు గురి చేసి ఇద్దరు యువకులు 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులైన అన్నదమ్ములిద్దరూ బాలికను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి ఒకరు కాకపోతే, మరొకరు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
వరంగల్ నగరంలోని 27వ డివిజన్ దయానంద్ కాలనీలో ఈ దారునం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. యువకుల ప్రవర్తనపై అనుమానం వచ్చి బాలిక తండ్రి ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
బాధిత బాలిక (15) కుటుంబం అక్కడ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్న అజ్మద్ అలీ (26), అబూ (22) బాలికను ప్రలోభపెట్టి గత 6 నెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనపై జరుగుతున్న దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక, వారి వేధింపులకు తాలలేక ఆ బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది.
బీజేపీ, హిందూ సంఘాలకు చెందిన కొంత మంది నిందితుల ఇంటిపై దాడి చేశారు. వారి ఇంటి ముందున్న బైక్‌లను ధ్వంసం చేశారు. అనంతరం బాలిక బంధువులతో కలిసి వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
అదే కాలనీలో ఉంటున్న మరో ఇద్దరు అమ్మాయిలతోనూ నిందితులు అసభ్యంగా ప్రవర్తించారని స్థానికులు చెబుతున్నారు. వారి సెల్‌ఫోన్లకు అసభ్య మెసేజ్‌లు పంపించి, వేధిస్తున్నారని తెలిపారు. ‘వాళ్లను పెట్రోల్ పోసి తగులబెట్టాలి’ అంటూ స్థానిక మహిళ ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ గిరికుమార్ తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్‌తో కలిసి కాలనీని సందర్శించారు. నిందితులిద్దరూ ఆరుగురు అన్నదమ్ముల్లో చివరివారని తెలుస్తోంది (Agencies)