హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ముందుకు రావడం లేదు. దీంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని వెంకటాపూర్‌లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామానికి చెందిన మాసు శివయ్య అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఇంటి మొత్తానికి వ్యాపించడంతో కుటుంబ సభ్యులతోపాటు మరో వ్యక్తి మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో మాసు శివయ్య (50), ఆయన భార్య పద్మ (45) శివయ్య వదిన కూతురు మౌనిక (35), హిమబిందు (4), స్వీటి (2) శాంతయ్య (52) గా గుర్తించారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని డీసీపీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై 16 టీమలు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదం జరిగిన ఇంటికి కొద్ది దూరంలో పోలీసులు ఖాళీ పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఎవరైనా కావాలనే వీరి ఇంటికి నిప్పు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెట్రోల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.
संबंधित खबर :
ఆరుగురు సజీవ దహనం కేసులో ఘోరమైన విషయాలు బయటకొచ్చాయి. మూకుమ్మడి హత్యలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం కోణంలో ఆధారాలు లభ్యమయ్యాయి. కొన్నాళ్లుగా శివయ్య కుటుంబంతో సింగరేణి కార్మికుడు శాంతయ్య నివాసం ఉంటున్నారు. అనంతరం శాంతయ్య కుటుంబ సభ్యులతో శివయ్య కుటుంబానికి విభేదాలు తలెత్తాయి. పోలీసుల దర్యాప్తులో సంఘటనాస్థలి సమీపంలో అనుమానాస్పదంగా ఆటో, రెండు పెట్రోల్ క్యాన్‌లు లభ్యమయ్యాయి. స్థానికుల ఇచ్చిన సమాచారంతో శాంతయ్య కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
हैदराबाद: मंचेरिलायल जिले में मारे गये शवों का अंतिम संस्कार करने के लिए परिजन आगे नहीं आये हैं। इसके चलते उनका अंतिम संस्कार ग्राम पंचायत की करने की तैयारी की जा रही है।