Hyderabad:
BREAKING
14వ రోజు దిగ్విజయంగా ముగిసిన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”
ఈరోజు 14 కిలోమీటర్ల మేర కొనసాగిన పాదయాత్ర
ఇవాళ జగిత్యాల జిల్లా చల్ గల్ గ్రామంలో బండి సంజయ్ రాత్రి బస
BREAKING
“ఆకాశాన్నంటిన అభిమానం”
అడుగడుగునా స్వాగతాల వెల్లువ
ఎక్కడికెళ్లినా.. పూలవర్షం కురిపించి, బండి సంజయ్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్న కార్యకర్తలు
పాదయాత్రలో ఏ సమయానికి వచ్చినా.. బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
తమ అభిమాన నాయకుడిని చూసేందుకు, స్వచ్ఛందంగా… తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు
ప్రజల అభిమానంతో తడిసి ముద్దవుతున్న సం’జయుడు’
బండి సంజయ్ పాదయాత్రలతో… బీజేపీ క్యాడర్ లో ఫుల్ జోష్
ప్రజలకు భరోసా కల్పించడంలో… సక్సెస్ అయిన సంజయ్
బీఆర్ఎస్ అంటే లండన్ డ్రై జిన్
పార్టీలోనూ మద్యం ఆనవాళ్లే
కేసీఆర్ బిడ్డ చేసేది దొంగ సారా దందానే
టీఆర్ఎస్ కు ప్రజలు ఓటేయడమే పెద్ద పాపమైంది
ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీలకు పైసల్లేవట
లక్షకోట్లతో మాత్రం దొంగ సారా దందా చేసేందుకు మాత్రం పైసలున్నయట
వేములవాడ నియోజకవర్గ అభివ్రుద్ధికి కేంద్రం నిధులు తెస్తున్నాం
రాజన్న, ధర్మపురి ఆలయ అభివ్రుద్ధికి నిధులిస్తానన్న హామీ ఏమైంది?
లేఖ ఇస్తే ప్రసాదం స్కీం కింద ఎములాడను అభివ్రుద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా
మోడీ వస్తే కేసీఆర్ కు కోవిడ్, కొడుకుకు కాలు విరుగతది, బిడ్డ దుబాయ్ పోతది
పేదల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం
లొల్లి స్టార్ట్ అయ్యింది… కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
బీజేపీ అధికారంలోకి రాగానే బీడీ, గల్ఫ్ కార్మికులను ఆదుకుంటాం
కరీంనగర్ ప్రజలు తలెత్తుకునేలా, గర్వపడేలా చేస్తా
మేడిపల్లి ప్రజా సంగ్రామ సభలో బండి సంజయ్ కుమర్ వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా పెట్టిన బీఆర్ఎస్ పార్టీలోనూ మద్యం ఆనవాళ్లే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. లండన్ లో తయారయ్యే డ్రై జిన్ ను బీఆర్ఎస్ బ్రాండ్ విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బ్రాండ్ ఫోటోను ప్రదర్శించారు. కేసీఆర్ బిడ్డ పులిబిడ్డ అని… ఆమెను అరెస్ట్ చేస్తే ఖబడ్దార్… అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీబీఐని హెచ్చరించడంపై తనదైన శైలిలో హెచ్చరించారు. ‘‘కేసీఆర్ బిడ్డ… అత్తగారి ఇంటికి పోతుందా? బొట్టు పెట్టి పిలుస్తారా? స్వాతంత్ర్య సమరయోధురాలా?… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేస్తరా? అని అడుగుతున్నరు. మీరు ఇట్లనే చేసి విచారణను అడ్డుకోవాలని చూస్తే మిమ్ముల్ని కూడా సీబీఐ అధికారులు తీసుకెళతారు జాగ్రత్త…’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ బిడ్డ ఇంటి ముందు ‘‘పులి బిడ్డ….సింహం, నక్క ’’ రాసుకుంటున్నారని… వీళ్లను చూసి ఆయా జంతువులు సిగ్గు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లో తెలంగాణ పేరు తీసేయడమంటే ‘తెలంగాణ తల్లి’కి ద్రోహం చేసినట్లేనని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కొద్ది సేపటి క్రితం వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లిలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అందులోని ముఖ్యాంశాలు….
కేసీఆర్ ను నేను తిట్టిన్నా?
కేసీఆర్ లా నాకు భాష రాదు
ముండకొడకా..ఆ కొడకా
…ఈ కొడకా.. అని నేను తిట్టను
కేసీఆర్ బిడ్డ కవితకు ఒక రౌండ్ విచారణ ఇవాళ అయింది
అక్కడ పులి ఫోటోలు.. సింహం ఫోటోలు అంట
కవిత పులి బిడ్డా…..?
కేసీఆర్ ఇక్కడోడు కాదు… మచిలీపట్నం వాడు అని మొన్ననే ఒకడు అన్నడు
‘తెలంగాణ రాష్ట్ర సమితి’ లో నుంచి తెలంగాణను పీకిపడేసిండు
కేసీఆర్ తెలంగాణను మోసం చేసిండు
ఏ పార్టీ పేరు మీద అయితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో… ఆ పేరునే తీసేసిండు. ప్రజలను మోసం చేసిండు
తెలంగాణలో భూములు కబ్జాలు చేసిండు, నిధులను దండుకుంటున్నడు
తెలంగాణ తల్లిని, తెలంగాణ ప్రజలను మోసం చేసిండు
కేసీఆర్ బిడ్డ లక్ష కోట్ల లిక్కర్ దందా చేసింది
అయ్యకు ఇష్టమైన లిక్కర్ దందానే.. బిడ్డ కవిత చేసింది
లిక్కర్ దందా చేసిన కవితపై విచారణ జరపొద్దా?
లంగ దందాలు, దొంగ దందాలు, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదిస్తే… దర్యాప్తు సంస్థలు వచ్చి విచారణ జరపాలా…? వద్దా..?
దొంగ సారా దందా… పత్తాల(క్యాసినో) దందా చేసిన కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తే… ప్రజలు ధర్నా చేయాలా?
దోచుకున్న సొమ్ముతో…కవిత ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకున్నది
కవిత ఇల్లు చూసి సిబిఐ అధికారులే విస్తుపోయే పరిస్థితి…
సీబీఐ అధికారులు ఇప్పుడు కవిత ఇంటిని ఫొటో తీసి ఉంటారు.. నెక్స్ట్ ఈడీ విచారణ కూడా ఉండొచ్చు ఇంత ఇళ్లా అని
మేడిపల్లి లో అభివృద్ధి పనులు చేయడానికి పైసలు ఉండవు… లక్ష కోట్లు పెట్టి దోచుకోడానికి మాత్రం పైసలు ఉంటాయి
దొంగ దందాలు, లంగా దందాలతో లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు
తెలంగాణ ప్రజల బతుకును బిచ్చపు బతుకు చేశారు
BRS పేరులో కూడా మందు పేరే పెట్టుకున్నాడు
గోవిందారం, మేడిపల్లి రోడ్డును రూ.20 కోట్లతో స్టార్ట్ చేసినం
ఇక్కడ అభివృద్ధి పనులను చేస్తాం
వేములవాడ టెంపుల్ ను ‘ప్రసాదం స్కీం’ కింద అభివృద్ధి చేయిస్తానంటే.. కేసీఆర్ సహకరించడం లేదు
వేములవాడకు 100 కోట్ల రూపాయలు అన్నాడు. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు
ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్ల రూపాయలని అంటున్నడు
కెసిఆర్ స్పీచ్ లను గమనిస్తే… గజగజ వణుకుతున్నాడు. మొహంలో డిప్రెషన్ కనిపిస్తోంది
మోడీ వస్తున్నాడు అంటేనే… కేటీఆర్, కవితలకు రోగాలు వస్తాయి
ఎక్కడైనా బిజెపి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టిందా?
2,40,000 ఇండ్లను తెలంగాణకు మోడీ మంజూరు చేస్తే.. ఈ మేడిపల్లి మండలంలో ఎన్ని ఇండ్లను కేసీఆర్ కట్టించాడు?
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే… నిరుద్యోగ భృతి అన్నది దేవుడెరుగు
తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు
రుణమాఫీ అమలు చేయలేదు
ఈ 8 ఏళ్లలో పంట నష్టపోయిన రైతులకు, పంట నష్టపరిహారం కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే… ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిలువ నీడలేని పేదలకు ఇల్లు కట్టించి ఇస్తాం
పంట నష్టపోయిన రైతులకు ‘ఫసల్ బీమా యోజన’ను అమలు చేసి, వారిని ఆదుకుంటాం
బీడీ కార్మికులను ఆదుకున్న పాపాన పోలేదు కేసీఆర్
గల్ఫ్ కార్మికులను ఆదుకోలేదు
పేదోళ్లు కష్టపడి గెలిపిస్తే… పెద్దోడు రాజ్యమేలుతున్నాడు
తెలంగాణలో పేదోళ్ల రాజ్యం రావాలి
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం లోని కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు… తెగించి, కొట్లాడే కార్యకర్తలు
టిఆర్ఎస్ నాయకులు వేల కోట్లు ఖర్చుపెట్టినా… ఇక్కడ బండి సంజయ్(నన్ను) నే గెలిపించారు
మీరు గెలిపించిన తీరును చూసే… నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం అవకాశమిచ్చింది
మీరు గెలిపించిన పార్లమెంటు సభ్యుడుగా… మీకు న్యాయం చేస్తా
కాలాలకతీతంగా ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నాం
పండుగలు, పబ్బాలు లేవు. కుటుంబాలకు దూరంగా ఉంటూ… మీకోసమే తిరుగుతున్నాం
పేదల కోసం, పేదోళ్ల రాజ్యం కోసమే… పాదయాత్ర చేస్తున్నాం
తెలంగాణలో పేదోళ్ల రాజ్యం వస్తేనే… ప్రజలకు న్యాయం జరుగుతుంది
ప్రీపెయిడ్ లీడర్లను, పోస్ట్ పెయిడ్ లీడర్లను తెచ్చుకుని బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ నాటకాలు ఆడుతున్నాడు
బీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారు
గల్ఫ్ నుంచి 500 మంది డెడ్ బాడీ లు నేనే తెప్పించా
కేసీఆర్ గల్ఫ్ బాధితులకు రూ.500 కోట్ల ప్రత్యేక నిధి అని చెప్పి, మోసం చేసిండు
బైంసాకు భరోసా ఇస్తాం
ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి, పేద ముస్లిం మహిళలను ఆదుకున్నాం
ఈరోజు ముస్లిం మహిళలు వచ్చి, నాకు ఎంతో ప్రేమతో రాఖీ కట్టారు
ట్రిపుల్ తలాక్ వల్లనే ముస్లిం సమాజం నిర్వీర్యమైందని మోదీ గుర్తించే… ట్రిపుల్ తలాక్ ను రద్దు చేశారు
ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తే… సపోర్ట్ చేయాల్సిన లుచ్చాలు… ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు
నా ధర్మం గురించి చెప్పుకుంటే… మతతత్వమా?
నా ధర్మం కోసం పక్కా… కొట్లాడుతా
గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించేందుకే… బండి సంజయ్ పనిచేస్తున్నాడు
కేసీఆర్ బూటకపు వాగ్దానాలను నమ్మకండి
ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేని దుర్మార్గపు స్థితిలో కేసీఆర్ ఉన్నాడు
సొంత జాగా ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు మూడు లక్షల రూపాయల అంటున్నాడు. నిన్న కేబినెట్ లో దానిపైన కూడా చర్చ చేయలేదు
పేదల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం… కేసీఆర్ ప్రభుత్వం
మీరు గర్వపడే విధంగా… తల ఎత్తుకుని తిరిగే విధంగా… నేను పనిచేస్తా
మీకు అండగా ఉంటా.. మీకు సహకరిస్తా… మీకు న్యాయం చేస్తా
చాలామంది కార్యకర్తలు మొదటి విడత పాదయాత్ర నుంచి, నాతో కలిసి పనిచేస్తున్నారు
250 కోట్ల రూపాయలను పెట్టి, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపించలేడా?
ప్రతి ఒక్కరి పేరుపై లక్ష రూపాయల అప్పు చేసి పెట్టిండు
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి
తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే
బిజెపి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం
ఈనెల 15న కరీంనగర్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా గారు వస్తున్నారు
ఆ సభను విజయవంతం చేద్దాం
BREAKING
14వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
అడుగడుగునా… బండి సంజయ్ కి, గజమాలలతో ఘన స్వాగతం పలుకుతూ… తమ అభిమానాన్ని చాటుకుంటున్న కార్యకర్తలు
ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్
BREAKING
14వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని తాటిపల్లి గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
తాటిపల్లి గ్రామంలో గజమాలతో బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు
చిరు జల్లుల మధ్య ఫుల్ జోష్ గా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ సమావేశమైనారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి 500 కోట్లతో నిధి హామీ ఏమైంది?
ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తానని మాట తప్పినవ్
అహంకారం తలకెక్కి అడ్డగోలుగా మాట్లాడుతున్నావ్
సంక్షేమం దేవుడెరుగు….శవాలను కూడా తీసుకురాలేని దద్ధమ్మ కేసీఆర్
కేంద్రంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉంటేనే గల్ఫ్ కార్మికులు, బాధితులకు న్యాయం
బీజేపీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం
గల్ఫ్ బాధిత కుటుంబాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ భేటీ
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం, అభివ్రుద్దికి ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.
• ముఖ్యమంత్రి కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, గల్ఫ్ కార్మికులను ఉద్దేశించి చులకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం సంగతి దేవుడెరుగు… గల్ప్ లో చనిపోతే వారి శవాలను కూడా తీసుకురాలేని దద్దమ్మ కేసీఆర్ అన్నారు.
• నేటికీ ఎంతో మంది గల్ఫ్ లో ఉద్యోగాలు దొరకక, ఏజెన్సీల మాటలు నమ్మి మోసపోయి జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో ఉంటే గల్ఫ్ కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు.
• విదేశాలతో మాట్లాడి అక్కడున్న సమస్యలను, ఇబ్బందులను పరిష్కరించే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే గల్ప్ కార్మికుల సంక్షేమ డిమాండ్లన్ని నెరవేర్చడంతోపాటు గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
BREAKING
14వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి లోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
మేడిపల్లిలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక నేతలు, కార్యకర్తలు
భారీ గజమాలతో బండి సంజయ్ కి స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్న బిజెపి కార్యకర్తలు
మేడిపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద, కార్నర్ మీటింగ్ లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్
BREAKING
లంచ్ అనంతరం తిరిగి ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”
బండి సంజయ్ పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా బుల్డోజర్లు(JCB’s)
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, అవినీతిపై ఉక్కుపాదం మోపుతాం అనడానికి సంకేతంగా వచ్చిన బుల్డోజర్లు
కాసేపట్లో జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి గ్రామంలోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర
మేడిపల్లి గ్రామం, అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్
నన్ను చంపినా సరే…. ఇచ్చిన హామీలన్నీ అమలు చెయ్
- పేదల గురించి ప్రశ్నిస్తే నా తల 6 ముక్కలు నరుకుతాడట
- దేశంలోనే అత్యంత ఆస్తిపరులున్న నేతల్లో కేసీఆర్ కుటుంబం నెంబర్ వన్
- నోటిఫికేషన్లే తప్ప ఒక్క ఉద్యోగం భర్తీ చేయని కేసీఆర్
- ఉద్యోగాలు, ఉపాధి లేక గల్ఫ్ కు పోయి అష్టకష్టాలు పడుతున్న యువకులు
- వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా ఒట్టిమాటలే
- మోదీ సాకుతో మోటార్లకు మీటర్లు పెడితే బజారుకు లాక్కొస్తం
- బీజేపీ అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితులందరినీ ఆదుకుంటాం
- ఉచిత విద్య, వైద్యం అందిస్తాం… ఇండ్లు నిర్మిస్తాం
- ఇంద్రభవనాన్ని తలపిస్తున్న కేసీఆర్ బిడ్డ నివాసం ‘‘పేదల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నన్ను కేసీఆర్ 6 ముక్కలు చేస్తడట. నన్ను చంపినా సరే… నేను చావడానికి రడీ… కానీ డబుల్ బెడ్రూం ఇండ్లు, రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతి, దళిత, గిరిజన బంధు సహా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చెయ్..’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రూ.లక్ష కోట్ల దొంగ సారా, పత్తాల(క్యాసినో) దందాతో సంపాదించిన సొమ్ముతో కేసీఆర్ ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుందన్నారు. లిక్కర్ స్కాంపై విచారణ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులు ఆ ఇంటిని చూసి విస్తుపోతున్నారని చెప్పారు. దేశంలో అత్యంత ఆస్తులున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని తెలిపారు.
• ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 13వ రోజు కోరుట్ల నియోజకవర్గంలోని మోహన్ రావు పేటలో గ్రామస్తులతో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఇబ్బందులు, సమస్యలను గ్రామస్తులు ఏకరవు పెట్టారు. ‘‘మాకు పెన్షన్లు రావడం లేదు, ఇండ్లు లేవు. గుడిసెల్లో పండుకుంటే… పాములు, తేళ్లు కుడుతున్నాయి. మమ్మల్ని మీరే ఆదుకోండి’’అని ఓ ముసలవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా భూమిని బలవంతంగా లాక్కున్నారు. పోలీస్ స్టేషన్లో తిరిగినా… మాకు న్యాయం జరగలేదు. మమ్మల్ని మీరే ఆదుకోవాలి’’ అని ఓ బాధితురాలు వాపోయారు. ‘‘గల్ఫ్ లో మా నాన్న చనిపోయారు. ఇప్పటివరకు మా నాన్న మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురాలేదు. మేము చాలా పేదోళ్ళం, మాకు మీరే న్యాయం చేయండి’’ అని తండ్రిని పోగొట్టుకున్న కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల సమస్యలు, ఇబ్బందులను విన్న అనంతరం బండి సంజయ్ చేసిన ప్రసంగ పాఠం వివరాలు…
సంవత్సరం నుంచి నీకోసమే పాదయాత్ర చేస్తున్నా
ఇప్పుడు ఎన్నికలు లేవు, ఓట్ల కోసమో రాలేదు
కేసీఆర్ కనీసం బీడీ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించలేదు
పేదలు పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్తారు
కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి మరీ, గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు
కేసీఆర్ పాలనలో… గల్ఫ్ బాధితుల సమస్యలు తీరలేదు. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వాళ్ళ శవాన్ని 6 నెలలైనా కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు.
తెలంగాణ ఉద్యమం లో దుబాయ్ వెళ్లిన వాళ్లు కూడా కేసీఆర్ కు పైసలు ఇచ్చారు
అలాంటి వాళ్ళను కూడా ముండకొడుకులు అని తిట్టిన మూర్ఖుడు కేసీఆర్
ఏజెంట్ల చేతిలో మోసపోయి కొందరు దుబాయ్ లో సంవత్సరాలు తరబడి జైళ్ల లోనే మగ్గుతున్నారు
కేసీఆర్ పాలనలో… గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ఎలాంటి పాలసీ కూడా తీసుకురాలేదు
దుబాయ్ నుంచి నేనే 500 మంది శవాలను కేంద్రప్రభుత్వం ద్వారా తీసుకొచ్చే ఏర్పాట్లు చేశాను
తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే… గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తాం. కార్మికులను ఆదుకుంటాను
గల్ఫ్ దేశాల్లో జైళ్లలో మగ్గుతున్న బాధితులను కూడా తీసుకొస్తాం
తెలంగాణకు మోడీ 2,40,000 ఇండ్లను మంజూరు చేస్తే… ఇక్కడ కేసీఆర్ ఆ ఇండ్లను కట్టించడం లేదు
ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు
మొన్న మోదీ గారు 1.46 వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చారు
కేసీఆర్ బిడ్డ కవిత దొంగసారా దందా చేసింది
లక్ష కోట్లు పెట్టి, ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది
హాస్పిటల్ లలో “ఆరోగ్య శ్రీ” పనిచేయడం లేదు
దేశంలోనే కేసీఆర్ పెద్ద ఆస్తిపరుడు గా మారాడు
దందాలు చేసుడు… దండుకునుడే వాళ్లకు తెలుసు
కవిత పత్తాల దందా కూడా చేసింది
దొంగ దందాలు చేసి, దండుకున్న కవితపై విచారణ జరపాలా..? వద్దా…?
కవిత ఇండ్లు చూస్తే… కళ్ళు తిరిగి పడిపోతారు. ‘ఇంద్రభవనం’ లా ఇండ్లు కట్టుకుంది
లంగ దందా.. దొంగ దందా చేస్తే… పులి బిడ్డలా?
కేసీఆర్… పులి, కవిత పులి బిడ్డా…?
లక్షల కోట్లు దండుకున్నారు
పెన్షన్స్ ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వడం లేదు.
పేదలకు ఉచిత బియ్యం ఇస్తున్నది మోదీ ప్రభుత్వమే
కిలో కు 29 రూపాయలు భరిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే
కేసీఆర్ భరిస్తున్నది కేవలం ఒక్క రూపాయి మాత్రమే
రూపాయి భరిస్తున్న కేసీఆర్ గొప్పోడా…? 29 రూపాయలు భరిస్తున్న మోడీ గొప్పోడా?
కరోనా సమయంలో ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీదే
కేంద్రం ఇస్తున్న నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది
పేదోళ్ల ప్రభుత్వం వస్తేనే… పేదోళ్లకు న్యాయం జరుగుతుంది
అందుకే బీజేపీ ప్రభుత్వం రావాలి
కేసీఆర్ ఎన్ని పైసలు పంచినా… దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో, ప్రజలు కేసీఆర్ కు చెంప చెల్లుమనిపించే ఫలితాలనే ఇచ్చారు
మోడీ మంజూరు చేసిన ఇండ్లన్నీ కట్టిస్తే… అదనంగా ఇంకో రెండు లక్షల ఇండ్లను మంజూరు చేయిస్తానని కేసీఆర్ తో అంటే.. ఈరోజు వరకు సమాధానం లేదు.
పేదోళ్ల బతుకులను బాగు చేయాలని కేసీఆర్ కు లేదు
సొంత జాగా ఉన్న వాళ్లకు ముందు 5 లక్షల ఆర్థిక సాయం అన్నాడు. మళ్ళీ మాట మార్చే, ఇప్పుడు 3 లక్షల ఆర్థిక సాయం అని అంటున్నాడు
నిన్న కేబినెట్ సమావేశం పెట్టి, కనీసం ఈ అంశం పై చర్చించనూ లేదు
ఒక్క నోటిఫికేషన్ కూడా సక్సెస్ కాలేదు
కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, దళితులకు మూడెకరాలు, దళిత బంధు, ఉద్యోగాలు ఇచ్చాడా?
నేను పేదోళ్ల గురించి ప్రశ్నిస్తే…. నన్ను చంపుతానని అంటున్నడు కేసీఆర్
నాకు భాషలో గురువు కేసీఆరే…
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్… తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు
కరెంటు బిల్లులు పెంచిండు
ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచిండు
కేసీఆర్ కు 300 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది
40, 50 గ్రామాలకు వాడాల్సిన కరెంట్ ను కేసీఆర్ తన ఫార్మ్ హౌస్ కి వాడుకుంటున్నాడు
నరేంద్ర మోడీ, బిజెపి పేరు చెప్పి… రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ చూస్తుండు
మోటర్లకు మీటర్లు పెడితే… ఊరుకుంటామా?
కాలాలకతీతంగా.. పేదల కోసమే పాదయాత్ర చేస్తున్నాం
పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తేనే… పేదలకు న్యాయం జరుగుతుంది
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే… ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిలువు నీడలేని పేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం
మేమిచ్చిన ఈ హామీకి, కట్టుబడి ఉన్నాం
నాకు వినతి పత్రాలు ఇచ్చినంత మాత్రాన, మీ పని అయిపోయిందని అనుకోకండి( గౌడ సోదరులను ఉద్దేశించి)
మీరు కూడా తెగించి కేసీఆర్ ప్రభుత్వం పై కొట్లాడండి
ప్రజల కోసం ఎప్పుడూ… బిజెపి పోరాడుతూనే ఉంటుంది
BREAKING
“ప్రజా సంగ్రామ యాత్ర – 5”
14వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. నేడు ‘కోరుట్ల, వేములవాడ, జగిత్యాల’ నియోజకవర్గాల పరిధిలో కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. కోరుట్ల నియోజకవర్గం, వెంకటాపూర్ గ్రామంలోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. గుమ్లాపూర్, మోహనరావుపేట్, మేడిపల్లి, తాటిపల్లి మీదుగా చెల్గాల్ వరకు కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. ఈరోజు మొత్తం 14 కిలోమీటర్ల మేర సాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. నేడు చెల్గాల్ గ్రామ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస.
మోహన్ రావు పేటలో నూతన వధూవరులు పూదరి హిమాజ – రాజేశుని శరత్ లు పాదయాత్ర వద్దకోచ్చి బండి సంజయ్ ఆశీర్వాదం తీసుకుంటున్న దృశ్యాలు..
BREAKING
దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న వేలాదిగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు, రైతులు, నిరుద్యోగులు
పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తూ.. ముందుకు సాగుతున్న బండి సంజయ్
కాసేపట్లో మోహనరావు పేట్ గ్రామంలోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర
BREAKING
14వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మోహనరావు పేట్ గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
మోహనరావు పేట్ గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు
ప్రజలకు అభివాదం చేస్తూ… పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్
BREAKING
14వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మోహనరావు పేట్ గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన బండి సంజయ్
అనంతరం గ్రామస్తులతో కలిసి, ‘రచ్చబండ’ కార్యక్రమం నిర్వహిస్తున్న బండి సంజయ్
BREAKING
“ప్రజా సంగ్రామ యాత్ర – 5”
కాసేపట్లో ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర. నేడు ‘కోరుట్ల, వేములవాడ, జగిత్యాల’ నియోజకవర్గాల పరిధిలో కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. ఇవాళ కోరుట్ల నియోజకవర్గం, వెంకటాపూర్ గ్రామంలోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర. మధ్యాహ్నం మోహన్ రావుపేటలో ప్రజా సమస్యలపై రచ్చబండ.
గుమ్లాపూర్, మోహనరావుపేట్, మేడిపల్లి, తాటిపల్లి మీదుగా చెల్గాల్ వరకు కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. ఈరోజు మొత్తం 14 కిలోమీటర్ల మేర సాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. నేడు చెల్గల్ గ్రామ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస.