बीएसपी तमिलनाडु अध्यक्ष आर्मस्ट्रांग की हत्या के मामले में 8 लोग गिरफ्तार, पुलिस को है यह संदेह

हैदराबाद: बीएसपी तमिलनाडु अध्यक्ष आर्मस्ट्रांग की हत्या के मामले में पुलिस ने 8 लोगों को हिरासत में लिया गया है। शुक्रवार रात चेन्नई के पेरम्बूर में उनके आवास के पास छह लोगों ने आर्मस्ट्रांग की चाकू मारकर हत्या कर दी थी। स्थानीय अस्पताल में इलाज के दौरान उनकी मौत हो गई।

पुलिस ने बताया कि इस मामले में 8 संदिग्धों को गिरफ्तार किया है। चेन्नई के वरिष्ठ पुलिस अधिकारी असरा गर्ग ने कहा, “हमें संदेह है कि अर्कोट सुरेश नामक गैंगस्टर की हत्या मामले में आर्मस्ट्रांग शामिल था। यह बदले की भावना से की गई हत्या हो सकती है। मामले की जांच जारी है। मामला एक गैंगस्टर की हत्या से जुड़ा हुआ लगता है।”

तमिलनाडु बसपा अध्यक्ष के. आर्मस्ट्रांग की हत्या किसने की? उसे क्यों मारा गया? इस पर वहां की मीडिया में इसकी बड़ी चर्चा जारी है। पता चला है कि राज्य खुफिया विभाग पहले भी तीन चेतावनियां जारी कर चुका है कि आर्मस्ट्रांग की जान खतरे में है। तमिलनाडु के संगठित अपराध दस्ते ने पहले भी कई हत्याओं को नाकाम किया है। लेकिन आर्मस्ट्रांग की हत्या को रोकने में असफल रहे हैं।

तमिलनाडु में वर्तमान में कोई समर्पित गृह मंत्री नहीं है। अहम विभाग सीएम स्टालिन के पास होने को लेकर आलोचनाएं हो रही हैं। आर्मस्ट्रांग पर एक बार सात आपराधिक आरोप लगे थे। परन्तु उन आरोपों में वह निर्दोष पाया गया। ऐसे में पुलिस को शक है कि पुरानी गुटबाजी और कुछ दुश्मनों ने बदला लेने के लिए आर्मस्ट्रांग की हत्या कर दी होगी। पुलिस ने कहा कि वे आर्मस्ट्रांग से दुश्मनों की जानकारी जुटाकर जांच कर रहे हैं।

బీఎస్పీ తమిళనాడు చైర్మన్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసులో 8 మంది అదుపులో

హైదరాబాద్ : బీఎస్పీ తమిళనాడు చైర్మన్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై పెరంబూర్‌లోని నివాసం దగ్గర శుక్రవారం రాత్రి ఆరుగురు వ్యక్తులు ఆయనపై కత్తిదాడి చేశారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.

ఈ కేసులో 8 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. “ఆర్కాట్ సురేష్ అనే గ్యాంగ్‌స్టర్ హత్యతో ఆర్మ్ స్ట్రాంగ్ కు సంబంధం ఉందని అనుమానిస్తున్నాం. ఇది ప్రతీకార హత్య కావచ్చు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు గ్యాంగ్ స్టర్ హత్యతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది” అని చెన్నై సీనియర్ పోలీసు అధికారి అస్రా గార్గ్ చెప్పారు.

తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు ? అనే దానిపై ఇప్పుడు ఆ రాష్ట్ర మీడియాలో ప్రధాన చర్చ జరుగుతోంది. ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రాణాలకు ముప్పు ఉందని రాష్ట్ర ఇంటెలీజెన్స్ విభాగం గతంలో మూడుసార్లు వార్నింగ్ జారీ చేసిందని తెలిసింది. తమిళనాడుకు చెందిన వ్యవస్థీకృత నేర నిరోధక విభాగం గతంలో ఎన్నో హత్యలను అడ్డుకోగలిగింది. కానీ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను అడ్డుకోవడంలో విఫలమైంది.

ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక హోంశాఖ మంత్రి లేరు. ఆ కీలకమైన శాఖ సీఎం స్టాలిన్ వద్దే ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్మ్‌స్ట్రాంగ్‌‌పై ఒకప్పుడు ఏడు క్రిమినల్ కేసులు ఉండేవి. అయితే వాటిలో ఆయన నిర్దోషి అని తేలింది. ఈనేపథ్యంలో పాత కక్షలు, ప్రతీకారం తీర్చుకునేందుకు ఎవరైనా శత్రువులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌‌తో శత్రుత్వం కలిగిన వారి వివరాలను సేకరించి.. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X