హైదరాబాద్ : గాంధీ భవన్ లో పిసిసి కల్లు గీతా కార్మిక విభాగం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి వేడుకలు. గాంధీ భవన్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్.

కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, కల్లు గీతా కార్మిక విభాగం అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ ,తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు.

మంత్రి పొన్నం ప్రభాకర్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి సందర్భంగా తెలంగాణ లో బడుగు బలహీనవర్గాలకు ఆలోచింప చేసే దినం. ఆనాడు రాజ్యాధికారం కోసం వారి పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శం.
Also Read-
అందరూ ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలి. బడుగు బలహీనవర్గాల ఐక్యత కోసం ఆనాడు సైన్యం తో పోరాటం చేసే పరిస్థితి. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో పెన్ను ద్వారా పోరాటం,ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలి. వారు అందరికీ ఆరాధ్యంగా వారు పోరాడిన విధానం మార్గదర్శకత్వం తీసుకోవాలి.

మా అందరికీ మార్గదర్శకత్వం అయినా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు గాంధీ భవన్ లో కల్లు గీత కార్మిక విభాగం నాగరాజు ఆధ్వర్యంలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరుపున అధికారికంగా రవీంద్ర భారతిలో వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటున్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సొంత గ్రామం…
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సొంత గ్రామం సర్వాయిపేట గ్రామ అభివృద్ధికి టూరిజం నుండి మొదటి దశ లో4.70 కోట్లు మంజూరు. సర్వాయి పెట్ కోట అభివృద్ధి తో పాటు సర్వాయి పెట్ నుండి కిలాష్ పూర్ కోట వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉన్నటువంటి ప్రాంతాలు పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి కోసం 4.70 కోట్ల విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్.
సర్వాయి పాపన్న గౌడ్ నడియాడిన ప్రాంతాలను టూరిజం గా అభివృద్ధి చేసుకుంటే దేశ విదేశాలకు కూడా ఆయన జీవిత చరిత్ర తెలుస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నేటి యువతకు సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర స్ఫూర్తి దాయకంగా ఉంటూ ఆ ప్రాంతాలు టూరిజంగా మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
