तेलंगाना म्युनिसिपल चुनाव में पिछड़ी जाति के लिए 31 फीसदी आरक्षण బీసీలకు 31% రిజర్వేషన్

हैदराबाद : म्युनिसिपल चुनाव कराने में एक और अहम पड़ाव पूरा हो गया है। इलेक्शन कमीशन ने वोटर लिस्ट पहले ही फाइनल कर दी है। वहीं म्युनिसिपल डिपार्टमेंट ने अब आरक्षण पर अहम फैसला किया है। तेलंगाना में 131 अर्बन लोकल बॉडी (10 कॉर्पोरेशन और 121 म्युनिसिपैलिटी) हैं। इन सभी के लिए रिज़र्वेशन फाइनल कर दिए गए हैं। इसी सिलसिले में म्युनिसिपल डिपार्टमेंट की सेक्रेटरी टीके श्रीदेवी ने बुधवार को म्युनिसिपल रिज़र्वेशन की डिटेल्स ऑफिशियली अनाउंस की है। म्युनिसिपैलिटी और कॉर्पोरेशन मेयर, म्युनिसिपल चेयरमैन, काउंसलर और कॉर्पोरेटर में से हर कैटेगरी को दी गई सीटों की संख्या अनाउंस की है। यह जानकारी संबंधित कलेक्टर और म्युनिसिपैलिटी को दी गई। अभी चुनाव नहीं होने वाले- ग्रेटर हैदराबाद, ग्रेटर वरंगल, सिद्दीपेट, खम्मम आदि के लिए रिज़र्वेशन की संख्या फाइनल कर दी गई हैं। तेलंगाना में 10 मेयर और 121 म्युनिसिपल चेयरमैन पद हैं।

आंकड़े साफ करते हैं कि इसमें से 31 परसेंट पिछड़ी जाति के लिए रिज़र्व की गई हैं। मेयर में 30 परसेंट पिछड़ी जाति के लिए और म्युनिसिपैलिटी में 31.40 परसेंट पिछड़ी जाति के लिए के लिए रिज़र्व किए गए हैं। क्योंकि शहरों में एसटी की आबादी कम है, इसलिए पिछड़ी जाति के लिए के लिए ये रिज़र्वेशन बढ़ गए हैं। शहरों में बीसी को गांव के इलाकों के मुकाबले ज़्यादा सीटें मिली हैं। मेयर के लिए सिर्फ़ एसटी और एससी को ही रिज़र्व किया गया है। इस वजह से एससी और एसटी कैटेगरी में महिलाओं के लिए रिज़र्वेशन करने का मौका नहीं मिला। क्योंकि 50 परसेंट मेयर महिलाओं के लिए रिज़र्व करने थे, इसलिए जनरल पोस्ट में महिलाओं के लिए 4 मेयर पोस्ट फाइनल करने पड़े है। इसके साथ ही जनरल कैटेगरी के लिए सिर्फ़ एक मेयर पोस्ट रिज़र्व किया गया है।

चुनाव आयोग ने नगर निगम चुनावों के लिए ज़रूरी वोटर लिस्ट तैयार कर ली है। इस महीने की 12 तारीख को वार्ड और डिवीज़न के हिसाब से फ़ाइनल लिस्ट पहले ही जारी कर दी गई है। 16 तारीख को पोलिंग स्टेशन के हिसाब से फ़ाइनल लिस्ट जारी की जाएगी। पोलिंग स्टेशन बाद में फ़ाइनल किए जाएँगे। पता चला है कि जिन 123 नगर निगमों और नगर निगमों में अभी चुनाव हो रहे हैं, वहाँ 52.43 लाख वोटर हैं। इनमें से 25.62 लाख पुरुष, 26.80 लाख महिलाएँ और 640 अन्य हैं। उनके लिए 8,195 पोलिंग स्टेशन बनाए गए हैं। चुनाव बैलेट सिस्टम से होंगे। बैलेट पेपर के सीरियल नंबर हैदराबाद प्रिंटिंग प्रेस में प्रिंट किए जाएँगे। चुनाव का शेड्यूल इस महीने के आखिरी हफ़्ते तक जारी कर दिया जाएगा।

Also Read-

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 31% రిజర్వేషన్

హైదరాబాద్ : మున్సిపల్​ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటికే ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేయగా.. తాజాగా రిజర్వేషన్‌లను మున్సిపల్​శాఖ ఫైనల్ చేసింది. రాష్ట్రంలో 131 పట్టణ స్థానిక సంస్థలు(10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు) ఉండగా వాటన్నంటికీ రిజర్వేషన్‌లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు బుధవారం మున్సిపల్​శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి మున్సిపల్​రిజర్వేషన్‌ల వివరాలను అధికారికంగా ప్రకటించారు. మేయర్, మున్సిపల్​చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్‌లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించనున్నారో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల వారీగా ప్రకటించారు. ఈ సమాచారాన్ని ఆయా కలెక్టర్‌లు, మున్సిపాలిటీలకు అందించారు. ప్రస్తుతం ఎన్నికలు జరగని గ్రేటర్​హైదరాబాద్, గ్రేటర్​వరంగల్, సిద్దిపేట, ఖమ్మం లాంటి వాటికి అన్నింటినీ కలిపి రిజర్వేషన్‌ల సంఖ్యను ఖరారు చేశారు. 10 మేయర్​స్థానాలు, 121 మున్సిపల్​చైర్మన్ స్థానాలు రాష్ట్రంలో ఉన్నాయి.

ఇందులో బీసీలకు 31 శాతం రిజర్వేషన్లు వచ్చినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మేయర్లలో బీసీలకు 30 శాతం, మున్సిపాలిటిల్లో 31.40 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఖరారు అయ్యాయి. పట్టణాల్లో ఎస్టీల జనాభా తక్కువగా ఉండటంతో ఆ రిజర్వేషన్లు బీసీలకు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లో బీసీలు ఎక్కువగా సీట్లు వచ్చాయి. మేయర్​లలో ఎస్టీ, ఎస్సీ ఒక్కొక్కటే రిజర్వేషన్లు అయ్యాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో మహిళలకు రిజర్వేషన్​కల్పించే అవకాశం రాలేదు. మేయర్‌లలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్​ కల్పించాల్సి ఉన్నందున జనరల్​ స్థానాల్లో మహిళలకు 4 మేయర్​ స్థానాలను ఖరారు చేయాల్సి వచ్చింది. దీంతో జనరల్ కేటగిరికి ఒకే మేయర్‌ స్థానం రిజర్వ్​అయింది.

మున్సిపల్​చట్టంలో పొందుపరిచిన విధంగా 50 శాతం మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉండటంతో అన్​రిజర్వ్ సీట్లలో మహిళలకు 4 స్థానాలు కేటాయించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పట్టణాలకు సంబంధించిన డెడికేటెడ్​కమిషన్​నివేదిక ప్రభుత్వానికి అందడంతో రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేశారు. ఈనెల 18న కేబినెట్ సమావేశం మేడారంలో జరగనుంది. అందులో ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్‌ను ఏ వర్గానికి రిజర్వ్​చేయాలో చర్చించి తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. అందుకు అనుగుణంగా అధికారులు రిజర్వేషన్ల జాబితాను ప్రకటిస్తారని తెలిసింది. మొత్తంగా ఫిబ్రవరి రెండో వారంలో పే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లుగా సమాచారం. ఇందుకు అనుగుణంగా ఈ నెల చివరి వారం కల్లా నోటిఫికేషన్​ వస్తుందని తెలిసింది. 121 మున్సిపాలిటీల్లో 60 స్థానాలు మహిళలకు రిజర్వ్​చేశారు. 61 స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో జనరల్‌కు కేటాయించారు.

మున్సిపల్​పోరులో కీలకమైన ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది. ఈనెల 12న వార్డులు, డివిజన్ల వారీగా తుది జాబితాను ఇప్పటికే ప్రకటించింది. 16న పోలింగ్​ కేంద్రాల వారీగా తుది జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను ఖరారు చేస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52.43 లక్షల ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 25.62 లక్షలు, మహిళలు 26.80 లక్షలు , ఇతరులు 640 ఉన్నట్లుగా ప్రకటించారు. వీరి కోసం 8,195 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను బ్యాలెట్​విధానంలో జరపనున్నారు. బ్యాలెట్​పేపర్ల సీరియల్ నంబర్‌లను హైదరాబాద్​ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించనున్నారు.

గుర్తులు, అభ్యర్థుల ఫోటోలు, పేర్లు అన్ని ఆయా జిల్లా కేంద్రాల్లో జరగనున్నాయి. ఇందుకోసం ప్రింటింగ్​ ప్రెస్‌లకు సంబంధించి టెండర్లు పిలిచి అన్ని తనిఖీలు పూర్తి చేసి సిద్ధం చేసుకోవాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీచేశారు. పోలింగ్​ కేంద్రాల సంఖ్య ఖరారు అయినందున పోలింగ్, పోలీసు సిబ్బంది ఎంతమంది అవసరం ఉంటారు? వారిని ఎక్కడి నుంచి తీసుకుంటారనే విషయాలను వెంటనే ఖరారు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఎన్నికల ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించనున్నారు. ఈనెల చివరి వారం కల్లా ఎన్నికల షెడ్యూల్ ​విడుదల కానుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X