हैदराबाद : दसवीं कक्षा की परीक्षाएं सोमवार से शुरू हो गई है। माध्यमिक विद्यालय शिक्षा बोर्ड ने परीक्षाएं आयोजित करने की तैयारियां पहले ही पूरी कर ली हैं। 2 अप्रैल तक होने वाली परीक्षाओं में कुल 5,08,385 छात्र शामिल हो रहे हैं। परीक्षाएं सुबह 9.30 बजे से दोपहर 12.30 बजे तक होंगी।
इस पृष्ठभूमि में टीएसआरटीसी ने परीक्षा दे रहे छात्रों को अच्छी खबर दी है। आरटीसी के एमडी सज्जनर ने खुलासा किया कि वे परीक्षा केंद्रों के लिए विशेष बसें चला रहे हैं। उन्होंने कहा कि छात्र अपना बस पास और हॉल टिकट दिखा सकते हैं और परीक्षा हॉल तक मुफ्त यात्रा कर सकते हैं।
![](https://telanganasamachar.online/wp-content/uploads/2024/03/TSRTC.png)
सज्जनार ने 10वीं कक्षा की परीक्षा में बैठने वाले सभी छात्रों को शुभकामनाएँ दी है। टीएसआरटीसी प्रबंधन ने सभी व्यवस्थाएं की हैं ताकि छात्रों को परिवहन के मामले में किसी भी असुविधा का सामना न करना पड़े। तेलंगाना शिक्षा विभाग के निर्देशानुसार छात्रों को सुबह 8.45 बजे तक परीक्षा केंद्रों तक पहुंचाने के लिए विशेष बसें चल रही हैं। बसें 18 मार्च से 02 अप्रैल तक चलेंगी।
महालक्ष्मी योजना के हिस्से के रूप में महिला छात्रों के लिए यात्रा निःशुल्क है और पुरुष छात्र अपना पुराना बस पास और हॉल टिकट दिखाकर परीक्षा केंद्र तक निःशुल्क यात्रा कर सकते हैं। एक्सप्रेस बसों में भी उनके लिए कॉम्बिनेशन टिकट की सुविधा उपलब्ध है। इसलिए, टीएसआरटीसी प्रबंधन छात्रों से अनुरोध करता है कि वे आरटीसी बसों में सुरक्षित रूप से यात्रा करें और बिना किसी तनाव या चिंता के शांत वातावरण में परीक्षा दें।
10వ తరగతి పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్: సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఏప్రిల్ 2 వరకూ జరిగే పరీక్షలకు రాష్ట్రంలో 5,08,385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి.
ఈ నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. విద్యార్థులు తమ వద్ద ఉన్న బస్ పాస్, హాల్ టికెట్ చూపించి ఎగ్జామ్ హాల్ వరకు ఫ్రీ జర్నీ చేయవచ్చునని తెలిపారు.
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. విద్యార్థులకు రవాణా విషయంలో అసౌకర్యం కలగకుండా TSRTC యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ విద్యా శాఖ సూచనల మేరకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం (18.03.2024) నుంచి 02.04.2024 వరకు బస్సులు తిరుగుతాయి.
మహాలక్ష్మి పథకంలో భాగంగా విద్యార్థినిలకు ప్రయాణం ఫ్రీ కాగా విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ కాంబినేషన్ టికెట్ సదుపాయం కూడా వారికి అందుబాటులో ఉంది. కావున క్షేమంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విద్యార్థులను కోరుతోంది. (ఏజెన్సీలు)