Hyderaba्d : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నర్సంపేటలో జరిగిన దాడిని తెలంగాణ గవర్నర్ తమిళి సైని కలిసి ఆమె వివరించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రగతి భవన్లో కేంద్ర సంస్థలు రైడ్స్ జరిపితే వేల కోట్లు దొరుకుతాయన్నారు. దేశంలోనే కేసీఆర్ది రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ అన్నారు. తనకు, తనవాళ్లకు ఏం జరిగినా కేసీఆర్దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఏమిలేని వాళ్లకు వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ సర్కార్ పై, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఆదరణ పెరగడంతో టీఆర్ఎస్ భయపడుతుంది. అందుకే పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర చేశారు. కావాలనే శాంతిభద్రతల సమస్య తీసుకొచ్చారు. నన్ను అరెస్ట్ చేస్తే తప్ప పాదయాత్ర ఆపలేమని అనుకున్నారు. పాదయాత్రను ఆపాలని అనుకోకపోతే రిమాండ్ ఎందుకు అడిగారని షర్మిల ప్రశ్నించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే రిమాండ్ కు పంపిస్తారా అని మండిపడ్డారు. కేసీఆర్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. దేశంలో అత్యంత ధనిక కుటుంబం కేసీఆర్ దే.
వైఎస్ షర్మిల మాట్లాడుతూ… కవిత, కేటీఆర్, టీఆర్ఎస్ MLA ఇళ్లపై రైడ్స్ చేయాలి. ప్రగతి భవన్ లో దాడి చేస్తే వేల కోట్లు దొరుకుతాయి. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ల్యాండ్ వుంది. కాంట్రాక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారన్నారు. లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందని చెప్పుకొచ్చారు.
అవినీతిని ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా అని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్రలో కేసీఆర్ హామీలపై ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు తాలిబన్ల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్రాఫిక్ వయోలేషన్ కేసులో రిమాండ్ అడగడం ఏంటని నిలదీశారు. డబ్బు సంపాదించేందుకే అధికారాన్ని వాడుతున్నారన్నారు.
నాలుగు లక్షల అప్పుల ఊబిలో తెలంగాణను నెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని షర్మిల విమర్శించారు. తాను చెప్పుతో కొడతా అని…ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని… ఇంకెవర్ని అనలేదని స్పష్టం చేశారు. పాదయాత్రను యజ్ఞంలా చేస్తున్నామన్నా ఆమె… ఉద్దేశ్యపూర్వకంగానే పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు.