“పరీక్షలు రద్దు చేయడం కాదు, కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేసేందుకు సిద్ధం కండి”

ఆత్మహత్యలు వద్దు.. ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం
నిరుద్యోగుల నిరసన దీక్షలో
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. కేసీఆర్ పరీక్షలు రద్దు చేయడం కాదు… కేసీఆర్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 24, 25న విద్యార్థులు దీక్ష చేస్తామంటున్నారు. వారి దీక్షకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది” అని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని జువ్వాడి గ్రేట్ నుంచి గాంధారి శివాజీ చౌరస్తా వరకు పాదయాత్ర చేపట్టారు.

అనంతరం టీఎస్పీఎస్సీ పేపల్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతోపాటు కేటీఆరును మంత్రివర్గం నుంచి భర్తరప్ చేయాలనే డిమాండుతో గాంధారి మండల కేంద్రంలో చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబమో, బంధువులో, పార్టీ నేతల్లో ఒక్కరు కూడా ఆత్మ బలిదానం చేసుకోలేదు. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు. అమరులు కలలుగన్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమే..తొమ్మిదేళ్లయినా కేసీఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో లక్షా 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ చెప్పిండు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఏ త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందో.. ఆ తెలంగాణలో మళ్లీ నిరుద్యోగ ఆత్మహత్యలు చూస్తున్నాం.

తెలంగాణలో ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకు కడచూపు దక్కనివ్వలేదు.మానవ మృగాల్లా బీఆరేస్ నేతలు ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ సమాజం మానవత్వం కోల్పోయిందా? తెలంగాణ మేధావులు ఎక్కడున్నారు? సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత నిర్బంధం చూడలేదు. ఈ నిర్బంధాల కోసమేనా మనం తెలంగాణ తెచుకున్నది? టీఎస్పీఎస్సీ లో ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలా ఉద్యోగం ఇచ్చారు? సీఎం కేసీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారు? వందల కోట్ల రూపాయలకు లక్షలాది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారు.

కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఏ కుంభకోణం జరగలేదు. ఆనాడు ఇంర్మీడియట్ బోర్డు సెక్రెటరీ గా ఉన్న జనార్దన్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారు. వీరంతా కలిసి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ఆత్మహత్యలు వద్దు.. ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. కేసీఆర్ పరీక్షలు రద్దు చేయడం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 24, 25న విద్యార్థులు దీక్ష చేస్తామంటున్నారు. వారి దీక్షకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలికేక వినిపించేందుకు సిద్ధం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం

కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం… తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం : రేవంత్ రెడ్డి
కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గాంధారి మండల కేంద్రంలో ఆదివారం చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష వేదిక వద్ద మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారిందన్నారు. పేపర్ లీకేజీలతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ తప్పిదాలకు ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. కేటీఆర్ తనకేం సంబంధం అని అతి తెలివిగా ప్రశ్నిస్తున్నారు.

కేటీఆర్ ను బర్తరఫ్ చేయడమే కాదు.. చంచల్ గూడ జైలుకు పంపించాలి. పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని వివరాలు ఎందుకు సేకరించలేదు? చంచల్ గూడ జైలుకు వెళ్లి కొందరు.. వారిని ఎం కౌంటర్ చేస్తామని బెదిరించి లొంగదీసుకున్నారు. అందుకే కేటీఆర్ ప్రెస్ మీట్ అయ్యాకనే వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 13 నుంచి 18 వరకు చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీ ఫుటేజ్ బయటపెట్టాలి. కస్టడీలోకి తీసుకున్న వారిని విచారించక ముందే ఇద్దరు నేరానికి పాల్పడ్డారని కేటీఆర్ ఎలా నిర్దారిస్తారు? కేటీఆర్ ఏమైనా విచారణ అధికారా? టీఎస్పీఎస్సీ లో పనిచేసే వారు పోటీ పరీక్షలు రాయడానికి అర్హత లేదు. కానీ ప్రభుత్వం పరీక్షలు రాసుకోవడానికి ఎన్ఓసీ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా 20 మందికి పైగా పోటీ పరీక్షలు రాశారు. మాధురి అమెరికా నుంచి వచ్చి గ్రూప్1 రాస్తే మొదటి ర్యాంక్ వచ్చింది. జూనియర్ అసిస్టెంట్ రజినీకాంత్ రెడ్డికి 4వ ర్యాంక్ వచ్చింది.

కేటీఆర్ కు షాడో మంత్రి పీఏ తిరుపతి. తిరుపతి, ఏ2 ముద్దాయి రాజశేఖర్ రెడ్డి ది పక్క పక్క గ్రామాలే. రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం , ప్రమోషన్ ఇప్పించింది పీఏ తిరుపతి. ఇందులో ప్రత్యక్షంగా కేటీఆర్ కు ప్రమేయం ఉంది. మాల్యాల మండలంలో గ్రూప్ 1 పరీక్షల్లో వంద మందికి పైగా 103 పైగా మార్కులు వచ్చాయి. వారి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలి. టీఎస్టీఎస్ ద్వారా రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం, ప్రమోషన్ వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలి. లీకేజీ వ్యవహారంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మీ పాత్ర ఉందొ లేదో విచారణ చేపట్టాలి. ఈ విషయం కేటీఆర్ కు తెలుసా లేదా? శ్రీ లక్ష్మీ, ప్రవీణ్,వెంకటాద్రి శ్రీదేవి, రమేష్, వాసు, మధులత లకు నిబంధనలకు వ్యతిరేకంగా పరీక్షలకు అనుమతి ఇచ్చారా లేదా? అనుమతి ఇస్తే… అనుమతించిన వ్యక్తుల పేర్లు ప్రభుత్వం బయటపెట్టాలి. కేటీఆర్ మంత్రి కార్యాలయమే అన్ని వ్యవహారాలను చక్కదిద్దింది.

ఈ ఆరోపణల నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోలేరు. 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంత తీవ్రమైన సమస్యపై సీఎం స్పందించి నిరుద్యోగులకు భరోసా ఎందుకు ఇవ్వలేదు. నిరుద్యోగుల పట్ల సీఎంకు ఇంత బాధ్యతారాహిత్యమా? కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల, ఏఆర్ శ్రీనివాస్ కు ఉన్న బంధమేంటి? రాష్ట్ర ప్రభుత్వం సిట్ కు అప్పగించిన ఏ కేసు ముందుకు సాగలేదు. పేపర్ లీకేజీ కేసును సీబీఐ కి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు… ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు. అక్కడ కేసీఆర్… ఇక్కడ కేటీఆర్ పాత్రదారులు. పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో రేపు వాదనలు వినిపిస్తాం. 21న గవర్నర్ ను కలిసి పిర్యాదు చేసి… తక్షణమే వారిని ప్రాసిక్యూట్ చేయాలని కోరతాం. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుంది. 30లక్షల మంది నిరుద్యోగులకు పిలుపునిస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X