Special Article – ప్రపంచ ఆరోగ్య దినోత్సవం : ఆరోగ్యమే ఆనందం జీవితం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంబంధిత సంస్థల ప్రాయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం.1948 లో డబ్ల్యు.హెచ్.ఓ. మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది. 1950 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7 ను జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది.

డబ్ల్యు.హెచ్.ఓ స్థాపనకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన ప్రాముఖ్యత ఉన్న అంశంపై ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించేటట్లు ఈ సంస్థ చూస్తుంది. డబ్ల్యు.హెచ్.ఓ నిర్దిష్ట ఇతివృత్తానికి సంబంధించిన రోజున అంతర్జాతీయ, ప్రాంతీయ, స్థానిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వివిధ ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రజా ఆరోగ్య సమస్యలపై ఆసక్తితో వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తారు. గ్లోబల్ హెల్త్ కౌన్సిల్ వంటి మీడియా నివేదికలలో వారి మద్దతును ప్రముఖంగా ప్రకటిస్తారు.

డబ్ల్యు.హెచ్.ఓ. గుర్తించిన ఎనిమిది అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ప్రపంచ రోగనిరోధక వారోత్సవం, ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ రక్తదాత దినోత్సవం, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంతో పాటు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా చేర్చారు.

1948లో, డబ్ల్యు.హెచ్.ఓ. మొదటి ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని నిర్వహించింది. 1950 నుండి అమలులోకి వచ్చేలా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం డబ్ల్యు.హెచ్.ఓ. యొక్క స్థాపనకు గుర్తుగా నిర్వహించబడుతుంది మరియు ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్యానికి ప్రధానమైన ఒక అంశంపై ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించడానికి సంస్థ ద్వారా ఒక అవకాశంగా పరిగణించబడుతుంది.

డబ్ల్యూ.హెచ్.ఓ. ఒక నిర్దిష్ట థీమ్‌కు సంబంధించిన రోజున అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వివిధ ప్రభుత్వాలు మరియు ప్రజారోగ్య సమస్యలపై ఆసక్తి ఉన్న ప్రభుత్వేతర సంస్థలు గుర్తించాయి, ఇవి కార్యకలాపాలను నిర్వహించడం మరియు గ్లోబల్ హెల్త్ కౌన్సిల్ వంటి మీడియా నివేదికలలో తమ మద్దతును హైలైట్ చేస్తాయి… ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ప్రపంచ ఇమ్యునైజేషన్ వారం, ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ రక్తదాతల దినోత్సవం, ప్రపంచ చాగాస్ వ్యాధి దినోత్సవం, ప్రపంచ పేషెంట్‌తో పాటు డబ్ల్యూ.హెచ్.ఓ. చే గుర్తించబడిన 11 అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఒకటి. సేఫ్టీ డే, వరల్డ్ యాంటీమైక్రోబయల్ అవేర్‌నెస్ వీక్ మరియు వరల్డ్ హెపటైటిస్ డే.

పరిశుభ్రత పాటించడం ఇలా చేయండి. చేతులు, వంట పాత్రలు, వాటిని తుడిచే గుడ్డలు, కూరగాయలను కోసే కత్తులు, పీటలపై ఏవైనా హానికరమైన సూక్ష్మక్రిములు ఉంటే అవి ఆహారంపై చేరి వ్యాధులు కలుగచేస్తాయి. తరుచూ శుభ్రంగా కడుక్కోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. ఆహారం వండడానికి ముందు, తినడానికి ముందు, మలమూత్ర విసర్జన అనంతరం చేతులు కనీసం 20 సెకండ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి.

పరిశుభ్రమైన నీటిని, ఆహార పదార్థాలను వినియోగించండి పచ్చి పండ్లు, కూరగాయలు, ఉడికించని మాంసంపై హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవచ్చు. శుభ్రంగా కడగడం, చెక్కు తీయడం వంటివి ఈ సూక్ష్మ క్రిములను తొలగిస్తాయి. వంటకు త్రాగడానికి పరిశుభ్రమైన నీటిని వాడండి. పోషక విలువలున్న తాజా ఆహార పదార్థాలనే ఉపయోగించండి. కాల పరిమితి దాటిన ఆహార పదార్థాలలో సూక్ష్మ క్రిములు పెరగవచ్చు.

ఆహార పదార్థాలను సరిగా ఉడికించండి ఆహారాన్ని ముఖ్యంగా మాంసపు ఉత్పత్తులు సముద్ర ఆహారం, గుడ్లను సరిగా ఉడికించడం ద్వారా హానికారక సూక్ష్మ క్రిములను సంహరించవచ్చు.ఉడికించిన ఆహారం మీరు తినే సమయానికి చల్లారిటైతే మరలా ఒకసారి వేడిచేసి తినండి. ఆహారాన్ని తగిన ఉష్ణోగ్రత వద్ద ఉంచండి ఉడికించిన ఆహారాన్ని వేడిగా తినండి. వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకండి. వండిన ఆహారాన్ని రెండు గంటల తరువాత తినాలనుకుంటే ఫ్రిజ్ లో 5డిగ్రీల వద్ద ఉంచి, తినే ముందు వేడిచేయండి. ఆహారాన్ని ఫ్రిజ్లో రోజుల తరబడి నిల్వ ఉంచకండి. పచ్చి మరియు ఉడికించిన ఆహారాలను విడివిడిగా ఉంచండి ఉడికించని పదార్థాలను వండిన ఆహారం నుంచి దూరంగా ఉంచండి. వాటిని వేరు వేరు పాత్రలలో ఉంచి, ఆ పాత్రలను ఒక దానికి ఒకటి దూరంగా ఉంచండి.

ఆరోగ్యమే ఆనందం…
ఆస్పత్రుల్లో జనాలు ప్రతినిత్యం గండాలు
అనారోగ్యపు ఆనవాళ్ళు ఎక్కడ చూడు దర్శనాలు
ఆహారం విషతుల్యం, గాలి నీరు కలుషితం రోగాలకు బీజాలు శరీరంతో సావాసాలు ఒత్తిడికి లోనయ్యే పనులు, గుండె పై చూపే ప్రభావాలు అర్థాయుష్షుతో జీవితాలు నమ్మకం లేని బ్రతుకులు. పుట్టుకొస్తున్న కొత్త రోగాలు విచ్చలవిడిగా తిరుగుతున్న వైరసులు
ఊహకందని మరణాలు ఆరోగ్యం పై అనుమానాలు.
వ్యాయామాలు చెయ్యం, ఉన్న కాడినుండి కదలం
నాలుగడుగులు వేయలేము, నానా అవస్థలు పడతాం.
ఆరోగ్యమే ఆనందం, సంతోషమే సగం బలం
ఈర్ష్యాద్వేషాలు వదిలేయి, తృప్తిగా జీవనం సాగిద్దాం..

కొప్పుల ప్రసాద్,
తెలుగు ఉపన్యాసకులు,
నంద్యాల.
9885066235

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X