Hyderabad: Dr. B. R. Ambedkar Open University, Department of sciences organized World Environment Day at its campus at Jubilee Hills on Monday. Prof. K. Seetharama Rao, Vice-Chancellor, planted the saplings in front of the CSTD building in the university campus.
He said the Environmental protection is everyone’s responsibility. He suggested that students must be taught about the importance of environment in educational institutions.
Dr. A.V.R.N. Reddy, Registrar; Prof. P. Madhusudhana Reddy, Director CIQA; Dr. LVK Reddy, Director Learner Support Services; Prof. Gunti Ravinder, Director Materials & Publications; Prof. Vaddanam Srinivas, Director EMR&RC; Prof. I. Anand Pawar, Director CSTD; all the Directors, Deans, Heads of branches, Teaching and Non-Teaching Staff Members and representatives of various services association are participated and planted saplings in the University campus.
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సామాన్య శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామరావు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సీ.ఎస్.టీ.డీ భవనం ముందు మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత అని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో పర్యావరణ ఆవశ్యకతను విధ్యార్థులకు తప్పనిసరిగా భోధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.ఎ.వి.ఆర్.ఎన్. రెడ్డి, సికా డైరెక్టర్ ప్రొ. పి. మధుసూధన రెడ్డి, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి, డి.ఎం.పీ. ప్రొ. గుంటి రవి , ఈ.ఎం.ఆర్.ఆర్.సి. డైరెక్టర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, సీఎస్టేడీ డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్ పలు విభాగాల డైరెక్టర్స్, డీన్స్, వివిధ శాఖల అధిపతులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.