हैदराबाद: शहर के बंसीलालपेट में एक अप्रिय मामला प्रकाश में आया है। एक महिला ने अपने दो जुड़वा बच्चों को आठवीं मंजिल से नीचे फेंक कर आत्महत्या कर ली। पता चला है कि आत्महत्या का कारण पति और ससुराल वालों का प्रताड़ित करना है।
मिली जानकारी के अनुसार, गांधीनगर पुलिस स्टेशन के बंसीलालपेट जीवीआर बस्ती में डबल-बेडरूम हाउस कॉम्प्लेक्स की 8वीं मंजिल पर रहने वाली दुर्गम्मा की बेटी सौंदर्या (26) की शादी साढ़े तीन साल पहले बोडुप्पल के गणेश से हुई थी। सौंदर्या और गणेश को डेढ़ साल के जुड़वां बच्चे हैं।
आपको बता दें कि वेंकन्ना और दुर्गम्मा को चार बेटियां हैं। सौंदर्या सबसे छोटी हैं। शादी के समय गणेश को ढाई लाख रुपये दहेज दिया था। साथ ही यदाद्री में जो जमीन थी वह भी दे दी। वह जमीन सौंदर्या के नाम पर है। उप्पल में एक कटिंग दुकान में काम करने वाले गणेश ने शादी के कुछ दिन बाद से ही सौंदर्या को अधिक दहेज के लिए प्रताड़ित करने लगा।
गणेश व ससूराल वाले अतिरिक्त दहेज लाने के लिए सौंदर्या को प्रताड़ित करने लगे। सौंदर्या और उसके माता-पिता को डबल बेडरूम और जमीन उसके नाम करने के लिए दबाव डाल रहा थे। इतना ही नहीं, शादी के बाद पत्नी के मोटी होने और सुंदर नहीं दिखने को लेकर भी परेशान करने लगे थे।
ससुर वालों की उत्पीड़ना से तंग सौंदर्या कुछ दिन पहले बच्चों को लेकर अपनी मां दुर्गम्मा के पास आ गई। माता-पिता ने यादगिरिगुट्टा में जो प्लॉट है उसे गणेश के नाम लिख देने के लिए राजी हो गये। फिर भी दो-तीन दिन से प्रताड़ित करना अधिक हो गया। पति के उत्पीड़न तंग और अपने माता-पिता को बार-बार परेशान करना ठीक नहीं मानकर सौंदर्या ने कठिन निर्णय लिया।
इसी क्रम में सोमवार को सौंदर्या ने पहले अपने दोनों बच्चों को आठवीं मंजिल से नीचे फेंक दिया और बाद में खुद भी नीते कूद गई। इसके चलते तीनों की गंभीर रूप से घायल हो जाने से मौके पर ही मौत हो गई। सूचना मिलते ही पुलिस तत्काल मौके पर पहुंची और शवों को पोस्टमार्टम के लिए गांधी अस्पताल भेज दिया।
पुलिस ने मां की तहरीर पर मामला दर्ज कर लिया है और आत्महत्या की जांच कर रही है। इसकी जानकारी मिलते ही मंत्री तलसानी श्रीनिवास यादव मौके पर पहुंचे और पीड़ित परिवार को सांत्वना दी और मामले की जानकारी ली।
ఆ మహిళ కవలలను ఎనిమిదో అంతస్తు నుంచి కిందకు తోసేసి, ఆపై తానూ దూకేసింది
హైదరాబాద్: బన్సిలాల్‌పేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన ఇద్దరు కవల పిల్లల్ని ఎనిమిదో అంతస్తు నుంచి కింద పడేసి అనంతరం తాను కూడా దూకేసి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇందుకు కారణం కట్టుకున్న భర్త, అత్తమామల వేధింపులే అని తెలుస్తోంది.
అయితే గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బన్సీలాల్‌పేట జీవైఆర్ బస్తీలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలోని 8వ అంతస్తులో నివసించే దుర్గమ్మ కూతురైన సౌందర్య (26)కు బోడుప్పల్‌కి చెందిన గణేష్‌తో మూడున్నర సంవత్సరాల కిందట వివాహం జరిగింది. సౌందర్య, గణేష్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న ఇద్దరు కవల పిల్లలున్నారు.
అయితే వెంకన్న, దుర్గమ్మ దంపతులకు నలుగు కూమర్తెలు కాగా సౌందర్య చిన్నమ్మాయి. పెళ్లి సమయంలో గణేష్‌కు రెండున్నర లక్షల కట్నం ఇచ్చారు. దాంతో పాటు యాదాద్రి వద్ద ఉన్న ల్యాండ్ కూడా ఇచ్చారు. అయితే ఆ ల్యాండ్ సౌందర్య పేరు మీద ఉంది. ఉప్పల్‌లోని ఓ కటింగ్ షాప్‌లో పని చేస్తోన్న గణేష్ పెళ్లైన కొద్ది రోజుల నుంచే వేధింపులు ప్రారంభించాడు.
అదనపు కట్నం తీసుకురావలంటూ గణేష్, అత్తింటి వాళ్లు సూటిపోటి మాటల్తో ఇబ్బంది పెడుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా తన పేరు మీద రాయాలని యాదాద్రిలో ఉన్న ల్యాండ్‌ని తన పేరు మీద రాయాలని వేధిస్తున్నాడు. పెళ్లి అయిన తర్వాత లావుగా అయ్యావని అందంగా లేవని తరూచూ భర్త సూటిపోటి మాటలనేవాడు.
వాళ్లు పెడుతున్న వేధింపులు భరించలేక సౌందర్య కొన్ని రోజులు కిందటే తల్లి దుర్గమ్మ దగ్గరికి పిల్లలను తీసుకుని వచ్చేసింది. యాదగిరి గుట్టలోని ప్లాట్ రాసిచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రాగా గత రెండు మూడు రోజులుగా భర్త గణేష్ వెదింపులు అధికం అయ్యాయి. అటు భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక ఇటు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక సౌందర్య కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే సోమవారం రోజున సౌందర్య తన ఇద్దరు పిల్లల్ని ఎనిమిదో అంతస్తు నుంచి కింద పడేసి అనంతరం తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రస్థాయిలో గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. (ఏజెన్సీలు)